By: ABP Desam | Updated at : 20 Aug 2022 06:49 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Petrol Price Today 20th August 2022: హైదరాబాద్‌లో దాదాపు మూడు నెలల నుంచి ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఆగస్టు 20 (శనివారం) లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 20th August 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు.
తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర నిలకడగా ఉంది. లీటర్ పెట్రోల్ ధర (Petrol Price In Warangal) రూ.109.10 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.29 అయింది.
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ పై 17పైసలు పెరిగింది. ప్రస్తుతం ధర రూ.109.31 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.32 వద్ద నిలకడగా ఉంది. కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) మళ్లీ పెరిగాయి. 15పైసలు పెరగడంతో కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.47 కాగా, డీజిల్ ధర రూ.97.50 వద్ద నిలకడగా కొనసాగుతోంది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 51 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.08 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.99.62 వద్ద కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.44 కాగా, డీజిల్ లీటర్ రూ.98.55 అయింది. నల్గొండ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధరపై 16పైసలు పెరిగడంతో రూ.109.57 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.57వద్దే ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు మారాయి. 42 పైసలు పెరగడంతో పెట్రోల్ (Petrol Price in Vijayawada 20 August 2022) లీటర్ ధర రూ.111.53 కాగా, 39 పైసలు పెరగడంతో డీజిల్ లీటర్ ధర రూ.99.30 అయింది.
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 54 పైసలు తగ్గడంతో విశాఖలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.74 అయింది. 50 పైసలు తగ్గడంతో డీజిల్ లీటర్ ధర రూ.98.51 అయింది. చిత్తూరులో 90 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ రూ.111.65 కాగా, డీజిల్ ధర 85 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.99.36 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో 25 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.112.28 కాగా, డీజిల్ ధర 13 పైసలు పెరిగి రూ. 99.99 అయింది. నెల్లూరులో ఒక రూపాయి తగ్గడంతో పెట్రోల్ ధర రూ.111.16 కు చేరింది. 96 పైసలు తగ్గడంతో డీజిల్ ధర రూ.98.90 అయింది.
ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఊరట..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.9.5 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిన సమయంలో భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Gold-Silver Prices Today 04 Nov: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల ధరలు - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి రేట్లు ఇవీ
Jeevan Pramaan Patra: లైఫ్ సర్టిఫికెట్ల ప్రాసెస్ ప్రారంభం - ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్ చేయాలి?
Bank Loan: ఫ్లెక్సీ లోన్ Vs ఓవర్‌డ్రాఫ్ట్ Vs పర్సనల్ లోన్ - ఏ అవసరానికి ఏది ఉత్తమం?
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Gold-Silver Prices Today 03 Nov: గోల్డ్ కొనేవాళ్లకు 'గోల్డెన్ ఛాన్స్' - ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఇవీ
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?