By: ABP Desam | Updated at : 17 Oct 2023 10:53 AM (IST)
వివిధ బ్యాంక్‌లు ఇప్పుడు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు
Personal Loan Interest Rates: ఈ ప్రపంచంలో, డబ్బు అవసరం లేని వ్యక్తి ఎవరూ ఉండరు. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, ఆర్థికావసరం తీర్చుకోవడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది, లోన్ కోసం ప్రతి వ్యక్తి బ్యాంక్ గడప తొక్కాల్సి వస్తుంది.
బ్యాంక్ లోన్ రకాలు
బ్యాంక్ లోన్లలో... హోమ్ లోన్, కార్ లోన్, టూ వీలర్ లోన్, బిజినెస్ లోన్, పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ ఇలా చాలా రకాలు ఉంటాయి. వీటిని రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి సెక్యూర్డ్ లోన్స్ (Secured Bank Loans), రెండు అన్ సెక్యూర్డ్ లోన్స్ (Unsecured Bank Loans). సెక్యూర్డ్ బ్యాంక్ లోన్ అంటే, ఏదో ఒక ఆస్తిని తనఖా పెట్టుకుని బ్యాంక్ ఇచ్చే లోన్. తనఖా ఉంటుంది కాబట్టి, ఈ రకమైన లోన్ల మీద వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. రెండోది దీనికి పూర్తిగా భిన్నం. అన్-సెక్యూర్డ్ లోన్లను ఎలాంటి తనఖా లేకుండా, కేవలం నమ్మకం మీద ఆధారపడి బ్యాంక్ ఇస్తుంది. ఈ రకమైన లోన్ల మీద వసూలు చేసే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. అన్-సెక్యూర్డ్ లోన్‌కు ఉదాహరణ పర్సనల్ లోన్ (Personal loan).
మన దేశంలోని అన్ని బ్యాంకులు వ్యక్తిగత రుణాలు ఇస్తున్నాయి. బ్యాంక్ అడిగిన అన్ని డాక్యుమెంట్లను కస్టమర్ సమర్పిస్తే, కేవలం ఐదు నిమిషాల్లో లోన్ మంజూరు అవుతోంది. ఇది, పండుగ సీజన్. ఈ టైమ్‌లో వివిధ అవసరాల కోసం పర్సనల్ లోన్లు తీసుకునేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. వ్యక్తిగత రుణం కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయవచ్చు, నేరుగా బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుకు మంచి క్రెడిట్ స్కోర్ (720 పైన) ఉంటే, వడ్డీ విషయంలో బేరం ఆడే అవకాశం కూడా ఉంటుంది.
ప్రస్తుత ఫెస్టివ్ సీజన్‌లో, పర్సనల్ లోన్ల కోసం కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజులతో స్పెషల్ స్కీమ్స్ అమలు చేస్తున్నాయి. మీకు పర్సనల్ లోన్ అవసరం అయితే, అప్లై చేయడానికి ముందు వివిధ బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు వసూలు చేస్తున్న ఇంట్రెస్ట్ రేట్ల గురించి తెలుసుకోవడం మంచిది.
పర్సనల్ లోన్ మీద వివిధ బ్యాంక్‌లు వసూలు చేస్తున్న వడ్డీ రేట్లు:
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర -------- వడ్డీ రేటు 9.75% --------- ప్రాసెసింగ్ ఫీజు 1% వరకు
HSBC బ్యాంక్ -------- వడ్డీ రేటు 9.99% --------- ప్రాసెసింగ్ ఫీజు 2% వరకు
ఇండస్ఇండ్ బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.25% --------- ప్రాసెసింగ్ ఫీజు 3% నుంచి
బ్యాంక్ ఆఫ్ ఇండియా -------- వడ్డీ రేటు 10.25% --------- ప్రాసెసింగ్ ఫీజు 2% వరకు
యాక్సిస్ బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.49% --------- ప్రాసెసింగ్ ఫీజు 2% వరకు
IDFC ఫస్ట్ బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.49% --------- ప్రాసెసింగ్ ఫీజు 3.50% వరకు
HDFC బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.50% --------- ప్రాసెసింగ్ ఫీజు 2.50% వరకు
IDBI బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.50% --------- ప్రాసెసింగ్ ఫీజు బ్యాంకు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది
కరూర్ వైశ్యా బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.50% --------- ప్రాసెసింగ్ ఫీజు 1.5% నుంచి
ICICI బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.75% --------- ప్రాసెసింగ్ ఫీజు 2.50% వరకు
బ్యాంక్ ఆఫ్ బరోడా -------- వడ్డీ రేటు 10.90% --------- ప్రాసెసింగ్ ఫీజు 2% వరకు
యెస్ బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.99% --------- ప్రాసెసింగ్ ఫీజు 2% వరకు
కోటక్ మహీంద్రా బ్యాంక్ -------- వడ్డీ రేటు 10.99% --------- ప్రాసెసింగ్ ఫీజు 3% వరకు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -------- వడ్డీ రేటు 11% --------- ప్రాసెసింగ్ ఫీజు 1.50% వరకు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ -------- వడ్డీ రేటు 11.40% --------- ప్రాసెసింగ్ ఫీజు 1% వరకు
J & K బ్యాంక్ -------- వడ్డీ రేటు 12.30% --------- ప్రాసెసింగ్ ఫీజు 1% వరకు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -------- వడ్డీ రేటు 12.35% --------- ప్రాసెసింగ్ ఫీజు 1% వరకు
సౌత్ ఇండియన్ బ్యాంక్ -------- వడ్డీ రేటు 12.85% --------- ప్రాసెసింగ్ ఫీజు 2% వరకు
RBL బ్యాంక్ 14% -------- వడ్డీ రేటు 3.5% --------- ప్రాసెసింగ్ ఫీజు 3.5% వరకు
కర్ణాటక బ్యాంక్ -------- వడ్డీ రేటు 14.23% --------- ప్రాసెసింగ్ ఫీజు బ్యాంకు నిర్ణయాన్ని బట్టి ఉంటుంది
ఈ నెల 13వ తేదీ నాటికి ఉన్న సమాచారం ఇది. పైన చెప్పినవి బ్యాంకులు వసూలు చేసే అత్యల్ప వడ్డీ రేట్లు మాత్రమే, గరిష్ట వడ్డీ రేట్లు కాదు. బ్యాంక్ నిర్ణయాలను బట్టి వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజ్ పర్సంటేజీ మారవచ్చు. లోన్ తీసుకోవాలనుకున్న వ్యక్తి క్రెడిట్ స్కోర్, చేసే పని, వయసును బట్టి కూడా వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంది.
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Pawan Kalyan in Pithapuram: 211 రూపాయలతో కోట్లతో పిఠాపురంలో అభివృద్ధి పండుగ- జనంలోకి డిప్యూటీ సీఎం!
Chandrababu: తెలుగు జాతి ప్రయోజనాలే ముఖ్యం.. అనవసర విద్వేషాలు వద్దు - రేవంత్ తరహాలోనే చంద్రబాబు స్పందన
Navadeep Drugs Case: నటుడు నవదీప్‌కు డ్రగ్స్ కేసులో ఊరట - కేసును కొట్టివేసిన హైకోర్టు
Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?