search
×

Life Insurance: పోస్టాఫీస్‌లోనూ 'లైఫ్‌ ఇన్సూరెన్స్‌' తీసుకోవచ్చు, బెనిఫిట్స్‌ కూడా ఎక్కువే!

50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్‌ కవరేజీ సహా చాలా బెనిఫిట్స్‌ కూడా అందుతాయి.

FOLLOW US: 
Share:

Post Office Life Insurance Scheme: పోస్టాఫీసు, చిన్న మొత్తాల పొదుపు పథకాలను మాత్రమే కాదు, ఇన్సూరెన్స్‌ పాలసీలు కూడా ఆఫర్‌ చేస్తుంది. ఈ విషయం దేశంలోని చాలా మందికి తెలీదు. పోస్టాఫీస్‌ అంటే.. స్మాల్‌ సేవింగ్స్‌ స్కీమ్స్‌/ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్స్‌ మాత్రమే అమలు చేస్తుందనుకుంటారు. తపాలా శాఖ అందిస్తున్న బెస్ట్‌ స్కీమ్స్‌లో ఒకటి "పోస్టల్‌ జీవిత బీమా పథకం" (Postal Life Insurance - PLI). ఈ స్కీమ్‌ తీసుకునే వ్యక్తికి 50 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్‌ కవరేజీ సహా చాలా బెనిఫిట్స్‌ కూడా అందుతాయి. 

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ వివరాలు
పోస్టాఫీస్ జీవిత బీమా పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు 2 కేటగిరీలలో ఆప్షన్లు ఉంటాయి. ఒకటి PLI, రెండోది RPLI. పీఎల్‌ఐ స్కీమ్‌ కింద 6 రకాల పాలసీలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. వాటిలో ఒకటి 'హోల్ లైఫ్ అస్యూరెన్స్‌ పాలసీ' ‍‌(whole life insurance policy). ఇది సంపూర్ణ జీవిత బీమా పథకం. ఈ పాలసీ కింద, హామీ మొత్తం కనిష్టంగా రూ. 20,000 నుంచి గరిష్టంగా రూ. 50 లక్షల వరకు చేతికి వస్తాయి. ఈ పాలసీ కొన్న వ్యక్తి 80 సంవత్సరాలకు సమ్ అష్యూర్డ్ బెనిఫిట్‌ పొందుతాడు. దీని కంటే ముందే బీమాదారు మరణిస్తే, నామినీకి ఆ డబ్బు చెల్లిస్తారు.

లోన్‌ ఫెసిలిటీ
ఈ పాలసీ తీసుకున్న 4 సంవత్సరాలు పూర్తయితే, లోన్‌ ఎలిజిబిలిటీ వస్తుంది. పాలసీహోల్డర్‌, తన పాలసీని హామీగా ఉంచి రుణం కూడా తీసుకోవచ్చు. బీమా కొన్న తర్వాత, ఏ కారణం వల్లనైనా దానిని కొనసాగించలేకపోతే, 3 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసే వెసులుబాటు ఉంది. పాలసీని సరెండర్‌ చేయాలి అనుకుంటే, ఒక విషయాన్ని కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. బీమా పాలసీని తీసుకున్న 5 ఏళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ లభించదు. 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేస్తే, హామీ మొత్తంపై, పాలసీ కొనసాగించిన కాలానికి దామాషా ప్రకారం బోనస్ చెల్లిస్తారు.

కనిష్ట - గరిష్ట వయో పరిమితి
PLI హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఒక వ్యక్తికి కనీసం 19 సంవత్సరాల వయస్సు, గరిష్టంగా 55 ఏళ్ల వయస్సు ఉండాలి. ఈ పాలసీ కొనాలంటే పోస్టాఫీస్‌కు వెళ్లక్కర్లేదు, ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌ ద్వారా తీసుకోవచ్చు. పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్ https://pli.indiapost.gov.in లోకి వెళ్లి ఈ పాలసీని తీసుకోవచ్చు. ఇదే సైట్‌ నుంచి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపు, దాని తాలూకు రిసిప్ట్‌, ఆదాయ పన్ను సర్టిఫికేట్ సహా సంబంధిత డాక్యుమెంట్స్‌ డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి, డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ వ్యవహారం తెలీదు అనుకున్న వాళ్లు నేరుగా పోస్టాఫీసుకు వెళ్లి ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. 

పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు:
పోస్టల్ జీవిత బీమా పాలసీని కనీసం 4 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బు విత్‌ డ్రా చేసుకోవచ్చు.
ఈ పాలసీతో సమ్‌ అజ్యూర్డ్‌ బెనిఫిట్‌ లభిస్తుంది.
మెచ్యూరిటీ అమౌంట్‌ను బీమా చేసిన వ్యక్తికి/అతను మరణిస్తే నామినీకి ఇస్తారు.
3 సంవత్సరాల తర్వాత పాలసీని రద్దు చేసుకోవాలని భావిస్తే, పాలసీని సరెండర్ చేసే ఫెసిలిటీ ఉంది.
ప్రభుత్వ & ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం మాత్రమే తొలుత ఈ పాలసీని తీసుకువచ్చారు.
ఆ తర్వాత మార్పులు చేసి, దేశంలోని ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.

ప్రభుత్వ బీమా పథకాల్లోనే అతి ఎక్కువ వయస్సున్న ప్రాచీన పథకం ఇది. బ్రిటిష్ పాలన కాలంలో, 1884 ఫిబ్రవరి 1న ఈ పథకాన్ని లాంచ్‌ చేశారు. కాలానుగుణంగా అనేక మార్పులతో ఇప్పటికీ అది కొనసాగుతోంది.

మరో ఆసక్తికర కథనం: ₹60 వేలకు దిగిన పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Published at : 25 Jul 2023 11:04 AM (IST) Tags: life insurance POST OFFICE PLI Postal Life Insurance

ఇవి కూడా చూడండి

PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?

PPF Rules: పీపీఎఫ్‌ రూల్స్‌ మారాయి - ఇప్పుడు ఎంత వడ్డీ ఇస్తున్నారో తెలుసా?

Investment Tips: ఎస్‌బీఐ బంపర్‌ హిట్‌ స్కీమ్‌ - ఒక్క డిపాజిట్‌తో ప్రతి నెలా ఆదాయం

Investment Tips: ఎస్‌బీఐ బంపర్‌ హిట్‌ స్కీమ్‌ - ఒక్క డిపాజిట్‌తో ప్రతి నెలా ఆదాయం

Gold-Silver Prices Today 02 Oct: యుద్ధం దెబ్బకు ఆకాశంలో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Gold-Silver Prices Today 02 Oct: యుద్ధం దెబ్బకు ఆకాశంలో గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Money Rules: అక్టోబర్ 01 నుంచి అతి పెద్ద మార్పులు - నేరుగా మీ పర్సుపైనే ప్రభావం

Money Rules: అక్టోబర్ 01 నుంచి అతి పెద్ద మార్పులు - నేరుగా మీ పర్సుపైనే ప్రభావం

Gold-Silver Prices Today 01 Oct: గోల్డ్‌ కొనేవారికి వెరీ 'గుడ్‌ న్యూస్‌' - ఈ రోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold-Silver Prices Today 01 Oct: గోల్డ్‌ కొనేవారికి వెరీ 'గుడ్‌ న్యూస్‌' - ఈ రోజు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

టాప్ స్టోరీస్

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష

YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష

Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 

Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 

High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!

High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్

Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్