search
×

PMJJBY: ఇక్కడ నెలకు రూ.32 చెల్లిస్తే ఏడాదికి రూ.2 లక్షలు - ప్రైవేట్‌ కంపెనీలకు వేలకువేలు కట్టడమెందుకు?

18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న ఎవరైనా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో (PMJJBY) చేరొచ్చు.

FOLLOW US: 
Share:

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana Details: మధ్య తరగతి ప్రజలు, ధనికులకు ప్రజలకు మాత్రమే కాదు, నిరుపేదలకు కూడా ఇన్సూరెన్స్‌ ఫెసిలిటీ ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది. దాని పేరు "ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన" (PM Jeevan Jyoti Bima Yojana). దీనిలో, నెలకు కేవలం రూ.32 (ఏడాదికి రూ.436) కట్టి రూ. 2 లక్షల వరకు బీమా రక్షణ (Insurance coverage) పొందొచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో లాంచ్‌ చేసింది. మీరు కూడా, అతి తక్కువ ప్రీమియం ఈ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ కవరేజ్‌ పొందాలంటే, ముందు ఈ పథకం పూర్తి వివరాలు తెలుసుకోండి.

'ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన' వివరాలు
కులం, మతం, ప్రాంతం, వర్గంతో సంబంధం లేకుండా... 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సున్న ఎవరైనా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలో (PMJJBY) చేరొచ్చు. ఇప్పుడు, చాలా మంది చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాలంటూ ప్రతిరోజూ ప్రయాణాలు చేస్తున్నారు. కుటుంబాలకు వీళ్లే ఆధారం. అలాంటి వ్యక్తులు PMJJBY తీసుకుంటే, అతి తక్కువ ప్రీమియంతో కుటుంబం మొత్తానికి ఆర్థిక భద్రత లభిస్తుంది.

పాలసీ తీసుకున్న తర్వాత... ప్రమాదం, అనారోగ్యం వంటి కారణాలతో పాలసీదారు మరణిస్తే, నామినీకి రూ.2 లక్షల వరకు బీమా డబ్బు లభిస్తుంది. అంటే, తన మరణాంతరం కూడా తన కుటుంబానికి ఆర్థిక రక్షణను పాలసీదారు అందించగలడు. మరోవైపు, ప్రమాదంలో అవయవ వైకల్యం ఏర్పడితే, రూ. 1 లక్ష వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. 

ప్రీమియం ఎలా కట్టాలి?
PMJJBY కొనాలంటే బ్యాంక్‌ అకౌంట్‌ లేదా పోస్టాఫీసు ఖాతా ఉండాలి. ప్రీమియం (Premium Amount) కోసం ప్రతి సంవత్సరం రూ.436 చెల్లిస్తే సరిపోతుంది. 2022కు ముందు ఈ మొత్తం రూ.330 గా ఉండగా, ఆ తర్వాత రూ.426 కు పెంచారు. ఇప్పుడు రూ.436 అయింది. ప్రీమియం కడితే, బీమా కవరేజ్‌ ఏటా జూన్ 1 నుంచి తర్వాతి సంవత్సరం మే 30 కాలంలో చెల్లుబాటులో ఉంటుంది. ఆటో డెబిట్ సిస్టమ్ ద్వారా బ్యాంక్‌ ఖాతా నుంచి ప్రీమియం అమౌంట్‌ కట్‌ అవుతుంది. అంటే.. జూన్ 1న, సేవింగ్స్ ఖాతా నుంచి డబ్బు ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది, బీమా ప్రీమియం కోసం డిపాజిట్ అవుతుంది. 

ప్రీమియం చెల్లించడం మరిచిపోయినా, అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌గా డబ్బు కట్‌ అవుతుంది కాబట్టి, పాలసీదారు నిరంతరం బీమా కవరేజ్‌లో ఉంటాడు.

PMJJBY కొనుగోలు చేయడానికి కావలసిన డాక్యుమెంట్లు (Documents required to purchase PMJJBY):
ఆధార్ కార్డ్ (Aadhaar Card)
పాన్ కార్డ్ (PAN Card)
రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు (Passport Size Photos)
బ్యాంక్/పోస్టాఫీస్‌ పాస్ బుక్ (Bank Passbook)
మొబైల్ నంబర్ (Mobile Number)

పాలసీ దరఖాస్తు & క్లెయిమ్ ప్రాసెస్‌
మీకు అకౌంట్‌ ఉన్న బ్యాంక్‌ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి PMJJBY కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రతి సంవత్సరం జూన్ 1న, ఆటో డెబిట్ మోడ్ ద్వారా మీ సేవింగ్స్ అకౌంట్‌ నుంచి ప్రీమియం మొత్తాన్ని (రూ.436) కట్‌ చేస్తారు. పాలసీహోల్డర్‌ మరణిస్తే, నామినీకి పాలసీని క్లెయిమ్ చేసే హక్కు ఉంటుంది. పాలసీదారు మరణ ధృవీకరణ పత్రం, వ్యక్తిగత రుజువు, నామినీ ఐడీ వంటి పేపర్లు సబ్మిట్‌ చేసి బీమా డబ్బును క్లెయిమ్ చేయవచ్చు. ప్రమాదం కారణంగా పాలసీదారు వికలాంగుడైతే, బీమా కోసం క్లెయిమ్ చేయవచ్చు. దీని కోసం హాస్పిటల్‌ బిల్స్‌ వంటివి సమర్పించాలి. 

మరో ఆసక్తికర కథనం: భారీగా పడిన గోల్డ్‌, సిల్వర్‌ రేట్లు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Published at : 29 Dec 2023 12:36 PM (IST) Tags: Details PMJJBY PMJJBY Benefits PM Jeevan Jyoti Bima Yojana Documents required Premium Amount

ఇవి కూడా చూడండి

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

టాప్ స్టోరీస్

Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!

Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!

Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!

Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?

Telangana: ఫామ్‌హౌస్ కేసు దగ్గరకు వెళ్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు - బీజేపీకి ఇరకాటంలో పెట్టే ప్లానేనా ?

Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం

Chandrababu: చంద్రబాబు అన్ని కార్యక్రమాలు రద్దు, ఢిల్లీ నుంచి హుటాహుటీన హైదరాబాద్‌కు పయనం