search
×

Education Loan: ఇంట్లో కూర్చునే ఈజీగా ఎడ్యుకేషన్‌ లోన్‌ పొందొచ్చు - తక్కువ వడ్డీ రేటు, గ్యారెంటీ అవసరం లేదు

ఇండియాలోనే కాదు, విదేశాలకు వెళ్లి కూడా చదువు కోవడానికి కూడా ఈ లోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

FOLLOW US: 
Share:

Vidya Lakshmi Education Loan: మన దేశంలో నాణ్యమైన విద్య అనేది అత్యంత ఖరీదైన వ్యవహారం. మంచి కాలేజీలో, కోరుకున్న కోర్సు చదవాలంటే డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసే కెపాసిటీ ఉండాలి. అర్హత ఉన్నా, ఆర్థిక స్థోమత లేని సామాన్య జనం కాలేజీ ఫీజులు కట్టడానికి అప్పులు చేసి తిప్పలు పడుతున్నారు. కొంతమంది బ్యాంకుల్లో ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకుంటున్నారు. అయితే, బ్యాంక్‌లు ఎక్కువ ఇంట్రెస్ట్‌ రేట్‌ వసూలు చేస్తాయి. పైగా లోన్‌ శాంక్షన్‌ కావడానికి చాలా రకాల డాక్యుమెంట్లు తెమ్మంటాయి, తిప్పించుకుంటాయి.

చదవగల సత్తా ఉన్న స్టుడెంట్‌కు ఉన్నత విద్య ఒక కలగా మిగిలిపోకుండా... సులభంగా, తక్కువ వడ్డీ రేటుతో, ఎలాంటి హామీ అవసరం లేకుండా ఎడ్యుకేషన్ లోన్‌ ఇచ్చేందుకు సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఒక స్కీమ్‌ స్టార్ట్‌ చేసింది. ‘విద్యాలక్ష్మి’ పేరిట 2015-16 నుంచి ఆ పథకం ప్రారంభమైంది. దీనివల్ల, ఎడ్యుకేషన్‌ లోన్‌ కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కూర్చుని, ఆన్‌లైన్‌ ద్వారా విద్యాలక్ష్మి పోర్టల్‌లో అప్లై చేస్తే చాలు. ఇందులో మరో విశేషం ఏంటంటే, ఒక్క అప్లికేషన్‌తో ఒకేసారి మూడు బ్యాంకుల్లో దరఖాస్తు చేసుకున్నట్లు పరిగణిస్తారు. 

అప్లై చేసుకోవడానికి అర్హత మార్కులు ఎన్ని?
విద్యాలక్ష్మి స్కీమ్‌ కింద అప్లై చేసుకోవడానికి ఎన్ని మార్కులు లేదా ఎంత శాతం మార్కులు అన్న రూల్‌ లేదు. చివరిసారిగా చదివిన కోర్సు పాస్‌ అయితే చాలు. అంతేకాదు, ఈ పోర్టల్‌లో అప్లై చేసుకోవడానికి లాస్ట్‌ డేట్‌ అంటూ ఏదీ లేదు. ఏడాదిలో 365 రోజులూ పోర్టల్‌ ఓపెన్‌లో ఉంటుంది. అప్లికేషన్‌ ఫీజుగానీ, ప్రాసెసింగ్‌ ఛార్జీలుగానీ ఉండవు. ఇండియాలోనే కాదు, విదేశాలకు వెళ్లి కూడా చదువు కోవడానికి కూడా ఈ లోన్‌ను ఉపయోగించుకోవచ్చు.

హామీ లేకుండా ₹7.50 లక్షల లోన్‌
విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా అప్లై చేసుకున్న స్టుడెంట్‌కు మూడు రకాల లోన్లు అందుబాటులోకి వస్తాయి. ఒకటి.. ₹4 లక్షల లోపు రుణం. రెండోది.. ₹4 లక్షల నుంచి ₹7.5 లక్షల వరకు రుణం. మూడోది... ₹7.5 లక్షల దాటిన రుణం. బ్యాంక్‌ వడ్డీ రేట్లతో పోలిస్తే, విద్యాలక్ష్మి పోర్టల్‌ ద్వారా మంజూరయ్యే లోన్‌ మీద ఇంట్రెస్ట్‌ రేట్‌ తక్కువగా ఉంటుంది. ఎలాంటి గ్యారెంటీ అడక్కుండా ₹7.50 లక్షల వరకు లోన్‌ మంజూరవుతుంది. అయితే, ఇక్కడో చిన్న కండిషన్‌ ఉంది. నాన్‌-గ్యారెంటీడ్‌ లోన్‌ పొందాలంటే సదరు విద్యార్థి కుటుంబం ఏడాది ఆదాయం ₹4.50 లక్షల లోపు ఉండాలి.

విద్యాలక్ష్మి పోర్టల్‌లో ఎలా అప్లై చేయాలి?
ముందుగా, విద్యాలక్ష్మి పోర్టల్‌ https://www.vidyalakshmi.co.in లోకి వెళ్లి రిజిస్టర్‌ చేసుకోవాలి. రిజిస్టర్‌ చేసుకోవడానికి విద్యార్థి పేరు, కాంటాక్ట్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ ఐడీ, అడ్రస్‌ వంటి వివరాలను నింపాలి. ఆ తర్వాత 'కామన్‌ ఎడ్యుకేషన్‌ లోన్‌ అప్లికేషన్‌ ఫామ్‌' (CELAF) ఫిల్‌ చేయాలి. అన్ని రకాల ఎడ్యుకేషన్‌ లోన్ల కోసం ఇది సరిపోతుంది. ఆ తర్వాత.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ వంటి అవసరమైన అకడమిక్‌ సర్టిఫికెట్లను పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి. చదవబోయే కోర్సుకు సంబంధించిన అడ్మిషన్‌ డాక్యుమెంట్లు, కుటుంబ వార్షికాదాయాన్ని ధ్రువీకరించే పత్రాలను కూడా అప్‌లోడ్‌ చేయాలి.

ఈ పోల్ట్‌లో, ఒక స్టుడెండ్‌ ఒక అప్లికేషన్‌ మాత్రమే నింపాలి. లోన్‌ ఇచ్చే బ్యాంక్‌, విద్యార్థి అప్లికేషన్‌ స్టేటస్‌ను పోర్టల్‌లో అప్‌డేట్‌ చేస్తుంది. లోన్‌ వస్తుందా, రాదా అన్న విషయంలో అప్లై చేసిన 15 రోజుల్లోపే, పోర్టల్‌లోని డాష్‌బోర్డ్‌లో తెలుస్తుంది. ఒక్కోసారి, అప్‌లోడ్‌ చేసిన వివరాలు లేదా డాక్యుమెంట్స్‌ సరిపోకపోతే, స్టుడెంట్‌ అప్లికేషన్‌ను ‘ఆన్‌ హోల్డ్‌’లో పెడతారు. డాష్‌బోర్డ్‌ ద్వారా ఈ విషయం విద్యార్థికి తెలుస్తుంది. అలాంటి సందర్భంలో, బ్యాంక్‌ అడిగిన అడిషనల్‌ ఇన్ఫర్మేషన్‌ లేదా డాక్యుమెంట్స్‌ను అప్‌లోడ్‌ చేయాలి. శాంక్షన్‌ అయిన లోన్‌ డబ్బు మొత్తాన్ని నేరుగా స్టుడెంట్‌ బ్యాంక్‌ ఖాతాలో డిపాజిట్‌ చేస్తారు.

మరో ఆసక్తికర కథనం: సామాన్యుడి భోజనంపై భారీ ప్రభావం, బియ్యం రేట్లు ఇంకా పెరిగే ఛాన్స్‌!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

Published at : 26 Aug 2023 12:11 PM (IST) Tags: Students Education Loan Vidya Lakshmi loan for study

ఇవి కూడా చూడండి

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

టాప్ స్టోరీస్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్

KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్

Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ

The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?

The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?