By: ABP Desam | Updated at : 03 Jun 2023 03:15 PM (IST)
అన్ని అవసరాలకు ఒకటే అకౌంటా, మీరెంత రిస్క్‌లో ఉన్నారో తెలుసా?
Online Banking Safety Tips: దేశంలో డిజిటలైజేషన్ పెరుగుతోంది. నీళ్ల నుంచి నింగి వరకు, ప్రతి విషయాన్ని డిజటలైజేషన్ ఈజీగా మార్చేసింది. బ్యాంకింగ్ రంగంలోనూ భారీ మార్పులు తెచ్చింది. అది, బ్యాంకింగ్ బస్ డ్రైవింగ్ సీట్‌లో కూర్చుని వేగంగా ముందుకు నడిపించింది. ఆర్థిక లావాదేవీలను అద్భుతంగా క్రమబద్ధీకరించి, అందరికీ అందుబాటులోకి తెచ్చింది. అయితే, డిజిటలైజేషన్‌లో డార్క్ సైడ్ కూడా ఉంది. డిజిటల్ బ్యాంకింగ్ విస్తరణతో పాటే ఆన్‌లైన్ బ్యాంకింగ్ మోసాలు కూడా పెరిగాయి. రోజురోజుకు కొత్త తరహా చీటింగ్ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి.
2022-23లో 95 వేలకు పైగా UPI ఫ్రాడ్ కేసులు
భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, 2022-23లో, UPI లావాదేవీల్లో ఫ్రాడ్ కేసులు దేశంలో 95 వేలకు పైగా రిజిస్టర్ అయ్యాయి, రిజిస్టర్ కాని కేసులు ఇంకెన్ని ఉన్నాయో మనకు తెలీదు. బ్యాంకింగ్ వ్యవస్థలో డిజిటలైజేషన్ తర్వాత పెరుగుతున్న చీటింగ్ ట్రెండ్‌కు ఇది ప్రతిబింబం.
ఇంకాస్త వివరంగా పరిశీలిస్తే, UPI మోసం అనేది అతి పెద్ద పిక్చర్‌లో కనిపించే ఒక చిన్న చుక్క మాత్రమే. ఫిషింగ్, విషింగ్, మాల్వేర్, సోషల్ ఇంజినీరింగ్ అటాక్స్ వంటి పాత కాలం ఆన్‌లైన్ మోసాల నుంచి కేటుగాళ్లు ఇప్పుడు అప్‌గ్రేడ్ అయ్యారు. QR కోడ్ మానిప్యులేషన్, UPI సంబంధిత మోసాలు, స్కామర్లు వంటి కొత్త పద్ధతుల్లోకి మారారు. వీళ్లెప్పుడూ ఆన్‌లైన్‌లోనే తిరుగుతుంటారు, తమ వలలో ఎవరు పడతారా అని ఎదురు చూస్తుంటారు. మీరు ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఆ కేటుగాళ్ల కన్ను మీ ఖాతా మీద పడుతుంది, మీ అకౌంట్ పూర్తిగా ఖాళీ అవుతుంది.
అయితే, మోసగాళ్లకు భయపడి ఆన్‌లైన్ బ్యాంకింగ్ వాడడం మానేయాలా?, దానివల్ల వచ్చే ఉపయోగాలను వదులుకోవాలా? కచ్చితంగా అవసరం లేదు.
అన్ని లావాదేవీలకు ఒకే ఖాతాను ఉపయోగించడమే అసలైన తప్పు
ఆన్‌లైన్ మోసం జరిగినప్పుడు, బాధితుడు తన సేవింగ్స్ మొత్తాన్ని పోగొట్టుకోవడానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే.. అన్ని ఆర్థిక అవసరాలకు కేవలం ఒకే బ్యాంకు ఖాతాను ఉపయోగించడం. ఒకే అకౌంట్‌లో డబ్బు మొత్తాన్ని జమ చేసి, ఎప్పుడు అవసరం వచ్చినా ఆ ఒక్క ఖాతాను మాత్రమే వాడడమే అసలైన తప్పు. ఇదే మీ సేవింగ్స్‌కు ప్రథమ శత్రువు. ఇది మీ జీవితకాల పొదుపును రిస్క్‌లో పడవేయడ మాత్రమే కాదు, మీ రోజువారీ అవసరాలకు డబ్బు వాడడాన్ని కూడా కష్టతరంగా మారుస్తుంది. అన్ని అవసరాలకు ఒకే బ్యాంక్ అకౌంట్ వాడడం అంటే, మీ డబ్బును మీరే తీసుకెళ్లి నడివీధిలో పెట్టడమే.
కాబట్టి, ఆన్‌లైన్ భద్రతను బలోపేతం చేయాలంటే, మీ డైలీ ట్రాన్జాక్షన్స్ అకౌంట్‌ను మీ మెయిన్ అకౌంట్ నుంచి విడదీయడం అత్యవసరం. దీని వల్ల మీ సేవింగ్స్‌కు రిస్క్ తగ్గతుంది. వీలయితే, మీ డబ్బును వివిధ బ్యాంక్ అకౌంట్లలోకి మార్చుకోండి. ఒకే అకౌంట్‌లో ఎక్కువ డబ్బు లేకుండా చూసుకోండి. మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నా, వాటిలో బ్యాలెన్స్‌ను తరచూ చెక్ చేస్తూ ఉండడం చాలా ముఖ్యం. అనుమానాస్పదన కాల్స్, మెసేజెస్, లింక్స్‌కు దయచేసి స్పందించవద్దు.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: స్టేట్ బ్యాంక్ Vs పోస్టాఫీస్ - ఏది బెస్ట్ FD?
Bank Locker Rules: బ్యాంక్ లాకర్‌లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Andhra BJP New Chief: ఏపీబీజేపీకి త్వరలో కొత్త అధ్యక్షుడు - ఈ నలుగురిలో ఒకరికి చాన్స్
Telangana News: తెలంగాణలో రూ.5,260 కోట్ల పెట్టుబడులు - 6 ఫార్మా కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందం
Tirupati Laddu Sit: నెయ్యి కల్తీపై రంగంలోకి దిగనున్న సీబీఐ సిట్ - 30 మంది ప్రత్యేక సహాయ బృందం కూడా - కల్తీ పుట్ట బద్దలవడం ఖాయమేనా ?
Happy Birthday Naga Chaitanya: మ్యారేజ్, పాన్ ఇండియా ఎంట్రీ... నెక్స్ట్ ఇయర్ అంతా నాగ చైతన్య లైఫ్‌లో ఫుల్ హ్యాపీస్