search
×

Petrol Price Today 16 July 2022: నేడు నిలకడగా ఇంధన ధరలు - ఏపీలో అక్కడ సెంచరీ కొట్టిన డీజిల్, మీ ప్రాంతాల్లో ఇలా

Petrol Price Today 16 July 2022: నేడు వాహనదారులకు స్వల్ప ఊరట కలిగింది. పలుచోట్ల పెట్రోల్, డీజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది.

FOLLOW US: 
Share:

Petrol Price Today 16 July 2022: హైదరాబాద్‌లో ఇంధన ధరలు నిలకడగా ఉన్నాయి.  హైదరాబాద్‌లో శనివారం లీటర్ పెట్రోల్ ధర (Petrol Price Today 16th July 2022) రూ.109.66 కాగా, డీజిల్ లీటర్ ధర రూ.97.82 గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. నేడు ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62 వద్ద పాత ధరలకే విక్రయిస్తున్నారు. 

తెలంగాణలో ఇంధన ధరలు..
నేడు వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.109.16 కాగా, డీజిల్‌‌ లీటర్ ధర రూ.97.35 అయింది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.39 కాగా, డీజిల్‌‌‌ లీటర్ ధర రూ.97.56 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) పెరిగాయి. 45 పైసలు పెరగడంతో కరీంనగర్‌లో పెట్రోల్ లీటర్ ధర రూ.109.84 కాగా, 42 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.97.98 అయింది. 
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. నిజామాబాద్‌లో 69 పైసలు పెరగడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.111.84 కాగా, 75 పైసలు పెరిగి డీజిల్‌‌ లీటర్ ధర రూ.99.75 అయింది. మహబూబ్ నగర్ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.110.44 కాగా, డీజిల్ లీటర్ రూ.98.55 తో నిలకడగా ఉంది. నల్గొండ జిల్లాలో పెట్రోల్ లీటర్ ధర రూ.109.83 కాగా, 33 పైసలు పెరిగి డీజిల్ లీటర్ ధర రూ.97.96 అయింది.

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు..
విజయవాడలో ఇంధన ధరలు మారాయి. పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 16th July 2022) లీటర్ ధర రూ.111.33 కాగా, 76 పైసలు తగ్గి డీజిల్ లీటర్ ధర రూ.99.12 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు పెరిగాయి. విశాఖలో 54 పైసలు పెరగడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.111.24 అయింది. 50 పైసలు పెరగడంతో డీజిల్‌ లీటర్ ధర రూ.99.01 అయింది.
చిత్తూరులో  70 పైసలు తగ్గి పెట్రోల్ లీటర్ రూ.111.96 కాగా, సెంచరీ కొట్టిన డీజిల్ ధర తగ్గింది. చిత్తూరులో డీజిల్ లీటర్ ధర రూ.99.64 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. కర్నూలులో 20 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.111.94 కాగా, డీజిల్ ధర రూ. 99.65 అయింది. నెల్లూరులో పెట్రోల్ ధర రూ.112.35 కు చేరింది. డీజిల్ ధర నెల్లూరులో సెంచరీ దాటింది. 10 పైసలు పెరిగి డీజిల్ ధర రూ.100.01 అయింది.

ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపుతో ఊరట..
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించింది. దాంతో దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధర దాదాపు రూ.9.5 మేర దిగిరాగా, డీజిల్ ధర రూ.7 మేర తగ్గడంతో వాహనదారులకు ఊరట లభించింది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరిగిన సమయంలో భారత్ సహా పలు దేశాల్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 

Published at : 16 Jul 2022 07:27 AM (IST) Tags: Petrol Price Petrol Price In Hyderabad Diesel Price In AP Petrol Rate In Hyderabad Petrol Price Today In AP Petrol Price Today 16th July 2022

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్‌ గోల్డ్‌, ఆర్నమెంట్‌ గోల్డ్‌ రేట్లు తగ్గాయ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్‌ గోల్డ్‌, ఆర్నమెంట్‌ గోల్డ్‌ రేట్లు తగ్గాయ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?

Minor PAN Card: పిల్లల కోసం పాన్ కార్డ్ ఎలా తీసుకోవాలి, ఏంటి లాభం?

Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్‌ ఇస్తున్న గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 29 Nov: నగలు కొనేవాళ్లకు రోజుకో షాక్‌ ఇస్తున్న గోల్డ్‌ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

ఎఫ్‎డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్

ఎఫ్‎డి మ్యాక్స్: బజాజ్ ఫైనాన్స్ యొక్క తాజా అధిక- రిటర్న్స్ ఇచ్చే ఫిక్స్డ్ డిపాజిట్ ఆఫర్

Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో

Good Personal Loan: అత్యవసర ఖర్చుల్లో ఉన్నారా ? - పెద్దగా భారం పడని నాలుగు పర్సనల్ లోన్ మర్గాలు ఇవిగో

టాప్ స్టోరీస్

Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Fengal Cyclone: ఏపీలో పెంగల్ తుపాను ఎఫెక్ట్ - సోమవారం ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం

Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ - ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం

Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!

Top 5 Smartphones Under 10000: రూ.10 వేలలోపు టాప్ 5 స్మార్ట్ ఫోన్లు ఇవే - రెడ్‌మీ నుంచి శాంసంగ్ వరకు!

Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు

Egg Rates: తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన చికెన్ ధరలు - పెరిగిన గుడ్ల ధరలు