By: Shankar Dukanam | Updated at : 12 Nov 2025 08:29 AM (IST)
SIP పెట్టుబడిదారులారా గమనించండి ఎక్కువ ఫండ్స్ అంటే ఎల్లప్పుడూ మంచి రాబడి రాకపోవచ్చు నిపుణుల అభిప్రాయం తెలుసుకోండి ( Image Source : Other )
Mutual fund investment Tips | పెట్టుబడి ఎంపికలు చాలా ఉండటం వల్ల, మీరు చాలా సార్లు ఇబ్బందులు కూడా ఎదుర్కొంటారు. ఇన్వెస్టర్లు వీటన్నింటి గురించి సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీరు కూడా SIP కింద వివిధ మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే, మీరు ఈ సమస్యను అర్థం చేసుకోవచ్చు.
మంచి ఫండ్ ఉండటం వల్ల ఇన్వెస్టర్లు కొద్ది మొత్తంలో డబ్బును వివిధ ఫండ్లలో పెట్టుబడి పెడతారు. దీనివల్ల వారి పోర్ట్‌ఫోలియో సరిగ్గా ఉండదు. వాటిలో కొన్ని ఫండ్‌లను ఎంచుకోవలసి వచ్చినప్పుడు, మిగిలిన వాటిని తొలగించాల్సిన సమయంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ETWealth నివేదిక ప్రకారం, నిపుణుడు రవి కుమార్ ఈ సమస్యను పరిష్కరించే మార్గాన్ని వివరించారు. మీ పోర్ట్‌ఫోలియోను ఎలా నిర్వహించాలో ఆయన వివరాలు అందించారు.
5 నుండి 6 ఫండ్‌లు సరిపోతాయి
రవి కుమార్ మాట్లాడుతూ.. ఒకవేళ పెట్టుబడిదారుడు తన ఫండ్‌లను క్రమం తప్పకుండా పర్యవేక్షించేవారు అయితే, తమ ఫండ్‌ల గురించి అవగాహన కలిగి ఉంటే, అటువంటి ఇన్వెస్టర్లకు 5 నుండి 6 మ్యూచువల్ ఫండ్‌లు సరిపోతాయి. ప్రతి ఫండ్ పాత్ర భిన్నంగా ఉంటుందని, కాబట్టి ఒకే విధమైన కంపెనీలలో పెట్టుబడి పెట్టకుండా ఉండాలని సూచించారు. మార్కెట్ నిపుణుల సలహా మేరకు ఎల్లప్పుడూ వివిధ ఫండ్‌లను ఎంచుకోవాలి. తద్వారా పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యంతో పాటు సరైన రాబటి ఉంటుంది.
ఫండ్‌లను నిర్వహించేవారు ఈ విషయాలు గుర్తుంచుకోండి
ఎక్కువ ఫండ్‌లు ఉంటే, అంత మంచి వైవిధ్యం లభిస్తుందని చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తారు, కాని ఇది సరైన ఆలోచన కాదు. రవి కుమార్ ప్రకారం, మీరు ఎంచుకున్న ఫండ్‌లు ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉన్నాయి, వాటి పెట్టుబడి విధానం ఎంత బ్యాలెన్సెడ్‌గా ఉంది అనేది చూసుకోవాలి. మీరు మీ డబ్బును ఒకే రకమైన షేర్లలో పెడితే, ఫండ్‌లు, కంపెనీల సంఖ్య పెరగవచ్చు. కాని ఒకే విభాగంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు పెద్దగా ప్రయోజనం ఉండదు.
ప్రతి ఈక్విటీ ఫండ్‌కు దాని ప్రత్యేక శైలి ఉంటుంది. కొన్ని వృద్ధి స్టాక్‌లపై ఫోకస్ చేస్తాయి. మరికొన్ని విలువపై లేదా నాణ్యత స్టాక్‌లపై దృష్టిసారిస్తాయి. అందువల్ల, పోర్ట్‌ఫోలియోలో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ భిన్నంగా ఉండే ఫండ్‌లను చేర్చుకోవడం చాలా ముఖ్యం. అప్పుడే మీరు మార్కెట్ హెచ్చుతగ్గులలో కూడా బ్యాలెన్స్ కలిగి, తగిన మొత్తం పొందుతారు.
నిరాకరణ: (ఇక్కడ అందించిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడి మార్కెట్ ప్రమాదాలకు లోబడి ఉంటుంది. పెట్టుబడిదారుడిగా డబ్బు ఇన్వెస్ట్ చేసే ముందు ఎల్లప్పుడూ నిపుణుడి సలహా తీసుకోవాలి. ABP Desam ఎవరికీ ఇక్కడ డబ్బు పలానా దాంట్లో ఇన్వెస్ట్ చేయాలని ఎప్పుడూ సలహా ఇవ్వదు.)
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Telugu TV Movies Today: సోమవారం స్మాల్ స్క్రీన్‌పై సందడి చేసే సినిమాలివే.. టీవీ సినిమాల గైడ్!
Hero Splendor లేదా TVS Star City Plus ఏ బైక్ కొనడం బెస్ట్ ? ధర, మైలేజీ తెలుసుకోండి