By: ABP Desam | Updated at : 08 Oct 2023 09:48 AM (IST)
ప్రీమియం కట్టకపోయినా లైఫ్‌ను కవర్ చేసే ఎల్‌ఐసీ 'జీవన్ ఆజాద్' పాలసీ
LIC Jeevan Azad Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), ఈ ఏడాది జనవరిలో, జీవన్ ఆజాద్ (Plan No. 868) పాలసీని లాంచ్ చేసింది. సేవింగ్స్, లైఫ్ కవరేజ్ లక్షణాలు కలిసిన స్కీమ్ ఇది. దీని ద్వారా పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రత, పొదుపు ప్రయోజనం రెండూ అందుతాయి. పైగా దీనిలో నిర్దిష్టం కాలం పాటు ప్రీమియం చెల్లిస్తే, దాని తర్వాత కూడా లైఫ్ కవర్ లభిస్తుంది.
LIC జీవన్ ఆజాద్ అనేది.. పరిమిత కాల చెల్లింపు ఎండోమెంట్ పథకం. ఈ స్కీమ్ కింద రూ.5 లక్షల వరకు (Sum Assured) బీమా కవరేజ్ ఉంటుంది. పాలసీ కొనసాగుతున్న సమయంలో దురదృష్టవశాత్తు పాలసీహోల్డర్ మరణిస్తే, బాధిత కుటుంబానికి ఈ పథకం ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. పాలసీ మెచ్యూరిటీ తేదీ వరకు పాలసీహోల్డర్ జీవించి ఉంటే, జీవిత బీమా కోసం హామీ ఇచ్చిన మొత్తం డబ్బును కంపెనీ చెల్లిస్తుంది. ఈ స్కీమ్ ద్వారా ఎల్‌ఐసీ నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు.
హామీ మొత్తం ఎంత?
ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ స్కీమ్‌లో, బేసిక్ అజ్యూరెన్స్ కింద కనిష్టంగా రూ. 2 లక్షలు, గరిష్టంగా రూ. 5 లక్షలు ఇస్తారు. ఈ పాలసీని కనిష్ట కాల వ్యవధి 15 సంవత్సరాలు, గరిష్ట కాల వ్యవధి 20 సంవత్సరాలు.
ఎన్ని సంవత్సరాల పాటు ప్రీమియం కట్టాలి?
ఎల్‌ఐసీ జీవన్ ఆజాద్ ప్లాన్‌లో ప్రీమియం చెల్లింపు వ్యవధి మైనస్ 8 (-8) సంవత్సరాలుగా ఉంటుంది. అంటే.. పాలసీ చెల్లింపు వ్యవధి కంటే 8 సంవత్సరాల ముందే ప్రీమియం కట్టడం పూర్తవుతుంది. ఉదాహరణకు... 20 ఏళ్ల కాల వ్యవధి ఆప్షన్‌ను ఎంచుకుంటే (20-8), 12 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మిగిలిన 8 సంవత్సరాలు కూడా పాలసీ కవరేజ్‌లో కొనసాగుతారు.
పాలసీదారు వెసులుబాటును బట్టి వార్షిక (12 నెలలకు ఒకసారి), అర్ధ వార్షిక (6 నెలలకు ఒకసారి), త్రైమాసిక (3 నెలలకు ఒకసారి), నెలవారీ ప్రాతిపదికన ప్రీమియం చెల్లించవచ్చు. వీటిలో ఏదో ఒక ఆప్షన్ ఎంచుకోవాలి.
పాలసీదారు వయస్సు ఎంత ఉండాలి?
LIC జీవన్ ఆజాద్ ప్లాన్ తీసుకోవడానికి పాలసీదారు వయస్సు కనిష్టంగా 90 రోజుల నుంచి గరిష్టంగా 50 సంవత్సరాల వరకు ఉండాలి. అంటే, మూడు నెలల వయస్సున్న పిల్లల పేరు మీద కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. 50 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు తీసుకుంటే, ఆ తర్వాత 8 సంవత్సరాల పాటు పాలసీ కవరేజ్‌లో ఉంటారు.
డెట్ బెనిఫిట్ ఎంత ఉంటుంది?
బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ మెచ్యూరిటీ తేదీ కంటే ముందే మరణిస్తే, ఈ పథకం కింద డెత్ బెనిఫిట్ లభిస్తుంది. మరణ ప్రయోజనం.. కనీస హామీ మొత్తం లేదా వార్షిక ప్రీమియంలో ఏడు రెట్లకు సమానంగా ఉంటుంది. పాలసీదారు మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో ఇది 105% కంటే తక్కువ కాకుండా ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. సాంప్రదాయ బీమా పాలసీల్లో వచ్చే రాబడి కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఏదైనా పాలసీని కొనే ముందు ఆ పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా చదవడం, ఎల్‌ఐసీ ఏజెంట్ నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. మీ అవసరాలకు తగినట్లుగా ఉంటేనే ఏ పాలసీ అయినా తీసుకోండి. వీలయితే ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవడం మేలు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Rupee At Life Time Low: రూపాయి విలువ ఎందుకు పడిపోతుంది - అది మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
Gold-Silver Prices Today 12 Jan: ఈ రోజు గోల్డ్, సిల్వర్ నగల రేట్లు ఇవీ - మీ ఏరియాలో ధరలు ఎలా ఉన్నాయంటే!
Credit Card- UPI: మీ క్రెడిట్ కార్డ్‌ను యూపీఐకి ఈజీగా లింక్ చేయండి, సింపుల్‌గా పే చేయండి
Budget Expectations: వాహన రంగానికి కావాలి వరాలు - నిర్మలమ్మ కనికరిస్తే భారీగా తగ్గుతుంది బండి రేటు!
Gold-Silver Prices Today 11 Jan: గోల్డ్ షాపింగ్ చేసేవాళ్లకు గొప్ప ఊరట - ఈ రోజు మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
AP News: జగన్ ఎగ్గొట్టిన బిల్లులు సంక్రాంతి కనుకగా విడుదల - వైసీపీ దుష్ప్రచారంపై మంత్రులు ఫైర్
Makara Jyothi Darshan: శబరిమలలో అయ్యప్ప మకరజ్యోతి దర్శనం - లక్షల మంది భక్తులు శరణం నినాదాలు
Purandeswari About Balakrishna: డాకు మహారాజ్ సినిమా చూసిన ఎంపీ పురందేశ్వరి, సోదరుడు బాలకృష్ణ నటనపై ప్రశంసలు
Warren Buffett: వయసు 94 ఏళ్లు - ఆస్తి 90 లక్షల కోట్లు - అత్యధికం దానం చేసేశాడు !