ఒక కంపెనీ షేర్లు కొంటున్నామంటే ఆ వ్యాపారం మనమే చేస్తున్నట్టు లెక్క! అందుకే సుదీర్ఘ కాలం అందులోనే పెట్టుబడి కొనసాగిస్తే మంచి రాబడి వస్తుంది. స్వల్పకాలం లేదా ట్రేడింగ్ చేయడం వల్ల నష్టపోయే అవకాశాలే ఎక్కువుంటాయి. 5,10, 15, 20 ఏళ్ల కాల పరిమితితో షేర్లు కొనుగోలు చేసి అట్టిపెట్టుకుంటే ఆ పెట్టుబడికి ఎన్నో రెట్ల సొమ్ము చేతికి అందుతుంది.
భారత్ రసాయన్ షేర్లు అందుకు ఓ ఉదాహరణ. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం ఇందులో రూ.20,000 పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడవి రూ.కోటి అయ్యేవి. ఈ రెండు దశాబ్దాల్లో ఈ కంపెనీ షేర్ల ధర 500 రెట్లు పెరిగింది మరి! 20 ఏళ్ల క్రితం రూ.20గా ఉన్న షేరు ఇప్పుడు రూ.9895కు చేరుకుంది. గత ఆరు నెలలుగా షేరు ధర ఒత్తిడి గురవుతోంది. రూ.12,682 నుంచి రూ.9,895కు చేరుకుంది. ఇన్వెస్టర్లు తమ లాభాలను స్వీకరిస్తుండటమే ఇందుకు కారణం.
షేరు చరిత్ర ఇదీ
- గత ఏడాది కాలంలో భారత్ రసాయన్ షేరు రూ.8710 నుంచి రూ.9985కు చేరుకుంది.
- చివరి ఐదేళ్ల కాలంలో రూ.1910 నుంచి రూ.9985కు చేరుకుంది. అంటే 425 శాతం అన్నమాట.
- అలాగ గత పదేళ్లలో రూ.110 నుంచి రూ.9985కు చేరింది. ఇక 20 ఏళ్లలో రూ.20 నుంచి రూ.9985కు వచ్చింది.
ఎప్పుడు కొంటే ఎంత అందేది?
- భారత్ రసాయన్‌లో 6 నెలల క్రితం రూ.20వేలు పెట్టుంటే ఇప్పుడు రూ.16,000 అందుకొనేవారు.
- ఏడాది క్రితం రూ.20,000 పెట్టుంటే ఇప్పుడు రూ.23,000 అయ్యేది.
- ఐదేళ్ల క్రితం రూ.20,000 పెట్టుంటే ఇప్పుడు రూ.1.05 లక్షలు అందేవి.
- పదేళ్ల క్రితం షేరుకు రూ.110 పెట్టుంటే ఇప్పుడు రూ.18.15 లక్షలు అందుకొనేవారు.
- ఇక రూ.20 వద్ద 20 ఏళ్ల క్రితం రూ.20,000 పెట్టుంటే అక్షరాలా రూ.కోటి అందేవి.
Also Read: Paytm Vijay Shekhar Sharma: 10 వేలతో మొదలై రూ.17వేల కోట్లకు విజయ్.. పేటీఎం ఫౌండర్ విజయ గాథ ఇది!
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Skoda Slavia: స్కోడా కొత్త కారు ఇదే.. అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు
Also Read: Pan Card Update: అర్జెంట్‌గా పాన్ కావాలా? ఇప్పుడు 10 నిమిషాల్లో వచ్చేస్తుంది
Also Read: Petrol-Diesel Price, 19 November: యథాతథంగా పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నగరాల్లో మాత్రం పెరుగుదల..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి