By: ABP Desam | Updated at : 04 Apr 2023 02:56 PM (IST)
Edited By: Arunmali
స్పెషల్ స్కీమ్ గడువు పెంచిన SBI
SBI Wecare Senior Citizen FD scheme: సీనియర్ సిటిజన్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం "ఎస్‌బీఐ వియ్‌కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్" గడువును మరోమారు పెంచింది. ఈ పథకం కేవలం సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే. తొలిసారి 2020 మే నెల 20న ఈ స్కీమ్‌ను స్టేట్ బ్యాంక్ ప్రవేశపెట్టింది. పెట్టుబడికి గడువును సెప్టెంబర్ 2020 వరకు ఇచ్చింది. ఆ తర్వాత, ఆ గడువును మరింత పెంచి, మార్చి 31, 2023 వరకు పొడిగించింది. ఇప్పుడు జూన్ 30, 2023 వరకు లాస్ట్ డేట్‌ను తీసుకెళ్లింది. అంటే, ఈ ప్రత్యేక పథకం కింద ఎక్కువ వడ్డీ పొందడానికి మరో 3 నెలల వరకు అవకాశం ఉంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో పేర్కొన్న ప్రకారం, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక FDలను బ్యాంక్ ప్రవేశపెట్టింది. తద్వారా, ఆదాయ భద్రతతో పాటు అధిక వడ్డీ ప్రయోజనాన్ని వాళ్లు పొందవచ్చు. ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌ల కింద, సీనియర్ సిటిజన్లకు 50 నుంచి 100 బేసిస్ పాయింట్ల మేర ఎక్కువ వడ్డీ చెల్లిస్తోంది.
వియ్‌కేర్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌పై ఎంత వడ్డీ?
ఈ ప్రత్యేక FD మీద, 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధిపై 7.50 శాతం వడ్డీని బ్యాంక్ చెల్లిస్తోంది. మీరు ఈ FDలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, స్వయంగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లిగానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా యోనో ద్వారా ఈ స్పెషల్ FD అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్ల ఆదాయాన్ని కాపాడే లక్ష్యంతో ఈ ప్రత్యేక ఎఫ్‌డీని ప్రవేశపెట్టినట్లు బ్యాంక్ వెల్లడించింది.
ఏ కాల వ్యవధికి ఎంత వడ్డీ?
7 రోజుల నుంచి 45 రోజుల కాల వ్యవధిపై 3.5 శాతం వడ్డీ
46 రోజుల నుంచి 179 రోజుల కాల వ్యవధిపై 5 శాతం వడ్డీ
180 రోజుల నుంచి 210 రోజుల వరకు 5.75 శాతం వడ్డీ
211 రోజుల నుంచి 1 సంవత్సరానికి 6.25 శాతం వడ్డీ
1 సంవత్సరం మరియు 2 సంవత్సరాల మధ్య 7.3 శాతం వడ్డీ
2 నుంచి 3 సంవత్సరాలకు 7.5 శాతం వడ్డీ
3 నుంచి 5 సంవత్సరాలకు 7 శాతం వడ్డీ
5 నుంచి 10 సంవత్సరాలకు 7.50 శాతం పైగా వడ్డీ
రుణ సౌకర్యం కూడా
"ఎస్‌బీఐ వియ్‌కేర్ సీనియర్ సిటిజన్ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్"లో పెట్టుబడి పెట్టిన వ్యక్తికి రుణ సౌకర్యం కూడా అందుబాటులోకి వస్తుంది. అంటే, ఈ FDని గ్యారెంటీగా ఉంచి బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. ఆదాయ పన్ను విభాగం నిబంధన ప్రకారం, వడ్డీ ఆదాయంపై TDS కట్ అవుతుంది.
ఇతర బ్యాంకుల ప్రత్యేక FDలు
SBI కాకుండా, ICICI బ్యాంక్ ప్రత్యేక FD ఏప్రిల్ 7న ముగుస్తుంది. HDFC, IDFC ప్రత్యేక FD గడువు తేదీలను ఇంకా అప్‌డేట్ చేయలేదు.
Gold-Silver Prices Today 07 Nov: పసిడి విలవిల, అతి భారీ పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold-Silver Prices Today 06 Nov: పసిడిపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్ లేని స్కీమ్స్ ఇవి
Best Picnic Insurance Policy: పిక్నిక్ ప్లాన్ చేసే ముందు ఇన్సూరెన్స్ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
SIP Strategies: మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ - తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?
Telangana: మేఘా కృష్ణారెడ్డి చుట్టూ తెలంగాణ రాజకీయం - సన్నిహితుడిపైనే బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు ఎందుకు ?
Warangal Congress : మూసి సెంటిమంట్‌తో నల్లగొండ - రెండో రాజధాని పేరుతో వరంగల్ ! కాంగ్రెస్ జిల్లాలకు జిల్లాలు చుట్టేస్తోందా ?