By: ABP Desam | Updated at : 13 Jul 2022 05:35 PM (IST)
Edited By: Ramakrishna Paladi
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ( Image Source : Karolina Grabowska/pixels )
Loan against PPF: సురక్షితమైన పెట్టుబడి సాధనాలు వెతికేవారికి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund) ఒక మంచి ఆప్షన్! పెట్టుబడికి ఎలాంటి ఢోకా ఉండదు. పైగా ఆకర్షణీయమైన వడ్డీరేట్లు ఉంటాయి. రాబడిపై ఎలాంటి పన్ను ఉండకపోవడంతో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు.
PPFలో ఎంత జమ చేయాలి!
పీపీఎఫ్‌లో (PPF) రెండు రకాలుగా పెట్టుబడి పెట్టొచ్చు. ఏకమొత్తంలో డబ్బు జమ చేయొచ్చు. లేదంటే ప్రతి నెలా రూ.500 నుంచి రూ.1,50,000 వరకు డిపాజిట్ చేయొచ్చు. మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు. అవసరం అనుకుంటే వడ్డీ నష్టపోకుండా ఐదేళ్ల చొప్పున ఒకటి కన్నా ఎక్కువసార్లు కాల వ్యవధి పెంచుకోవచ్చు.
PPFలో ఎంత రుణం ఇస్తారు?
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు లేదా డబ్బులు అవసరమైతే పీపీఎఫ్ చందా దారులు రుణం తీసుకోవచ్చు. ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పీపీఎఫ్ జమ చేయడం మొదలు పెట్టిన మూడో ఆర్థిక సంవత్సరం నుంచి ఆరో ఏడాది వరకు రుణ సదుపాయం ఉపయోగించుకోవచ్చు. అప్పటి వరకు జమ చేసిన మొత్తంలో 25 శాతం వరకు రుణం ఇస్తారు. ఇండియా పోస్టు, ఎస్‌బీఐ వంటి సంస్థలు ఇదే విషయం చెబుతున్నాయి.
PPF వడ్డీరేటు ఏంటి?
పీపీఎఫ్ రుణాలపై వడ్డీ స్వల్పంగానే ఉంటుంది. ప్రభుత్వం ప్రకటించిన వడ్డీరేటు కన్నా ఒక శాతం మాత్రమే అధికంగా వసూలు చేస్తారు. ఉదాహరణకు పీపీఎఫ్‌పై ప్రభుత్వం 7.1 శాతం వడ్డీరేటు అమలు చేస్తోంది. దానిపై ఒక శాతం అధికంగా అంటే 8.1 శాతం వరకు తీసుకున్న రుణంపై వడ్డీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకసారి వడ్డీరేటు నిర్ణయించారంటే చెల్లింపు పూర్తయ్యేంత వరకు అదే ఉంటుంది.
PPFలో లోన్ చెల్లించకపోతే?
రుణం మంజూరు చేసిన 36 నెలల్లోపు అసలు మొత్తాన్ని చెల్లించాలి. తీసుకున్న నెల మొదటి రోజు నుంచే వడ్డీ మొదలవుతుంది. అసలును ఏక మొత్తంలో లేదంటే రెండు దఫాలుగా చెల్లించొచ్చు. లేదనుకుంటే 36 నెలల పాటు నెలసరి వాయిదాలు కట్టుకోవచ్చు. ఒకవేళ మీరు 36 నెలల్లోపు రుణాన్ని పూర్తిగా చెల్లించకపోతే లేదా పాక్షికంగా మాత్రమే చెల్లిస్తే ఒక శాతంగా ఉన్న వడ్డీరేటు 6 శాతంగా మారుతుంది. రుణం మొత్తానికీ ఇదే వర్తిస్తుంది.
PPFలో విత్‌డ్రా చేసుకోవచ్చా?
పీపీఎఫ్ ఖాతాదారులు డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చు. 3-6 ఏళ్ల మధ్యన రుణ సదుపాయం ఉంటుందని తెలుసు. అందుకే ఏడో ఏడాది నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకొనేందుకు అనుమతిస్తారు. అయితే చందాదారులు గమనించాల్సిన విషయం ఒకటుంది. ప్రజల్లో డబ్బు ఆదా చేసే అలవాటు పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అందుకే తక్కువ శాతమే రుణం మంజూరు చేస్తుంటారు. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే రుణం తీసుకొనేందుకు అనుమతిస్తారు.
New Year Financial Planning: ఇలాంటి ఫైనాన్షియల్ ప్లాన్‌తో కొత్త సంవత్సరం ప్రారంభించండి - ఏడాదంతా మీకు తిరుగుండదు!
Bank Timings Changed: బ్యాంక్ కస్టమర్లకు అలెర్ట్ - అన్ని బ్యాంకుల పని వేళల్లో మార్పులు
Bank Cheque: బ్యాంక్ చెక్కుల్లో 9 రకాలు - ఏది, ఎక్కడ ఉపయోగిస్తారో మీకు తెలుసా?
Gold-Silver Prices Today 18 Dec: ఈ రోజు చవకగా బంగారం కొనే అవకాశం - మీ ప్రాంతంలో బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Investment Secret: డబ్బులు సంపాదించే ట్రిక్ - ఈ బడా ఇన్వెస్టర్ల సీక్రెట్ ఎవరూ మీకు చెప్పి ఉండరు!
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Constable Physical Events: కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే