By: Arun Kumar Veera | Updated at : 12 Feb 2025 11:49 AM (IST)
స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ 12 ఫిబ్రవరి 2025 ( Image Source : Other )
Stock Market Crash On Selling Pressure: భారత స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా మూడవ రోజు కూడా తీవ్ర నష్టాలతో ప్రారంభమైంది. FMCG, బ్యాంకింగ్, ఇంధన రంగాలపై ఒత్తడి కారణంగా, ప్రధాన ఇండెక్స్‌లు BSE సెన్సెక్స్ & NSE నిఫ్టీ రెండూ భారీగా క్షీణించాయి. ఈ రోజు, వరుసగా మూడో రోజు, మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. మార్కెట్ మొత్తం ప్రెజర్ కుక్కర్‌లో పడేసిన పప్పులా ఉడుకుతుంటే, ఐటీ స్టాక్స్ మాత్రం పెరుగుదలను చూస్తున్నాయి.
మంగళవారం 23,071 దగ్గర క్లోజ్ అయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఈ రోజు (బుధవారం, 12 ఫిబ్రవరి 2025) కేవలం 21 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయింది. అయితే, అక్కడి నుంచి నిట్టనిలువుగా పడిపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ కూడా 105 పాయింట్ల నష్టంతోనే ప్రారంభమైనప్పటికీ, ఓపెనింగ్ టైమ్ నుంచీ ఒత్తిడి ఎదుర్కోంది, భారీగా క్షీణించింది. అమ్మకాల దెబ్బకు సెన్సెక్స్ 76000 పాయింట్ల దిగువకు & నిఫ్టీ 23000 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ఈ వారం ప్రారంభంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు & అల్యూమినియం దిగుమతులపై సుంకాలు విధించాలని నిర్ణయించినప్పటి నుంచి మార్కెట్ భారీ క్షీణతను చూస్తోంది. SIPలపై, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ ఎస్ నరేన్ చేసిన వ్యాఖ్యలతో మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అమ్మకాలు కంటిన్యూ అవుతున్నాయి.
పెట్టుబడిదారులకు రూ.6.50 లక్షల కోట్ల నష్టం
మార్కెట్లో భారీ అమ్మకాల కారణంగా, ఈ రోజు ఓపెనింగ్ సెషన్‌లో, 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 24 స్టాక్‌లు లాస్‌లో ట్రేడవుతున్నాయి, 6 స్టాక్స్ మాత్రమే పెరుగుదలను చూశాయి. బీఎస్‌ఈలో లిస్ట్ అయిన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం నాటి రూ. 408.52 లక్షల కోట్ల నుంచి ఇప్పుడు రూ.402.12 లక్షల కోట్లకు తగ్గింది. అంటే ఈ రోజు ఓపెనింగ్ ట్రేడింగ్‌లో పెట్టుబడిదారులు రూ.6.40 లక్షల కోట్ల నష్టాన్ని చవిచూశారు.
తగ్గిన & పెరిగిన స్టాక్స్
నేటి ఓపెనింగ్ సెషన్‌లో... మహీంద్ర అండ్ మహీంద్ర 3.96 శాతం, జొమాటో 3.37 శాతం, రిలయన్స్ 3.01 శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 2.26 శాతం, ఐటీసీ 2.02 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.97 శాతం, పవర్ గ్రిడ్ 1.84 శాతం, అదానీ పోర్ట్స్ 1.76 శాతం, ఏషియన్ పెయింట్స్ 1.54 శాతం క్షీణించాయి. టీసీఎస్ 1.01 శాతం, టెక్ మహీంద్రా 0.92 శాతం, ఇన్ఫోసిస్ 0.49 శాతం, సన్ ఫార్మా 0.10 శాతం చొప్పున లాభాల్లో ట్రేడవుతున్నాయి.
రంగాల వారీగా పరిస్థితి
నేటి ఓపెనింగ్ ట్రేడింగ్‌లో, నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 1200 పాయింట్లు లేదా 2.37 శాతం క్షీణించింది, 50000 స్థాయిని బద్దలు కొట్టి 49582 స్థాయికి పడిపోయింది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ విషయంలోనూ ఇదే జరిగింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 500 పాయింట్లు లేదా 3.20 శాతం తగ్గి 15558 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
ఉదయం 10.45 గంటలకు, BSE సెన్సెక్స్ 670.56 పాయింట్లు లేదా 0.88% నష్టంతో 75,623.04 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ 204.10 పాయింట్లు లేదా 0.88% తగ్గి 22,867.70 దగ్గర ట్రేడవుతోంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: ఎట్టకేలకు తగ్గిన పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Free Current: ఈ వేసవిలో AC వేసినా కరెంట్ బిల్లు రాదు, రోజంతా చల్లగా ఉండండి
Gold Hits All Time High: 10 గ్రాముల పసిడి కోసం లక్షలు ఖర్చు పెట్టాలా?, మూడు నెలల్లో మెగా ర్యాలీ
Education Loan: రూ.50 లక్షల విద్యారుణంపై టాప్-10 బ్యాంకుల్లో తాజా వడ్డీ రేట్లు ఇవీ
Home Loan EMI Calculator: రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే ఎంత EMI చెల్లించాలి, EMIని ఎలా లెక్కిస్తారు?
Gold-Silver Prices Today 18 Mar: మళ్లీ భారీ జంప్, కొత్త రికార్డ్ కొట్టిన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Harish Rao News: ప్రశ్నోత్తరాలపై సమాధానం చెప్పలేక ప్రభుత్వం పారిపోతుంది - హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
Andhra Pradesh Assembly: ఎమ్మెల్సీల గ్రూప్ ఫోటో సెషన్లో సరదా ముచ్చట్లు - వారితో ఫోటో దిగడం తన అదృష్టమన్న చంద్రబాబు
TG High Court: రూ.1 కోటి జరిమానా విధించిన తెలంగాణ హైకోర్టు, తప్పుదోవ పట్టిస్తావా అంటూ పిటిషనర్‌పై ఆగ్రహం
Dhoni Animal Ad: సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ధోనీ - మరోసారి 'యానిమల్'తో అదరగొట్టారుగా..