By: Arun Kumar Veera | Updated at : 07 Mar 2024 12:15 PM (IST)
మహిళలకు మాత్రమే ఎంట్రీ ఉన్న ప్రత్యేక పథకం
International Womens Day 2024 Special: ఏడాది క్రితం, మహిళ కోసమే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం.. మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ (Mahila Samman Savings Crtificate Scheme) లేదా మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన (Mahila Samman Bachat Patra Yojana). దీని కాల వ్యవధి రెండేళ్లు మాత్రమే. ఈ పథకం కింద ఖాతా ప్రారంభిస్తే, తక్కువ కాలానికి ఆకర్షణీయమైన వడ్డీ ఆదాయం సంపాదించొచ్చు.
మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ వివరాలు (Mahila Samman Savings Certificate Scheme Details in Telugu):
- మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్‌ను 2023 బడ్జెట్‌లో ప్రకటించారు, 2023 ఏప్రిల్ 01వ తేదీ నుంచి ప్రారంభమైంది.
- ఇది రెండేళ్ల డిపాజిట్ స్కీమ్. ఒకరకంగా చూస్తే, స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్ (Fixed Deposit) లాంటిది.
- మీ దగ్గరలోని పోస్టాఫీసు లేదా బ్యాంకులో మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు, ప్రయోజనాలు పొందొచ్చు.
- ఆడవాళ్లకు మాత్రమే అనుమతి (Eligibility) ఉన్న స్కీమ్ ఇది. బాలికలు లేదా మహిళలు.. ఏ వయసు వాళ్లయినా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు, వయోపరిమితి లేదు.
- మైనర్ బాలికల బదులు వాళ్ల తల్లిదండ్రులు/గార్డియన్స్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. మార్చి 31, 2025 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.
- మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీమ్ అకౌంట్‌లో కనిష్టంగా రూ. 1,000 (Minimum Deposit) నుంచి గరిష్టంగా రూ. 2 లక్షల వరకు (Maximum Deposit) డిపాజిట్ చేయవచ్చు.
- పెట్టుబడిపై ఏటా 7.5 శాతం వడ్డీ (Mahila Samman Crtificate Saving Scheme Interest Rate) చెల్లిస్తారు.
- పెట్టుబడిపై వచ్చే 7.5 శాతం వార్షిక వడ్డీని ప్రతి త్రైమాసికం తర్వాత ఖాతాలో డిపాజిట్ చేస్తారు.
- పథకం మెచ్యూరిటీ తర్వాత, ఫారం-2ను పూరించి అకౌంట్‌లోని డబ్బుల్ని వెనక్కు తీసుకోవచ్చు.
- అత్యవసర పరిస్థితుల్లో, మెచ్యూరిటీకి ముందే డబ్బును వెనక్కు తీసుకోవాలంటే, అకౌంట్ ప్రారంభించిన ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత పాక్షికంగా విత్ డ్రా చేయవచ్చు. ఆ సందర్భంలో, ఖాతాలో ఉన్న మొత్తంలో 40 శాతాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.
CBDT నోటిఫికేషన్ ప్రకారం, మహిళ సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడిపై వచ్చే వడ్డీ ఆదాయానికి TDS కట్ అవుతుంది. అయితే, వడ్డీ రూపంలో వచ్చిన ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 40,000 మించకపోతే TDS చెల్లించాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భంలో TDSకు బదులుగా, ఆ వడ్డీ ఆదాయం అకౌంట్ హోల్డర్ మొత్తం ఆదాయానికి యాడ్ అవుతుంది. రిటర్న్ ఫైల్ చేసే సమయంలో ఇన్‌కమ్ స్లాబ్ సిస్టమ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Today Gold and Silver Prices: నేడు బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో చూడండి! 10 గ్రాముల పసిడి కొనడానికి ఎంత ఖర్చు అవుతుంది?
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
240 crore scam network: ఈ తల్లీకొడుకులు 9 వేల బ్యాంక్ అకౌంట్లతో 240 కోట్ల స్కామ్ చేశారు - వీళ్ల మైండ్ మామూలుది కాదు!
Yellamma Glimpse: హీరోగా మారిన దేవిశ్రీ ప్రసాద్... సంక్రాంతికి విడుదలైన 'ఎల్లమ్మ' గ్లింప్స్ - వీడియో చూడండి
Highway Helpline: పెట్రోల్ లేక హైవేపై కారు అకస్మాత్తుగా ఆగిపోతే కంగారు పడకండి! ఇలా సాయం పొందండి!
Chandrababu: ప్రతి ఒక్కరూ స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి - నారా వారి పల్లెలో చంద్రబాబు పిలుపు