By: Khagesh | Updated at : 08 Aug 2025 06:42 PM (IST)
ఆదాయపు పన్ను బిల్లు 2025 ఉపసంహరించుకున్న కేంద్రం- ఇప్పుడు స్లాబ్‌లలో మార్పులు ఉంటాయో ? ( Image Source : Other )
Income Tax Bill 2025: కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆదాయపు పన్ను బిల్లును ఉపసంహరించుకుంది. ప్రభుత్వం ఇప్పుడు దాని స్థానంలో కొత్త బిల్లును తీసుకువస్తుంది. ఫిబ్రవరి 2025లో లోక్‌సభలో ప్రవేశపెట్టిన తర్వాత, దీనిని సెలెక్ట్ కమిటీకి పంపారు. సెలెక్ట్ కమిటీ సూచనలన్నింటినీ ఆమోదించిన తర్వాత, ప్రభుత్వం ఇప్పుడు కొత్త బిల్లును తీసుకువస్తుంది.
కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త బిల్లును ఫిబ్రవరి 13, 2025న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. అదే రోజున పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి పంపింది. కమిటీ తన నివేదికను జూలై 22, 2025న పార్లమెంటుకు సమర్పించింది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు అప్‌డేట్ వెర్షన్‌ను కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదించింది. ఈ బిల్లును ఇప్పుడు సోమవారం (ఆగస్టు 11, 2025) లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఈ బిల్లు 6 దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని సవరింస్తోంది. బిజెపి ఎంపి బైజయంత్ పాండా నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ దీనిని సమీక్షించిన తర్వాత అనేక సవరణలు చేసింది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు గురించి అతిపెద్ద ప్రశ్న స్లాబ్‌ల గురించి.
కొత్త బిల్లులో పన్ను స్లాబ్‌లను మార్చే ప్రతిపాదన లేదని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం, కొత్త బిల్లు ముఖ్య ఉద్దేశ్యం భాషను సరళీకృతం చేయడం. అనవసరమైన నిబంధనలు తొలగించడం.
బిహార్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ (SIR) అంశంపై ప్రతిపక్షాల సభ్యుల అభ్యంతరాల మధ్య ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సెలెక్ట్ కమిటీ నివేదిక ప్రకారం 2025 ఆదాయపు పన్ను బిల్లును ఉపసంహరించుకోవడానికి అనుమతి కోరారు. సభ ఆమోదం పొందిన తర్వాత, ఆమె ఆదాయపు పన్ను బిల్లును ఉపసంహరించుకున్నారు.
ఐటీఆర్ దాఖలు చేయడానికి చివరి తేదీ తర్వాత కూడా పన్ను చెల్లింపుదారులు ఎటువంటి జరిమానా ఛార్జీలు లేకుండా టీడీఎస్ వాపసును క్లెయిమ్ చేసుకోవడానికి అనుమతించాలని సెలెక్ట్ కమిటీ సిఫార్సు చేసింది.
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్ హ్యపీ, ఎందుకంటే?