search
×

SGB Scheme: గోల్డెన్‌ ఛాన్స్‌ - బంగారం కొంటే తరుగు లేదు, జీఎస్టీ ఉండదు, పైగా ఎదురు వడ్డీ చెల్లిస్తారు

ఆన్‌లైన్‌లో అప్లై చేసి, డిజిటల్‌ మోడ్‌లో డబ్బులు చెల్లిస్తే ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది.

FOLLOW US: 
Share:

Sovereign Gold Bond Scheme: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునేవాళ్లకు బంపర్‌ న్యూస్‌. గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌లో మంచి డిస్కౌంట్‌తో, RBI సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ ఈ నెల 11న ప్రారంభమవుతుంది. ఈ స్పెషల్‌ స్కీమ్‌ ఐదు రోజుల పాటు, ఈ నెల 15 తేదీ వరకు ఓపెన్‌లో ఉంటుంది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సెకండ్‌ సిరీస్‌ ఇది. ఫస్ట్‌ రిసీస్‌ను ఈ ఏడాది జూన్‌లో జారీ చేశారు. 

గోల్డెన్‌ ఛాన్స్‌
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో 999 కేరట్ల స్వచ్ఛమైన బంగారాన్ని తక్కువ రేటుకే కొనొచ్చు. 2023-24 ఫస్ట్ సిరీస్‌లో ఒక్కో గ్రాము బంగారాన్ని రూ. 5,926 చొప్పున అమ్మిన కేంద్రం ప్రభుత్వం, తాజా సెకండ్‌ సిరీస్‌లో ఇష్యూ ప్రైస్‌ను గ్రాముకు రూ.5,923 గా నిర్ణయించింది. సబ్‌స్క్రిప్షన్ తేదీకి (సెప్టెంబర్‌ 11) ముందున్న మూడు పని దినాల్లో, 999 కేరట్ల స్వచ్ఛత కలిగిన బంగారం ముగింపు ధరల సగటు ఆధారంగా ఇష్యూ ప్రైస్‌ను నిర్ణయించారు.

ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌లో బంగారాన్ని బాండ్‌ రూపంలో ఇష్యూ చేస్తారు. ఒక బాండ్‌ ఒక గ్రాము బంగారానికి సమానం. బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేసి, డిజిటల్‌ మోడ్‌లో డబ్బులు చెల్లిస్తే ఒక్కో గ్రాముకు రూ.50 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ పద్ధతి ఫాలో అయినవాళ్లకు గ్రాము బంగారం రూ.5,873 కే దక్కుతుంది.

సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి?
 సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్‌ను 2015 సంవత్సరంలో ప్రారంభించారు. సావరిన్ గోల్డ్ బాండ్‌ అనేది డిజిటల్‌ బంగారం. భౌతికంగా కనిపించదు. ఫిజికల్‌ గోల్డ్‌ను ఇంట్లో ఉంచుకోవడానికి ప్రజలు సంకోచిస్తారు. దొంగల భయంతో నిద్ర పట్టదు. ఈ అనిశ్చితిని తొలగించడానికి, భౌతిక బంగారం కొనుగోళ్లను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ (SGB Scheme). కేంద్ర ప్రభుత్వం తరపున రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వీటిని జారీ చేస్తుంది. బంగారంలో మదుపు చేయాలనుకునే వాళ్లు గోల్డ్‌ బాండ్ల రూపంలో పెట్టుబడి పెట్టవచ్చు, గోల్డ్‌ బాండ్లను ఆర్‌బీఐ వద్ద భద్రంగా ఉంచుకోవచ్చు.

ఒక్కో గోల్డ్‌ బాండ్‌ కాల పరిమితి 8 సంవత్సరాలు. గోల్డ్ బాండ్ హోల్డర్‌ కోరుకుంటే, ఈ బాండ్లను 5 సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా రిడీమ్‌ చేసుకోవచ్చు. ఆ రోజున ఉన్న రేటుకు బాండ్లను సరెండర్‌ చేయవచ్చు.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల వల్ల ఏంటి లాభం?
SGBలపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి 2.50% ఫిక్స్‌డ్‌ రేటుతో ‍‌(కూపన్‌ రేట్‌) వడ్డీ చెల్లిస్తారు. బాండ్‌ ఇష్యూ తేదీ నుంచి వడ్డీ రేటు లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఈ వడ్డీని 6 నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. సావరిన్ గోల్డ్ బాండ్లను ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. భౌతిక బంగారం కొనుగోలులో వర్తించే మేకింగ్‌, జీఎస్టీ వంటి అదనపు బాడుదు గోల్డ్‌ బాండ్లకు ఉండదు. 

SGBతో టాక్స్‌ బెనిఫిట్‌ 
బాండ్ల మెచ్యూరిటీపై వచ్చే క్యాపిటల్‌ గెయిన్స్‌పై పన్ను మినహాయింపు లభిస్తుంది. కొన్న తేదీ నుంచి మూడేళ్ల ముందు SGBలను అమ్మితే, స్వల్పకాలిక మూలధన లాభాల కింద వర్తించే శ్లాబ్‌ సిస్టమ్‌ ప్రకారం టాక్స్‌ చెల్లించాలి. 3 సంవత్సరాల తర్వాత అమ్మితే దీర్ఘకాలిక మూలధన లాభాల కింద (ఇండెక్సేషన్‌ అనంతరం) 20% టాక్స్‌ కట్టాలి.

సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను ఎలా కొనాలి?
సావరిన్‌ గోల్డ్‌ బాండ్లను కొనుగోలు చేయడం చాలా సులభం. షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, పోస్టాఫీలు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SHCIL)‍, క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (CCIL), గుర్తింపు పొందిన స్టాక్‌ ఎక్స్చేంజీల (NSE, BSE) ద్వారా దరఖాస్తు చేసుకుని SGBలు పొందవచ్చు.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు? 
భారతదేశ నివాసితులు, ట్రస్ట్‌లు, HUFలు, స్వచ్ఛంద సంస్థలు సావరిన్‌ గోల్డ్‌ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మైనర్ల తరఫున ఒక గార్డియన్‌ లేదా మరికొందరితో కలిసి ఉమ్మడిగా కూడా వీటిని కొనవచ్చు.

ఎంత బంగారం కొనవచ్చు?
గోల్డ్‌ బాండ్‌ ద్వారా కనీసం 1 గ్రాము బంగారాన్ని కొనాలి. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక గ్రాము నుంచి 4 కిలోల వరకు వ్యక్తులు (individuals) కొనుక్కోవచ్చు. HUFలకు (Hindu Undivided Family) కూడా గరిష్ట పరిమితి 4 కిలోలు. ట్రస్టులు, ఆ తరహా సంస్థలకు గరిష్ట పరిమితి 20 కిలోలు.

ఫిజికల్‌ గోల్డ్ కొనే సమయంలో వర్తించే KYC (Know-your-customer) రూల్సే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ విషయంలోనూ వర్తిస్తాయి.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 10 Sep 2023 11:11 AM (IST) Tags: Gold scheme Sovereign Gold Bond Investment Gold

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 26 Jan: రేట్లు వింటే పసిడిపై ఆశలు వదులుకోవాల్సిందే - - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 26 Jan: రేట్లు వింటే పసిడిపై ఆశలు వదులుకోవాల్సిందే - - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

National Pension Scheme: NPS గురించి కామన్‌ పీపుల్‌లో కామన్‌గా ఉండే అపోహలు - వాస్తవాలు ఇవీ

National Pension Scheme: NPS గురించి కామన్‌ పీపుల్‌లో కామన్‌గా ఉండే అపోహలు - వాస్తవాలు ఇవీ

Overdraft Facility: బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు

Overdraft Facility: బ్యాంక్‌ మీ చేతికిచ్చే బ్రహ్మాస్త్రం - దీన్ని వాడుకుంటే మీరు ఎప్పుడూ డబ్బుకు ఇబ్బంది పడరు

Buying or Renting Home: ఇల్లు కొనాలా లేదా అద్దెకు తీసుకోవాలా?- తెలివైన వాళ్లు ఏం చేస్తారు?

Buying or Renting Home: ఇల్లు కొనాలా లేదా అద్దెకు తీసుకోవాలా?- తెలివైన వాళ్లు ఏం చేస్తారు?

Gift of Wealth: మీ కుమార్తెకు కలలకు రెక్కలు ఇవ్వండి, సంపదను గిఫ్ట్‌గా అందించండి - సూపర్‌ స్కీమ్‌ ఇది

Gift of Wealth: మీ కుమార్తెకు కలలకు రెక్కలు ఇవ్వండి, సంపదను గిఫ్ట్‌గా అందించండి - సూపర్‌ స్కీమ్‌ ఇది

టాప్ స్టోరీస్

Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం

Road Accident: వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం- ఆటోలు, కారుపై లారీ బోల్తా పడి ఏడుగురు దుర్మరణం

Pawan Kalyan: కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం

Pawan Kalyan: కడపలో ఫ్లెక్సీ వార్, 21తో గేమ్ ఛేంజర్ కాలేము - పవన్ కళ్యాణ్‌ టార్గెట్‌గా ఫ్లెక్సీలు దుమారం

Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్

Andhra Pradesh: శాఖలవారీగా మంత్రుల పనితీరుపై నివేదికకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు, వారిలో మొదలైన టెన్షన్

CM Revanth Reddy: గణతంత్ర దినోత్సవ వేళ తెలంగాణలో పథకాల జాతర - 4 పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: గణతంత్ర దినోత్సవ వేళ తెలంగాణలో పథకాల జాతర - 4 పథకాలు ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి