By: ABP Desam | Updated at : 23 Jul 2022 06:56 AM (IST)
పెట్రోల్, డీజిల్ ధర
Petrol Price Today 23 July 2022: హైదరాబాద్‌లో చాలా రోజుల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో జూలై 23 (శనివారం) లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 23 July 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు.
తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.35 అయింది.
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.34 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.54 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. 15 పైసలు పెరగడంతో కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.110 కాగా, 14 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.98.13 అయింది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 16 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.17 కాగా, 16 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.22 అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.111.38 కాగా, డీజిల్ లీటర్ రూ.99.43 అయింది. నల్గొండ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.71 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.85 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు మారాయి. పెట్రోల్ (Petrol Price in Vijayawada 23 July 2022) లీటర్ ధర రూ.111.71 కాగా, 34 పైసలు పెరిగి డీజిల్ లీటర్ ధర రూ.99.46 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరలు పెరిగాయి. విశాఖలో 50 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.110.98 అయింది. డీజిల్ లీటర్ ధర రూ.98.74 అయింది. చిత్తూరులో 55 పైసలు పెరిగి పెట్రోల్ లీటర్ రూ.112.51 కాగా, డీజిల్ ధర సెంచరీ కొట్టింది. చిత్తూరులో డీజిల్ లీటర్ ధర రూ.100.08 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో పెట్రోల్ ధర రూ.111.76 కాగా, డీజిల్ ధర రూ. 99.48 అయింది. నెల్లూరులో పెట్రోల్ ధర రూ.111.48 కు చేరింది. డీజిల్ ధర రూ.99.23 అయింది.
ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఊరట..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.9.5 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిన సమయంలో భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
SBI New Scheme: ఎస్‌బీఐ కొత్త స్కీమ్‌తో ప్రతి ఇంట్లో లక్షాధికారి - మీ పిల్లలు, తల్లిదండ్రుల కోసం పవర్‌ఫుల్ పథకాలు
Gold-Silver Prices Today 05 Jan: రూ.8 లక్షల దగ్గర ప్యూర్ గోల్డ్, రూ.లక్ష దగ్గర వెండి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Aadhaar - SIM: మీ ఆధార్ నంబర్‌పై ఎన్ని సిమ్ కార్డ్‌లు ఉన్నాయో తెలుసుకోండి - అనవసరంగా జైలుకు వెళ్లకండి!
Personal Loan: బెస్ట్ రేటుతో పర్సనల్ లోన్ ఆఫర్లు - టాప్-7 బ్యాంక్‌ల లిస్ట్ ఇదిగో
Punjab National Bank: కస్టమర్లకు న్యూ ఇయర్ గిఫ్ట్ - డిపాజిట్లపై మరింత ఎక్కువ డబ్బు చెల్లిస్తున్న PNB
Special Trains: సంక్రాంతికి ఊరెళ్లే వారికి గుడ్ న్యూస్ - 52 అదనపు రైళ్లు ప్రకటించిన ద.మ రైల్వే, పూర్తి వివరాలివే!
Robotic Arm: అంతరిక్షంలో భారత తొలి స్పేస్ రోబోటిక్ ఆర్మ్ - ఇస్రో వీడియో వైరల్
Akira Nandan: అకీరా సినిమాల్లోకి వచ్చేది ఎప్పుడు - రేణు దేశాయ్ ఏమన్నారంటే?
Anantha Sriram: 'అలాంటి సినిమాలను బహిష్కరించాలి' - కల్కి సినిమాపై సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు