By: ABP Desam | Updated at : 12 May 2022 06:13 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఆహార ద్రవ్యోల్బణం
Retail inflation Hike: పెరుగుతున్న ద్రవ్యోల్బణం ప్రజలందరికీ రోజురోజుకూ షాకులిస్తోంది! వార్షిక ప్రాతిపదికన ఏప్రిల్‌లో రిటైల్ ఇన్‌ఫ్లేషన్ ఏకంగా 7.79 శాతానికి పెరిగింది. అటు వంట నూనె, ఇటు చమురు ధరలు కొండెక్కడమే ఇందుకు ప్రధాన కారణం. గురువారం కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల చేసింది.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్షిత ద్రవ్యోల్బణం 6 శాతం లోపే ఉండాలని నిర్ణయించుకుంది. గణాంకాలను చూస్తుంటే మాత్రం వరుసగా నాలుగో నెల ఇన్‌ఫ్లేషన్ ఆ స్థాయిని మించే ఉంటోంది. విశ్లేషకులు వినియోగ ధరల సూచీ (CPI Inflation) ద్రవ్యోల్బణాన్ని 7.5 శాతంగా అంచనా వేసిన సంగతి తెలిసిందే. అంటే మార్చి నెలలోని 6.95 శాతంతో పోలిస్తే ఇదెంతో ఎక్కువ. 2021 ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 4.23 శాతమే ఉండటం గమనార్హం.
మార్చిలో 7.66 శాతంతో పోలిస్తే ఏప్రిల్‌లో గ్రామీణ ద్రవ్యోల్బణం 8.83 శాతానికి పెరిగింది. ఇక 2021 ఏప్రిల్‌లో అయితే ఇది 3.75 శాతమే. పట్టణ ద్రవ్యోల్బణం మార్చిలో 6.12 శాతం ఉండగా ఏప్రిల్‌లో 7.09 శాతానికి పెరిగింది. 2021, ఏప్రిల్‌లో ఇది 7.09 శాతంగా ఉంది. మొత్తంగా ఏప్రిల్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 8.38 శాతానికి చేరుకుంది. మార్చిలో ఇది 7.68 శాతం కాగా 2021 ఏప్రిల్‌లో 1.96 శాతమే.
ద్రవ్యోల్బణం నుంచి ఎకానమీని రక్షించేందుకు గత వారం ఆర్బీఐ రెపో రేటును 40 బేసిస్ పాయింట్ల మేర పెంచిన సంగతి తెలిసిందే. 'ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని మానిటరీ పాలసీ కమిటీ అంచనా వేసింది. దాని ప్రభావం నుంచి బయటపడేందుకు చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది. 2023 ఆర్థిక ఏడాదిలో సీపీఐని 5.3-5.5 శాతం నుంచి 6 శాతంగా అంచనా వేస్తున్నాం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ముడి చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని ఎక్కువ రోజులు కొనసాగించేలా ఉంది' అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
Consumer Price Index (CPI) inflation for April 2022 stands at 7.79% as against 6.95% in March 2022 and 4.21% in April 2021
— ANI (@ANI) May 12, 2022
Correction | Consumer Price Index (CPI) inflation for April 2022 stands at 7.79% as against 6.95% in March 2022 and 4.23% (and not 4.21% as reported earlier) in April 2021
— ANI (@ANI) May 12, 2022
PIB Fact Check: రూ.12,500 కడితే రూ.4.62 కోట్లు ఇస్తున్న ఆర్బీఐ! పూర్తి వివరాలు ఇవీ!
Gold-Silver Price: స్థిరంగా బంగారం, వెండి ధరలు - మీ నగరంలో రేట్లు ఇవీ
Gold-Silver Price: బంగారం కొనేందుకు ఇదే మంచి ఛాన్స్, పసిడిపై ఎంత తగ్గిందంటే- మీ నగరంలో రేట్లు ఇవీ
Gold-Silver Price: ఇది బిగ్ గుడ్న్యూస్ గురూ! పసిడి భారీగా పతనం, వెండి కూడా అంతే - మీ నగరంలో రేట్లు ఇవీ
SBI Q4 Result: బంపర్ డివిడెండ్ ప్రకటించిన ఎస్‌బీఐ! రికార్డు డేట్ ఇదే.. త్వరపడండి!
NTR31: క్రేజీ రూమర్ - ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమాలో కమల్ హాసన్?
Kanika Kapoor Second Marriage: 'పుష్ప' సింగర్ రెండో పెళ్లి చేసుకుంది - ఫొటోలు చూశారా?
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు
Pooja Hegde: ‘కేన్స్’లో పూజా హెగ్డేకు చేదు అనుభవం, ఆమె కోసం వారు నిద్రాహారాలు మానేశారట!