By: ABP Desam | Updated at : 26 Dec 2023 09:00 AM (IST)
ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్ వివరాలు
SBI Amrit Kalash Scheme Details: దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తన స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకం 'అమృత్ కలశ్' గడువును మరోమారు పొడిగించింది. ఈ స్కీమ్ ద్వారా బ్యాంక్ ఆఫర్ చేస్తున్న ఎక్కువ వడ్డీ ప్రయోజనాన్ని కస్టమర్లు ఉపయోగించుకోవడానికి ఇది మంచి ఛాన్స్.
ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ నెలాఖరుతో (2023 డిసెంబర్ 31) ముగియాల్సి ఉండగా, ఆ గడువును వచ్చే ఏడాది మార్చి (2024 మార్చి 31) వరకు ఎస్‌బీఐ పొడిగించింది. మంచి వడ్డీ ఆదాయం సంపాదించుకునే అవకాశాన్ని మరో 3 నెలలు పెంచింది. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌తో మంచి వడ్డీ ఆదాయం సంపాదించాలని ప్లాన్ చేస్తున్న వాళ్లకు ఇది అనువైన FD స్కీమ్.
ఎస్‌బీఐ అమృత్ కలశ్ స్కీమ్ వివరాలు:
వడ్డీ రేటు (SBI Amrit Kalash Scheme Interest Rate)
SBI అమృత్ కలశ్ పథకం టైమ్ పిరియడ్ 400 రోజులు. ఈ టర్మ్ ప్లాన్‌లో డబ్బు (రూ.2 కోట్ల లోపు) డిపాజిట్ చేసే సాధారణ పౌరులకు ఏడాదికి 7.1% వడ్డీ రేటును బ్యాంక్ అందిస్తుంది. ఇదే గడువులో సీనియర్ సిటిజన్లకు మరో అర శాతం (0,50%) కలిపి ఏటా 7.6% వడ్డీ రేటును జమ చేస్తుంది.
SBI అమృత్ కలశ్ డిపాజిట్ స్కీమ్‌పై వచ్చే వడ్డీ కోసం నెలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి వంటి ఆప్షన్లు ఉన్నాయి. మీరు ఎంచుకున్న ఆప్షన్‌ను బట్టి మీ వడ్డీ డబ్బు జమ అవుతుంది.
ఎవరు అకౌంట్ ఓపెన్ చేయవచ్చు? (SBI Amrit Kalash Deposit Scheme Eligibility)
రూ. 2 కోట్ల కంటే తక్కువ మొత్తాల్లో ఉండే దేశీయ రిటైల్ టర్మ్ డిపాజిట్లు, NRI రూపాయి టర్మ్ డిపాజిట్లు రెండింటికీ ఈ పథకం వర్తిస్తుంది. కొత్తగా డిపాజిట్ చేయడంతో పాటు, పాత డిపాజిట్‌ను కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు. ఇందులో, టర్మ్ డిపాజిట్ & స్పెషల్ టర్మ్ డిపాజిట్ సౌకర్యం కూడా ఖాతాదార్లకు అందుబాటులో ఉంది.
ఎలా అప్లై చేసుకోవాలి? (How to apply for Amrit Kalash?)
మీకు దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంక్ శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడి వరకు వెళ్లలేకపోతే, ఆన్‌లైన్ ద్వారా అంటే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్‌బీఐ యోనో (SBI YONO) యాప్ ద్వారా కూడా ఈ స్కీం కోసం అప్లై చేసుకోవచ్చు.
ఈ స్కీమ్‌ను మెచ్యూరిటీ తేదీ కంటే ముందుగానే రద్దు చేసుకునే (Amrit Kalash premature withdrawal) సదుపాయం ఉంది. దీంతో పాటు, ఈ డిపాజిట్ మీద బ్యాంక్ లోన్ (loan against Amrit Kalash) కూడా వస్తుంది.
అమృత్ కలశ్ పథకంపై మీరు తీసుకునే వడ్డీపై ఇన్‌కం టాక్స్ రూల్స్ ప్రకారం TDS కట్ అవుతుంది. ఇలా కట్ అయిన మొత్తాన్ని, మీరు ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేసే సమయంలో క్లెయిమ్ చేసుకోవచ్చు.
మరో ఆసక్తికర కథనం: మీ పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేయడం చాలా సులభం - 2 నిమిషాల్లో అప్లై చేయండిలా!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ