search
×

LIC Policy: మీ కుమార్తె వివాహాన్ని ఘనంగా చేయండి, పెళ్లి ఖర్చులన్నీ ఎల్‌ఐసీ భరిస్తుంది!

పాలసీ తీసుకునే పాప తండ్రి వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

FOLLOW US: 
Share:

LIC Kanyadan Policy: మన దేశంలో పెళ్లి ఒక ఆడంబరం. ముఖ్యంగా, కుమార్తె పెళ్లి చేయాలంటే, ఒక సామాన్య కుటుంబానికి తలకు మించిన భారమే. అందుకే, మన దేశంలోని చాలా కుటుంబాలు, తమ ఇంట్లో ఆడపిల్ల పుట్టిన నాటి నుంచే, ఆమె వివాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక మార్గంలో పొదుపు/పెట్టుబడి పెడుతుంటారు. తమ కుమార్తె పెళ్లి ఘనంగా జరగాలని కోరుకునే తల్లిదండ్రుల కోసం ప్రత్యేక జీవిత బీమా పథకం ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని ఎల్‌ఐసీ తీసుకొచ్చింది. 

ఎల్‌ఐసీ కన్యాదాన్ సేవింగ్స్‌ ప్లాన్‌ను బాలిక తండ్రి నిర్వహిస్తాడు. ఈ పాలసీ వ్యవధి 25 ఏళ్లు. కనిష్టంగా 13 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు ప్రీమియంలు కట్టాలి. పాలసీ తీసుకునే పాప తండ్రి వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎల్‌ఐసీ కన్యాదాన్‌ పాలసీ పూర్తి వివరాలు:

వివాహ పొదుపు: 
LIC కన్యాదాన్ పాలసీ ప్రత్యేక ఫీచర్స్‌లో వెడ్డింగ్‌ సేవింగ్స్‌ ఒకటి. రోజుకు 75 రూపాయల వరకు పొదుపు చేస్తే, పాలసీదారు తన కుమార్తె వివాహం నాటికి 14.5 లక్షల రూపాయల మొత్తాన్ని జమ చేయవచ్చు. రోజుకు 151 రూపాయలు ఆదా చేస్తే, కుమార్తె వివాహ ఖర్చుల రూపంలో 31 లక్షల రూపాయలు చేతికి అందుతాయి.

పాలసీదారు (తండ్రి) చనిపోతే: 
పాలసీ కడుతున్న సమయంలో దురదృష్టవశాత్తూ తండ్రి మరణిస్తే, తదుపరి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.

యాక్సిడెంటల్‌ డెత్‌ బెనిఫిట్‌: 
ప్రమాదంలో తండ్రి మరణిస్తే, డెత్‌ బెనిఫిట్‌ కింద 10 లక్షల రూపాయలను తక్షణం చెల్లిస్తారు.

నాన్-యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్: 
ప్రమాదంలో కాకుండా సహజ మరణం సంభవించినప్పుడు కూడా, LIC కన్యాదాన్ పాలసీ తక్షణ ఆర్థిక సాయం అందిస్తుంది. ఆ సమయంలో 5 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. తక్షణ ఖర్చులు, బాధ్యతలను తీర్చుకోడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది.

వార్షిక చెల్లింపు: 
తండ్రి మరణం తర్వాత, కుమార్తెకు ఈ పాలసీ అండగా నిలుస్తుంది. పాలసీ మెచ్యూరిటీ సమయం వరకు సంవత్సరానికి 50,000 రూపాయలు చెల్లిస్తుంది.

అర్హతలు: 
భారతదేశంలోని ప్రతి పౌరుడు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ స్కీమ్‌కు అర్హులు.
ఈ స్కీమ్‌ను అందించే బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో అకౌంట్‌ ఓపెన్‌ చేయవచ్చు. 
ఒక్క కుమార్తె కోసం ఒక్క అకౌంట్‌ మాత్రమే స్టార్‌ చేయాలి, అంతకుమించి తెరవడానికి అనుమతి లేదు.

ఇతర వివరాలు :
18 సంవత్సరాల వయస్సు తర్వాత, ఆ బాలిక తన ఉన్నత విద్య కోసం గరిష్టంగా 50% విత్‌డ్రా చేసుకోవచ్చు.
పాపకు 10 సంవత్సరాల వయస్సు రాక ముందు, ఖాతా తెరవడానికి అమ్మాయి పేరును ఉపయోగించవచ్చు.
బాలిక బర్త్‌ సర్టిఫికెట్‌, బాలిక & సంరక్షకుల చిరునామాలు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలను పోస్టాఫీస్‌ లేదా బ్యాంక్‌లో అందించాలి.
ఖాతా తెరవాలంటే కనీసం రూ. 250 అవసరం.
నెలవారీ ప్రీమియం చెల్లించిన 25 సంవత్సరాల తర్వాత, రోజువారీ పెట్టుబడి రూ.75తో రూ.14 లక్షలు వస్తాయి.
ఈ అకౌంట్‌ను భారతదేశంలోని ఏ ప్రాంతానికై  బదిలీ చేయవచ్చు.
ఒకవేళ అమ్మాయి మరణిస్తే, డెత్ సర్టిఫికేట్ కాపీ తీసుకొచ్చి అకౌంట్‌ క్లోజ్‌ చేయవచ్చు. అప్పుడు డిపాజిట్ చేసిన డబ్బును వడ్డీతో కలిపి సంరక్షకుడికి తిరిగి వస్తుంది. ఒకవేళ దీర్ఘకాలిక అనారోగ్యం వస్తే, ఖాతాను 5 సంవత్సరాల్లో క్లోజ్‌ చేయవచ్చు.

సరెండర్ వాల్యూ:
ఏ కారణం వల్లనైనా LIC కన్యాదాన్ పాలసీని కొనసాగించలేకపోతే, కనీసం రెండు సంవత్సరాలు ప్రీమియంలు కట్టిన తర్వాత ఎప్పుడైనా దానిని సరెండర్ చేయవచ్చు. పాలసీని సరెండర్ చేసిన తర్వాత, గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ లేదా స్పెషల్ సరెండర్ వాల్యూలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని LIC చెల్లిస్తుంది.

ఫ్రీ లుక్ పిరియడ్‌:
మీరు LIC కన్యాదాన్ పాలసీ మీకు నచ్చకపోతే, బీమా బాండ్‌ని స్వీకరించిన తేదీ నుంచి 15 రోజుల్లో దానిని వాపసు చేయవచ్చు. మీరు కట్టిన మొత్తంలో కొంత డబ్బును ఫైన్‌ రూపంలో ఇన్సూరెన్స్‌ కంపెనీ కట్ చేసి, మిగిలిన డబ్బును తిరిగి ఇస్తుంది.

మరో ఆసక్తికర కథనం: ఇంట్లో కూర్చునే ఈజీగా ఎడ్యుకేషన్‌ లోన్‌ పొందొచ్చు - తక్కువ వడ్డీ రేటు, గ్యారెంటీ అవసరం లేదు

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

Published at : 27 Aug 2023 09:07 AM (IST) Tags: Benefits Details LIC Kanyadan Policy

ఇవి కూడా చూడండి

Gold-Silver Prices Today: పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పసిడి - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: పట్టపగలే చుక్కలు చూపిస్తున్న పసిడి - మీ నగరంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Citi Bank: సిటీ బ్యాంక్‌ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు మారాక మీ రివార్డ్ పాయింట్స్‌ ఏమవుతాయి?

Citi Bank: సిటీ బ్యాంక్‌ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు మారాక మీ రివార్డ్ పాయింట్స్‌ ఏమవుతాయి?

Budget 2024: మీ పొదుపు ఖాతాపై నిర్మల సీతారామన్‌ నుంచి గిఫ్ట్‌ - రూ.25,000 వేల వరకు రాయితీ!

Budget 2024: మీ పొదుపు ఖాతాపై నిర్మల సీతారామన్‌ నుంచి గిఫ్ట్‌ - రూ.25,000 వేల వరకు రాయితీ!

Gold-Silver Prices Today: భారీగా పెరిగిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: భారీగా పెరిగిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు రూ.46 లక్షలు గిఫ్ట్‌ - ఈ స్కీమ్‌లో గ్యారెంటీ ఉంది

Sukanya Samriddhi Yojana: మీ కుమార్తెకు రూ.46 లక్షలు గిఫ్ట్‌ - ఈ స్కీమ్‌లో గ్యారెంటీ ఉంది

టాప్ స్టోరీస్

Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

Revanth Gift to Chandrababu: భేటీలో చంద్రబాబుకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌

IND vs ZIM 1st T20I : విశ్వ విజేతలకు తొలి షాక్‌ , భారత్‌కు జింబాబ్వే చెక్‌

AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్

AP Crime: మైనర్ బాలికను కత్తితో నరికి హత్య చేసిన యువకుడు, హోం మంత్రి అనిత సీరియస్

Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?

Bajaj Freedom CNG Vs Honda Shine: బజాజ్ ఫ్రీడమ్ సీఎన్‌జీ 125 వర్సెస్ హోండా షైన్ 125 - రోజువారీ వాడకానికి రెండిట్లో ఏది బెస్ట్?