ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. నిజంగానే ఆరోగ్య రంగంలోని ఈ కంపెనీ షేరు మదుపర్లకు 'మహా భాగ్యం'గానే మారింది. వారి పోర్టుపోలియోలో మరింత సంపదను పోగేసింది. కేవలం ఏడు నెలల కాలంలోనే 300 శాతం పెరిగింది. హెల్త్‌కేర్‌, వెల్‌నెస్‌ రంగానికి చెందిన ఆ కంపెనీయే 'న్యూరెకా'. 2021లో ఐపీవోకు వచ్చిన కంపెనీల్లో లక్ష్మీ ఆర్గానిక్‌ ఇండస్ట్రీస్‌ (360 శాతం) తర్వాత రెండో అతిపెద్ద లాభదాయక కంపెనీగా రికార్డు సృష్టించింది.


2021, సెప్టెంబర్‌ 16 నాటికి న్యూరెకా ఏకంగా 333 శాతం ర్యాలీ అయింది. ఇష్యూ ధర రూ.400తో పోలిస్తే ఇదెంతో ఎక్కువనే చెప్పాలి. బీఎస్‌ఈలో నమోదైన ఫిబ్రవరి 25నే 66.66 శాతం లాభపడి 666.65 వద్ద ముగిసింది.


Also Read: Sensex Today: రంకెలేస్తున్న బుల్‌.. 60వేల వైపు అడుగులు.. 400+ ర్యాలీ అయిన సెన్సెక్స్


పెరుగుదలకు కారణాలేంటి?
న్యూరెకా షేరు పెరుగుదలకు చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా కొవిడ్‌-19 ఇందుకు దోహదం చేసింది. హెల్త్‌కేర్‌, వెల్‌నెస్‌ రంగంల్లో మెరుగైన వృద్ధి నమోదు చేసింది. డాక్టర్‌ ట్రస్ట్‌ పేరుతో పల్స్‌ ఆక్సీమీటర్లు, రక్తపోటు మానీటర్ల వంటివి విక్రయించింది. వాటితో పాటు ఇతర ఆరోగ్య ఉత్పత్తులు విక్రయాలు పెరగడంతో ఆర్థికంగా మెరుగుపడింది. పైగా అప్పులను తగ్గించుకోగలిగింది.


Also Read: ఈ రోజు మళ్లీ బంగారం మెరుపుల్, నిన్న పెరిగి ఈరోజు తగ్గిన ధరలు. ఢిల్లీలో మాత్రం రూ.50 వేలు దాటిన పసిడి, ఓవరల్ గా వెండిధరలు తగ్గినా ఉత్తరాది కన్నా దక్షిణాదిన స్వల్ప పెరుగుదల…


విశ్లేషకులు ఏమంటున్నారంటే?
'కొవిడ్‌-19 తర్వాత పల్స్‌ ఆక్సీమీటర్లు, రక్తపోటు మానీటర్లు, బరువు తూచే యంత్రాలు, నెబ్యులైజర్ల తరహా ఆరోగ్య ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్‌ పెరిగింది. న్యూరెకా దాదాపుగా రుణరహితంగా మారింది. ఈక్విటీపై మెరుగైన రాబడి ఇస్తోంది' అని ట్రస్టులైన్‌ రీసెర్చ్‌ అనలిస్టు అపరాజితా సక్సేనా అంటున్నారు. రాబోయే త్రైమాసికాల్లోనే డిమాండ్‌ ఇలాగే ఉంటుందని ఆమె అంచనా వేశారు.


Also Read: Ola Electric Scooter: అమ్మకాల్లో ఓలా స్కూటర్ రికార్డు.. మొత్తం టూవీలర్ ఇండస్ట్రీనే మించేలా.. ఎన్ని అమ్ముడుపోయాయంటే?


రూ.2000 వద్ద నిరోధం!
కంపెనీ విడుదల చేసిన చివరి ఆర్థిక ఫలితాల్లోనూ రాబడి నిష్ఫత్తులు బాగున్నాయి. ఈక్విటీపై రాబడి 67, పెట్టుబడిపై రాబడి 52 శాతంగా ఉంది. కాగా షేరు అతి త్వరలోనే రూ.2000లకు చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2021, ఆగస్టు 4న ఈ షేరు రూ.2000కు చేరుకుంది. మదుపర్లు లాభాలు స్వీకరించడం, అమ్మకాలు పెరగడంతో ప్రస్తుతం రూ.1730 స్థాయిల్లో కొనసాగుతోంది. 


Also Read: SBI Home Loan: శుభవార్త! ఇంటి రుణాలపై వడ్డీ తగ్గించిన ఎస్‌బీఐ.. ఎంత ఆదా చేసుకోవచ్చంటే!