By: Rama Krishna Paladi | Updated at : 01 Sep 2023 06:25 PM (IST)
యూపీఐ లావాదేవీలు ( Image Source : File Pic )
UPI Payments:
భారత్ వడివడిగా పూర్తి స్థాయి డిజిటల్ ఎకానమీ వైపు అడుగులు వేస్తోంది. డిజిటల్ చెల్లింపుల్లో రికార్డులు సృష్టిస్తోంది. పాత రికార్డులను బద్దలు కొడుతోంది. ఫోన్ ద్వారా డబ్బులు చెల్లించడం ఇప్పుడొక నిత్యావసరంగా మారింది. అందుకు ఆగస్టు నెల యూపీఐ లావాదేవీలే నిదర్శనం.
ఆగస్టు నెలలో యూపీఐ లావాదేవీల సంఖ్య 10 బిలియన్లు దాటేసింది. యూనిఫైడ్ పేమెంట్ టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఏడేళ్లలో ఒక నెలలో ఇన్ని జరగడం ఇదే తొలిసారి. ఈ లావాదేవీల మొత్తం విలువ రూ.15 లక్షల కోట్లు కావడం గమనార్హం.
యూపీఐ ద్వారా రోజుకు 300 కోట్ల చెల్లింపులు చేయగల సామర్థ్యం భారత్‌కు ఉందని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో దిలీప్ అస్బే మార్చిలో పేర్కొన్న సంగతి తెలిసిందే. సరైన పెట్టుబడులు వస్తే ఇదేమీ అసాధ్యం కాదన్నారు.
'యూపీఐ లావాదేవీలు 10 బిలియన్లకు చేరుకున్నాయి. ఇవి ఇంకా పెరిగేందుకు అవకాశం ఉంది. పీ2ఎం లావాదేవీలు వార్షిక ప్రాతిపదికన 100 శాతం వేగంతో పెరుగుతున్నట్టు డేటా ద్వారా తెలుస్తోంది. పీ2పీ లావాదేవీల కన్నా ఎక్కువే' అని వరల్డ్ లైన్ ఇండియా స్ట్రాటజీ, ఇన్నోవేషన్, అనలిటిక్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సునిల్ రొంగాల అన్నారు.
'రాబోయే కాలంలో పీ2ఎం లావాదేవీలే యూపీఐ లావాదేవీల వృద్ధికి ఊతంగా మారతాయి. మరో 18-20 నెలల్లో యూపీఐ లావాదేవీలు నెలకు 20 బిలియన్లు దాటితే ఆశ్చర్యమేమీ లేదు' అని సునిల్ అంచనా వేశారు.
ప్రస్తుతం పీర్ టు పీర్, మర్చంట్ లావాదేవీలను పక్కన పెడితే ఐపీవో, యూపీఐ క్రెడిట్ యూపీఐని వాడుతున్నారు. ఇక ఫీచర్ ఫోన్ల కోసం ఎన్‌పీఐసీఐ ఇప్పటికే UPI 123Payను ప్రవేశపెట్టింది. ఇక విదేశాల్లోనూ విస్తరిస్తే యూపీఐ రికార్డులు మార్మోగిపోతాయి. ఫ్రాన్స్, సింగపూర్, భూటాన్, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక, బహ్రెయిన్‌లో ఈ టెక్నాలజీని వాడుతున్నారు.
'రియల్ టైమ్ పేమెంట్స్ రంగంలో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదిగింది. ఈ విజయానికి యూపీఐ టెక్నాలజీయే కారణం. G20 అధ్యక్షత, ప్రభుత్వ ప్రోత్సాహంతో ప్రపంచ వ్యాప్తంగా యూపీఐ సాంకేతికత మరిన్ని శిఖరాలు అధిరోహించనుంది' అని సర్వత్రా టెక్నాలజీస్ స్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ మందర్ అఘాషే అన్నారు.
ప్రస్తుతం 20 కోట్ల మంది భారతీయులు యూపీఐ సాంకేతికను వాడుతున్నారని సమాచారం. ఈ సంఖ్య కొద్ది కాలంలోనే మూడు రెట్లు పెరుగుతుందని అంచనా. దేశంలోని 15 కోట్ల మర్చంట్స్‌లో 5 కోట్ల మందే యూపీఐని ఉపయోగిస్తున్నారు. వీరూ 3 రెట్లు పెరుగుతారు. ఇందుకు మరిన్ని పేమెంట్ అప్లికేషన్లు అవసరమని భావిస్తున్నారు. సరైన పెట్టుబడులు పెడితే ఇదేమీ కష్టం కాదంటున్నారు. యూపీఐ వ్యాపారంలోకి అడుగుపెట్టే వారికోసం నిబంధనలు సులభతరం చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే, గూగుల్‌పేదే అజమాయిషీ. 80-90 శాతం వరకు యూపీఐ లావాదేవీలే వీటి ద్వారానే జరుగుతున్నాయి. జులైలో ఫోన్‌పే ద్వారా రూ.7.61 లక్షల కోట్ల విలువైన 4.7 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. గూగుల్ పేలో రూ.5.2 లక్షల కోట్ల విలువైన 3.5 బిలియన్ల లావాదేవీలు రికార్డు అయ్యాయి. ఒక ప్లాట్‌ఫామ్‌గా యూపీఐ 14.75 లక్షల కోట్ల విలువైన 9.3 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది.
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం