search
×

Pan-Aadhar: టాక్స్‌ పేయర్లకు ఫైనల్‌ కాల్‌, ఈరోజు మిస్సయితే ఇక ఛాన్స్‌ లేనట్లే!

రిఫండ్‌ రాదు. పాన్‌ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు.

FOLLOW US: 
Share:

Aadhar-PAN Linking: భారతీయ పౌరులకు ఇవాళ చాలా కీలకమైన రోజు. ఒకవేళ మీరు టాక్స్‌ పేయర్‌ అయితే.. టాక్స్‌ రిటర్న్‌ (ITR) ఫైల్‌ చేసే ముందు కచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సిన రోజిది. మీ ఆధార్-పాన్ కార్డ్‌ లింక్‌ చేయడానికి 'ఫైనల్‌ డే' (30 జూన్ 2023) ఈ రోజే. మీ పాన్‌-ఆధార్‌ అనుసంధానాన్ని మీరు ఇప్పటికీ పూర్తి చేయకపోతే, మిగిలిన పనులన్నీ పక్కనబెట్టి, ఇప్పుడే లింకేజ్‌ పనిని పూర్తి చేయండి. ఈ రోజు మిస్సయితే, డేట్‌ ఎక్స్‌టెన్షన్‌ ఛాన్స్‌ దొరక్కపోవచ్చు. 

మీరు ఐటీ రిటర్న్‌ దాఖలు చేయాలంటే, ముందుగా మీ ఆధార్- పాన్ కార్డ్‌ను కచ్చితంగా లింక్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ జత కుదర్చకపోతే ITR ఫైల్‌ చేయలేరు. ఒకవేళ ITR ఫైల్‌ చేసేందుకు టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ అనుమతించినా, కొన్ని టాక్స్‌ బెనిఫిట్స్‌ను కచ్చితంగా మిస్‌ అవుతారు/నష్టపోతారు.

వాస్తవానికి, ఈ ఏడాది మార్చి 31వ తేదీతోనే ముగిసిన పాన్‌-ఆధార్ నంబర్‌ అనుసంధానం డెడ్‌లైన్‌ను ‌(PAN-Aadhaar Link Deadline) CBDT పెంచింది. పన్ను చెల్లింపుదార్లకు ఉపశమనం కలిగించేందుకు జూన్ 30వ తేదీ వరకు ఎక్స్‌టెండ్‌ చేసింది. మీరు ఈరోజు లోగా పాన్‌-ఆధార్‌ లింక్‌ పూర్తి చేయడానికి రూ. 1,000 జరిమానా కడితే సరిపోతుంది. జులై 1 నుంచి ఇదే పని కోసం (టాక్స్‌పేయర్‌ అయినా, కాకపోయినా) రూ.10 వేలు ఫైన్‌ కట్టాల్సిరావచ్చని సమాచారం. 

పాన్ కార్డ్‌తో ఆధార్‌ లింక్ చేయకపోతే ఏంటి నష్టం?
30 జూన్ 2023లోపు పాన్ కార్డ్‌తో ఆధార్‌ను లింక్ చేయకపోతే, సదరు వ్యక్తి పాన్ కార్డ్ నాన్-ఆపరేటివ్‌గా మారుతుంది. ఆ తర్వాత అధిక జరిమానా ఎదుర్కోవలసి వస్తుంది. పాన్‌-ఆధార్‌ లింక్‌ కాకపోతే, టాక్స్‌ పేయర్‌కు రిఫండ్‌ రాదు. పాన్‌ పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించరు. అలాగే, అలాంటి పన్ను చెల్లింపుదార్ల నుంచి ఎక్కువ TDS & TCS వసూలు చేస్తారు. అంతేకాదు, పాన్ కార్డ్‌-ఆధార్‌ అనుసంధానం కాకపోతే ఆర్థికపరమైన లావాదేవీల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. బ్యాంక్‌ అకౌంట్, డీమాట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేయలేరు. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టలేరు. పాన్ కార్డ్‌ అవసరమైన ప్రతి చోట పని ఆగిపోతుంది. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేసి, ఫైన్‌ కట్టిన తర్వాత 30 రోజుల్లో పాన్ మళ్లీ క్రియాశీలంగా మారుతుంది.

పాన్-ఆధార్ లింక్ నుంచి మినహాయింపు పొందిన వ్యక్తులు, వాటిని అనుసంధానించాల్సిన అవసరం లేదు. నిర్దిష్ట రాష్ట్రాల్లో నివసించే వ్యక్తులు, చట్టం ప్రకారం నాన్ రెసిడెంట్‌లు, భారతీయ పౌరులు కాని వాళ్లు, గత సంవత్సరం నాటికి 80 ఏళ్లు పైబడిన వాళ్లు మినహాయింపు వర్గంలోకి వస్తారు.

ఆధార్-పాన్‌ను ఎలా లింక్ చేయాలి?
ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ను ఓపెన్‌ చేయండి.
ఈ వెబ్‌సైట్‌లో (ఇప్పటికీ చేయకపోతే) రిజిస్టర్‌ చేయసుకోండి.
మీ పాన్ (పర్మినెంట్‌ అకౌంట్‌ నంబర్‌) మీ యూజర్‌ ID అవుతుంది.
యూజర్ ID, పాస్‌వర్డ్, పుట్టిన తేదీని నమోదు చేసి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు, మీ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి పాప్-అప్ విండో ఓపెన్‌ అవుతుంది.
పాప్ అప్ విండో తెరుచుకోకపోతే, మెనూ బార్‌లోని 'ప్రొఫైల్ సెట్టింగ్స్‌'లోకి వెళ్లి 'లింక్ ఆధార్'పై క్లిక్ చేయండి.
పాన్‌ కార్డ్‌లో ఉన్న ప్రకారం మీ పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు అక్కడ కనిపిస్తాయి.
మీ ఆధార్, పాన్ కార్డ్ వివరాలను సరిచూసుకోండి.
వివరాలు సరిపోలితే, మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేసి, "లింక్ నౌ" బటన్‌పై క్లిక్ చేయండి.
మీ ఆధార్ మీ పాన్‌తో విజయవంతంగా లింక్ అయిందన్న పాప్-అప్ మెసేజ్‌ మీకు తెలియజేస్తుంది.

మరో ఆసక్తికర కథనం: గోల్డెన్‌ ఛాన్స్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 30 Jun 2023 10:45 AM (IST) Tags: Income Tax Aadhar PAN return filing linking

ఇవి కూడా చూడండి

Latest Gold-Silver Price 29 September 2023: నేల చూపుల్లో గోల్డ్‌, షాక్‌ ఇచ్చిన సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 29 September 2023: నేల చూపుల్లో గోల్డ్‌, షాక్‌ ఇచ్చిన సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

FD Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా?, సెప్టెంబర్‌లో FD రేట్లను సవరించిన లీడింగ్‌ బ్యాంకులు ఇవే!

FD Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా?, సెప్టెంబర్‌లో FD రేట్లను సవరించిన లీడింగ్‌ బ్యాంకులు ఇవే!

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Gold-Silver Price 29 September 2023: ఆరు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 29 September 2023: ఆరు నెలల కనిష్టంలో పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

Money Rules: రెడీగా ఉండండి - అక్టోబర్‌ 1 నుంచి చాలా మార్పులు, నేరుగా మీ డబ్బుపై ప్రభావం

టాప్ స్టోరీస్

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

బెంగళూరులో 44 విమానాలు రద్దు, కర్ణాటక బంద్ ఎఫెక్ట్ - ప్రయాణికుల ఇబ్బందులు

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Devara Movie: రికార్డు ధర పలికిన ‘దేవర‘ డిజిటల్ రైట్స్, కొన్నది ఏ ఓటీటీ సంస్థో తెలుసా?

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

Salaar Release Date: ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్, ఆ రోజు ప్రభాస్ అభిమానులకు పండగే

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!

World Cup 2023: హైదరాబాద్‌లో పాక్‌xకివీస్‌ వార్మప్‌ మ్యాచ్‌! వర్షం కురిసే ఛాన్స్‌!