గతేడాది కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పండించాయి! పెట్టిన పెట్టుబడికి అనేక రెట్ల రాబడి అందించాయి. తక్కువ ధరతో మొదలైన ఈ షేర్లు స్వల్ప కాలంలోనే భారీ స్థాయికి చేరుకున్నాయి. మల్టీ బ్యాగర్‌ అవతారం ఎత్తాయి!


ఇప్పుడు చెప్పబోయే అదార్‌ పూనావాలాకు చెందిన 'పూనావాలా ఫిన్‌కార్ప్‌' ఇదే కోవకు చెందింది. ఈ బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ షేరు ధర 2020, జూన్‌ 5న రూ.16.40గా ఉండేది. 2022, ఫిబ్రవరి 4న రూ.264.80 వద్ద ముగిసింది. అంటే 20 నెలల్లోనే 1700 శాతం ర్యాలీ అయింది. ఈ 20 నెలల్లో లక్ష రూపాయలకు రూ.20 లక్షల రాబడి ఇచ్చింది.


గత నెల్లో ఈ మల్టీ బ్యాగర్‌ షేరు ధర రూ.228 నుంచి రూ.264కు పెరిగింది. అంటే 16 శాతం లాభపడింది. చివరి ఆరు నెలల్లో అయితే 60 శాతం పెరిగింది. ఇయర్‌ టు డే ప్రకారం రూ.220 నుంచి రూ.264కు చేరుకుంది. అదే విధంగా చివరి ఏడాది కాలంలో రూ.60 నుంచి రూ.264కు పెరిగింది. 350 శాతం ర్యాలీ జరిగింది. 2020 జూన్‌ 5 నుంచి 2022, ఫిబ్రవరి 4 మధ్యన 18 రెట్లు పెరిగి రూ.14 నుంచి రూ.264కు చేరుకుంది.


అదార్‌ పూనావాలా ఫిన్‌కార్ప్‌లో ఒక నెల రోజుల క్రితం రూ.లక్ష పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.1.16 లక్షలు చేతికి అందేవి. ఆరు నెలల క్రితం అదే మొత్తం పెట్టుంటే ఇప్పుడు రూ.1.60 లక్షలు వచ్చేవి. గతేడాది లక్ష రూపాయలు పెట్టుంటే ఈనాడు రూ.4.50 లక్షలు రాబడి వచ్చేది. అదే మీరు 20 నెలల క్రితం లక్ష రూపాయలు పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రూ.18 లక్షలు లాభం కళ్లచూసేవారు.


ప్రస్తుతం పూనావాలా ఫిన్‌కార్ప్‌ మార్కెట్‌ విలువ రూ.20,200 కోట్లుగా ఉంది. ఈ కంపెనీల 52 వారాల గరిష్ఠ ధర రూ.302 కాగా 52 వారాల కనిష్ఠ ధర రూ.55గా ఉంది. ఒక షేరుకు బుక్‌వాల్యూ 73.90గా ఉంది. ఈ మధ్యే కంపెనీ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. కంపెనీ కింద ఆస్తుల విలువ రూ.15,228 కోట్లుగా ఉంది. నికర వడ్డీ మార్జిన్‌ 25 బేసిస్‌ పాయింట్లు పెరిగి 8.8 శాతానికి చేరుకుంది.


Also Read: LIC offers: కస్టమర్లకు ఎల్‌ఐసీ ఆఫర్‌- ఆలస్య రుసుములో భారీ రాయితీ


Also Read: SBI Q3 Results: ఎస్‌బీఐ బంపర్‌ ప్రాఫిట్‌! మార్కెట్‌ అంచనాలు బీట్‌ చేసిన బ్యాంకు


నోట్‌: స్టాక్‌ మార్కెట్లు, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి నష్టభయంతో కూడుకున్నది! ఇది కేవలం సమాచారం కోసమే అందిస్తున్నాం. ఫలానా స్టాక్‌, ఫండ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు అన్ని విషయాలు పరిశీలించుకొని, విశ్లేషించుకోవాలి. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలి!