By: ABP Desam | Updated at : 02 Jul 2022 08:09 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్
Stock Market Weekly Review: భారత స్టాక్ మార్కెట్లు ఈ వారం ఇన్వెస్టర్లకు ఊహించని షాకిచ్చాయి! అంతకు ముందు వారం కీలక స్థాయిల వద్ద మద్దతు దొరకడంతో సూచీలు పైకి ఎగుస్తాయని అంతా భావించారు. బీఎస్‌ఈ సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ పతనానికి బ్రేకులు పడతాయని అనుకున్నారు. కానీ వారి ఆశలు అడియాసలే అయ్యాయి. గ్యాప్ డౌన్‌తో ఆరంభమై రికవరీ బాట పట్టాయి. మార్కెట్లో బలహీనతను ప్రతిబింబించాయి. ఐదు ట్రేడింగ్ సెషన్లలో మూడు రేంజ్‌బౌండ్‌లో ముగిశాయి.
1000 పాయింట్ల మేర ఊగిసలాట
జూన్ 26తో మొదలైన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) ఒడుదొడుకుల్లోనే కదలాడింది. తొలి రెండు రోజులు లాభాల బాట పడితే మిగతా మూడు రోజులు నష్టపోయింది. సోమవారం 52,727 వద్ద ఆరంభమైన సూచీ 52,101 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని తాకింది. ఆ తర్వాత 53,498 వద్ద గరిష్ఠ స్థాయిని అందుకుంది. చివరికి 0.34 శాతం లాభంతో 52,907 వద్ద ముగిసింది. అంటే 180 పాయింట్లు మాత్రమే పెరిగింది. ట్రేడింగ్ వాల్యూమ్ సైతం ఎక్కువేం లేదు.
ఒడుదొడుకుల్లోనే నిఫ్టీ
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) సైతం ఇదే దారిలో నడిచింది. సోమవారం 15,916 వద్ద ఓపెనైంది. 15,511 వద్ద వారాంతపు కనిష్ఠాన్ని అందుకుంది. ఆ తర్వాత పుంజుకొని 15,925 వద్ద గరిష్ఠ స్థాయికి చేరుకుంది. చివరికి 15,752 వద్ద ముగిసింది. 0.34 శాతం మాత్రమే లాభపడింది. నెలవారీగా చూసుకున్నా 0.18 శాతం నష్టపోయింది.
సందిగ్ధంలో ఇన్వెస్టర్లు
ప్రస్తుతానికి మార్కెట్లో లాభాలకు ఆస్కారం కనిపించడం లేదు. ఎప్పుడేం జరుగుతుందో తెలియడం లేదు. ఆసియా, ఐరోపా మార్కెట్లను అనుసరించి భారత ఈక్విటీ మార్కెట్ల గమనం ఉంటుంది. రూపాయి పతనం ఎక్కువగా ప్రభావం చూపిస్తోంది. చాలా వరకు క్వాలిటీ స్టాక్స్ 52 వారాల కనిష్ఠ స్థాయికి పతనమయ్యాయి. ద్రవ్యోల్బణం, మాంద్యానికి మదుపర్లు అలవాటు పడ్డారు. సూచీలు ఎక్కువగా పడటంతో లాంగ్‌టర్మ్, వాల్యూ ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లు చేపట్టే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్‌లో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
కొత్త సంవత్సరం మొదటి రోజే షాక్ ఇచ్చిన బంగారం, వెండి! జనవరి 1 2026న మీ నగరంలో తాజా రేటు తెలుసుకోండి
Year Ender 2025: పాతికేళ్లలో బంగారం కంటే భారీగా వెండి వృద్ధి; రూ.7,900 నుంచి రూ.2.4 లక్షల వరకు!
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం