search
×

Petrol Price Today 22nd August 2022: ప్రధాన నగరాల్లో నిలకడగా పెట్రోల్ డీజిల్‌ ధరలు, మీ ప్రాంతంలో రేట్లు చూసేయండి ఇక్కడ

Petrol Price Today 22nd August 2022:ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా, తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలు పెట్రోల్‌ రేట్లు మండిపోతున్నాయి.

FOLLOW US: 
Share:

Petrol Price Today 22nd August 2022:  హైదరాబాద్‌లో దాదాపు మూడు నెలల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆగస్టు 22 (సోమవారం) లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 22nd August 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. 

తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర నిలకడగా ఉంది. లీటర్ పెట్రోల్ ధర (Petrol Price In Warangal) రూ.109.10 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.29గా ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ పై 17పైసలు తగ్గింది. ప్రస్తుతం ధర రూ.109.14 కాగా, డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.32 వద్ద నిలకడగా ఉంది. కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) మళ్లీ పెరిగాయి. 46పైసలు పెరగడంతో కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.48 కాగా, డీజిల్ ధర 42పైసలు పెరిగింది. కరీంనగర్‌లో డీజిల్‌ ధర రూ.97.92గా ఉంది.   

నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 69పైసలు పెరింగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.73 కాగా, డీజిల్‌‌ లీటర్‌పై 65పైసలు పెరిగింది. ప్రస్తుత ధర రూ.99.75 వద్ద కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధరపై 18 పైసలు తగ్గిండంతో  రూ.110.60 కాగా, డీజిల్ లీటర్ ధరపై కూడా 17పైసలు తగ్గింది. ప్రస్తుతం అక్కడ డీజిల్‌ ధర రూ.98.70 అయింది. నల్గొండ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధరపై 17పైసలు పెరగడంతో రూ.109.41 కాగా, డీజిల్ లీటర్ ధర కూడా 16పైసలు పెరిగి... రూ.97.57వద్దకు చేరింది. 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరల్లో మార్పులు భారీగా వచ్చాయి. పెట్రోల్‌ (Petrol Price Today In Vijayawada) లీటర్ ధర రూ.112.05 కాగా, 28 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.46 అయింది. విశాఖపట్నంలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48 అయింది. డీజిల్‌ లీటర్ ధర రూ.98.27 అయింది. చిత్తూరులో పెట్రోల్ లీటర్ రూ.112.55 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.100.19 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో 25 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.112.28 కాగా, డీజిల్ ధర 49 పైసలు పెరిగి రూ. 99.76 అయింది. నెల్లూరులో 67పైసలు పెరగడంతో  పెట్రోల్ ధర రూ.112.19కు చేరింది. 62 పైసలు పెరగడం డీజిల్ ధర రూ.99.86 అయింది. 

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లాలో పెట్రోల్‌ డీజిల్‌ రేట్లు అధికంగా ఉన్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్‌ 112.87రూపాయలుగా ఉంది. డీజిల్‌ 100.49రూపాయలుగా ఉంది. డీజిల్ తక్కువ ధర 98.27తో విశాఖ ఉంది. పెట్రోల్‌ కూడా- 110.48రూపాయలతో అక్కడే తక్కువ ఉంది.

 తెలంగాణలో వ్యాప్తంగా ధరలు చూస్తే...  పెట్రోల్‌ ఎక్కువ ధర ఆదిలాబాద్‌లో 112.11 రూపాయలుగా, డీజిల్‌ ధర 100.10గా ఉంది. 
వరంగల్‌లో తక్కువ పెట్రోల్‌ ధర 109.10, డీజిల్‌ ధర 97.29 ఉంది. 

ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఊరట..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.9.5 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిన సమయంలో భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.

Published at : 22 Aug 2022 07:55 AM (IST) Tags: Petrol Price Petrol Price In Hyderabad Diesel Price In AP Petrol Rate In Hyderabad Petrol Price Today In AP Petrol Price Today 22nd August 2022

ఇవి కూడా చూడండి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Prices Today: రూ.72,000 నుంచి కిందకు దిగని పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Personal Loan: ఈ టెక్నిక్ తెలిస్తే వెంటనే పర్సనల్ లోన్స్ తీసుకోవటం ఆపేస్తారు..! తక్కువ వడ్డీకే రుణం..

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పసిడి కొనాలంటే పర్స్‌ ఖాళీ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

టాప్ స్టోరీస్

NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?

NEET Row: 'నీట్' పేపర్ లీక్‌లో కొత్త 'ట్విస్ట్', సుప్రీంకోర్టును ఆశ్రయించిన ర్యాంకర్లు - ఎందుకంటే?

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర

India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర

Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు

Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు