By: ABP Desam | Updated at : 27 Sep 2023 10:38 AM (IST)
డీమ్యాట్ అకౌంట్‌లో నామినీ పేరు చేర్చడానికి మరింత సమయం
Demat Account Nomination: స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్. ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాదార్లు నామినేషన్ సమర్పించడానికి లేదా నామినేషన్ వద్దని చెప్పడానికి గడువును సెబీ (SEBI) మారోమారు పెంచింది.
అర్హత గల ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతాల్లో నామినీ పేరును యాడ్ చేయమని, లేదా, నామినీ పేరు ఇవ్వడం ఇష్టం లేదన్న డిక్లరేషన్ అయినా ఇవ్వమని గతంలోనే సెబీ సూచించింది. నామినేషన్ గడువును 2023 మార్చి 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు గతంలోనే పెంచిన మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ, తాజాగా ఆ డెడ్‌లైన్‌ను (deadline for nomination for trading and demat accounts) మూడు నెలలు పొడిగించింది, 2023 డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చింది. మార్కెట్ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు గడువును పొడిగించినట్లు సెబీ చెప్పింది.
డెడ్‌లైన్ లోగా నామినేషన్ ఇవ్వడం లేదా నామినేషన్ నుంచి వైదొలగడం చేయకుంటే, ఆ ఖాతాలు స్తంభించిపోతాయని సెబీ గతంలో హెచ్చరించింది. అకౌంట్ ఫ్రీజ్ అయిందంటే, ఆ తర్వాత స్టాక్ మార్కెట్‌లో ఒక్క లావాదేవీ కూడా చేయలేరు, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టలేరు, రోజువారీ ట్రేడింగ్ చేయలేరు.
నామినేషన్ రూల్ ఎందుకు పెట్టారు?
ఎవరైనా, తన భవిష్యత్/కుటుంబ అవసరాల కోసం పెట్టుబడులు పెడతారు. ఇలా పెట్టుబడి పెట్టిన వ్యక్తి నామినేషన్ పూర్తి చేయకుండా ఆకస్మాత్తుగా మరణిస్తే, అతని ఖాతాలోని షేర్లు, డబ్బు అతని కుటుంబ సభ్యులకు చేరవు. పెట్టుబడి లక్ష్యం నిర్వీర్యమైపోతుంది. నామినీ పేరును చేరిస్తే, ఆ ఖాతాల్లోని డబ్బు/షేర్లు నామినీకి దక్కుతాయి. పెట్టుబడిదారు కుటుంబానికి ఆర్థిక భరోసాను అందించేందుకు సెబీ తెచ్చిన నిబంధన ఇది. కాబట్టి, గడువు పెంచారులే అని కాలయాపన చేయకుండా, తక్షణం నామినేషన్ ప్రక్రియ పూర్తి చేయడం మంచిది.
డీమ్యాట్ అకౌంట్‌లో నామినీ పేరును ఎలా చేర్చాలి?
మీ డీమ్యాట్ ఖాతాలో నామినీ పేరును చేర్చడం చాలా సులభం, కేవలం 2 రెండు నిమిషాల్లో మీ వైపు నుంచి పని పూర్తవుతుంది. మీరు పెట్టుకున్న అప్లికేషన్‌ను ప్రాసెస్ చేయడానికి 24-48 గంటల సమయం పడుతుంది. మీ డీమ్యాట్ ఖాతాకు గరిష్టంగా ముగ్గురి పేర్లను నామినీలుగా జత చేయవచ్చు, మీ ఇష్టప్రకారం వాళ్లకు నామినేషన్ పర్సెంటేజీ ఇవ్వవచ్చు. మొత్తం పర్సంటేజీ కలిపితే 100%కి మించకూడదు. ఒక్కరి పేరునే నామినీగా మీరు చేరిస్తే, ఆ ఒక్కరికే 100% ఇవ్వొచ్చు. ముందుగా... నామినీ పాన్, ఆధార్ నంబర్, ఈ ఆధార్ నంబర్‌కు లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మీ దగ్గర పెట్టుకోండి.
మీరు డీమ్యాట్ ఖాతా తీసుకున్న బ్రోకరేజీ కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, మీ అకౌంట్‌లోకి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు, ప్రొఫైల్ సెగ్మెంట్‌లోకి వెళ్లండి.
ఈ సెగ్మెంట్‌లో కనిపించే నామినీ డిటెయిల్స్‌పై క్లిక్ చేయండి.
మీరు ఇంతకు ముందే నామినేషన్ పూర్తి చేస్తే ఆ వివరాలు కనిపిస్తాయి. ఎవరి పేరును చేర్చకపోతే ఏ రికార్డ్ కనిపించదు.
నామినీ పేరును గతంలో మీరు జత చేయకపోతే, ఇప్పుడు, ఆ పేజీలో నామినీ వివరాలను నమోదు చేయండి.
నామినీ పేరు, పాన్, ఆధార్ నంబర్ పూరించండి. తర్వాత, నామినీకి కేటాయించాలనుకుంటున్న శాతాన్ని జోడించండి.
మీకు ఇష్టమైతే, 'యాడ్ నామినీ'పై క్లిక్ చేసి మరో ఇద్దరి పేర్లను కూడా జోడించవచ్చు.
ఆధార్ నంబర్ యాడ్ చేసి, సెండ్ OTP బటన్‌పై క్లిక్ చేయండి.
ఆధార్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌కు వచ్చిన OTPని సంబంధిత బాక్స్‌లో ఎంటర్ చేయండి.
అంతే, నామినేషన్ కూడా దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. 24-48 గంటల్లో మీ డీమ్యాట్ ఖాతాకు నామినీ పేరు/పేర్లు యాడ్ అవుతాయి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Year Ender 2024: హ్యుందాయ్ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్ చేసిన IPOల లిస్ట్
Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?
Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్ బ్యాంక్‌లు - హోమ్ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?
PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి
ITR: ఐటీఆర్ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?
AP Rains Update: ఏపీలో ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన, IMD ఎల్లో వార్నింగ్- తెలంగాణలో వాతావరణం ఇలా
Marco - Pushpa 2: 'పుష్ప 2'లో బన్నీ... 'మార్కో'లో ఉన్ని... ఇద్దరూ ఫైట్స్‌లో అలా చేశారేంటి భయ్యా!
Andhra Pradesh: ఏపీలో ఇల్లు కట్టుకునేవారికి అద్భుతమైన న్యూస్ - ఐదంతస్తుల వరకూ పర్మిషన్ అక్కర్లేదు !
Manchu Family Issue : విష్ణు, వినయ్‌ల నుంచి ప్రాణహాని - పహాడిషరీఫ్ పోలీసులకు మనోజ్ కంప్లైంట్ !