search
×

SGB Scheme: డబ్బులు రెడీగా పెట్టుకోండి, అతి త్వరలో సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ జారీ

Sovereign Gold Bonds SGB: సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ ద్వారా 999 కేరట్ల స్వచ్ఛమైన బంగారాన్ని తక్కువ రేటుకే కొనొచ్చు.

FOLLOW US: 
Share:

Sovereign Gold Bond Scheme: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లకు సువర్ణావకాశం అతి త్వరలో రాబోతోంది. 2023-24 సిరీస్‌లో చివరి విడత సావరిన్ గోల్డ్ బాండ్లను (SGBs) ఇన్వెస్టర్లకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ (RBI) సిద్ధమవుతోంది.

2023-24 సిరీస్‌లో నాలుగో విడత SGB స్కీమ్‌ ఈ నెల 12 నుంచి ప్రారంభమవుతుంది. అంటే, SGB సబ్‌స్క్రిప్షన్ 2024 ఫిబ్రవరి 12న ఓపెన్ అవుతుంది, 16న ముగుస్తుంది. 

2023 డిసెంబర్‌ 18-22 తేదీల్లో మూడో విడత ముగిసింది. అప్పుడు, బంగారం ధరను గ్రాముకు రూ. 6,199గా కేంద్ర బ్యాంక్‌ నిర్ణయించింది. 2023-24 సిరీస్‌లో మొదటి విడత జూన్‌ 19-23 తేదీల్లో; రెండో విడత సెప్టెంబర్‌ 11-15 తేదీల్లో జరిగాయి. మొదటి విడతలో ఒక్కో గ్రాము బంగారాన్ని రూ. 5,926 చొప్పున అమ్మిన కేంద్రం ప్రభుత్వం, రెండో విడతలో గ్రాముకు ఇష్యూ ప్రైస్‌ రూ.5,923 గా నిర్ణయించింది. 

ఫిబ్రవరి విడతలో గ్రాము పసిడి ధరను రిజర్వ్‌ బ్యాంక్‌ అతి త్వరలో ప్రకటిస్తుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ ద్వారా 999 కేరట్ల స్వచ్ఛమైన బంగారాన్ని తక్కువ రేటుకే కొనొచ్చు. కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ పసిడి బాండ్లను జారీ చేస్తుంది.

పసిడి ధర ఎప్పుడు నిర్ణయిస్తారు?
సబ్‌స్క్రిప్షన్ ప్రారంభ తేదీకి ముందున్న మూడు పని దినాల్లో, 999 కేరట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా SGB ఇష్యూ ప్రైస్‌ను నిర్ణయిస్తారు. ఆయా రోజుల్లో 'ఇండియా బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌' నిర్ణయించిన ధరలను ప్రామాణికంగా తీసుకుంటారు.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి? (What is Sovereign Gold Bond Scheme?)
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు. సావరిన్ గోల్డ్ బాండ్‌ అనేది డిజిటల్‌ బంగారం. భౌతికంగా కనిపించదు. భౌతిక బంగారాన్ని ఇంట్లో ఉంచుకుంటే దొంగల భయం సహా కొన్ని రిస్క్‌లు ఉంటాయి. ఈ ఇబ్బందులను తప్పించడంతో పాటు భౌతిక బంగారం కొనుగోళ్లను నిరుత్సాహపరచడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (SGB Scheme). 

ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ (Rs.50 discount per gram in SGB)
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో బంగారాన్ని బాండ్‌ రూపంలో ఇష్యూ చేస్తారు. ఒక బాండ్‌ ఒక గ్రాము బంగారానికి సమానం. బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసి, డిజిటల్‌ పద్ధతిలో డబ్బులు చెల్లిస్తే ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. 

సావరిన్ గోల్డ్ బాండ్ కాల పరిమితి (Sovereign Gold Bond Tenure)
ఒక్కో గోల్డ్‌ బాండ్‌ కాల పరిమితి 8 సంవత్సరాలు. బాండ్ హోల్డర్‌ కోరుకుంటే, ఈ బాండ్లను 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్‌ చేసుకోవచ్చు. ఆ రోజున ఉన్న రేటుకు బాండ్లను సరెండర్‌ చేయవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల వల్ల ఏంటి లాభం? (benefit of sovereign gold bonds)
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో ‍‌(Coupon rate) వడ్డీ చెల్లిస్తారు. బాండ్‌ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ వడ్డీని 6 నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. భౌతిక బంగారం కొనుగోలులో వర్తించే మేకింగ్‌, జీఎస్టీ వంటి అదనపు బాడుదు గోల్డ్‌ బాండ్లకు ఉండదు. 

TDS ఉండదు (No TDS on Sovereign Gold Bonds)
SGBలను పూర్తి సమయం హోల్డ్‌ చేసి రిడీమ్‌ చేసుకుంటే వచ్చే డబ్బుకు TDS (Tax Deducted at Source) వర్తించదు.

SGBలపై ఆదాయ పన్ను (Tax on SGBs)
కొన్న తేదీ నుంచి మూడేళ్ల ముందు SGBలను అమ్మితే వచ్చే డబ్బు స్వల్పకాలిక మూలధన లాభాల కిందకు వస్తుంది, వ్యక్తిగత ఆదాయానికి యాడ్‌ అవుతుంది. ఆదాయ పన్ను వర్తించే శ్లాబ్‌ సిస్టమ్‌ ప్రకారం పన్ను చెల్లించాలి. 3 సంవత్సరాల తర్వాత అమ్మితే దీర్ఘకాలిక మూలధన లాభాల కింద (ఇండెక్సేషన్‌ ప్రయోజనం అనంతరం) టాక్స్‌ కట్టాలి.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎలా కొనాలి? (How to buy Sovereign Gold Bonds?)
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SHCIL)‍, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCIL), గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలు పొందొచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎవరు కొవనచ్చు? (Who can buy Sovereign Gold Bonds?)
భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక గార్డియన్‌ లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.

ఎంత బంగారం కొనవచ్చు? (How much gold can you buy?)
గోల్డ్‌ బాండ్‌ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals) కొనుక్కోవచ్చు. HUFలకు (Hindu Undivided Family) కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.

ఫిజికల్‌ గోల్డ్ కొనే సమయంలో వర్తించే KYC (Know your customer) రూల్సే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ విషయంలోనూ వర్తిస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు - పర్సనల్‌ లోన్‌తో ప్రయోజనాలు చాలా!

Published at : 03 Feb 2024 03:26 PM (IST) Tags: Interest Rate Sovereign Gold Bonds SGBs 2023-24 series Gram rate Gram price

ఇవి కూడా చూడండి

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్‌, సిల్వర్‌ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్‌, సిల్వర్‌ నగలు -  ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!

Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్స్‌ ఇవి, కానీ జాగ్రత్త!

Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?

Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?

Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!

Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!

టాప్ స్టోరీస్

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు

తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు