By: ABP Desam | Updated at : 26 Jul 2023 02:13 PM (IST)
రోజుకు ₹75 దాస్తే చాలు, మీ కుమార్తె పెళ్లి ఖర్చుల కోసం వెతుకునే అవసరం ఉండదు
LIC Kanyadan Policy: కుమార్తె పెళ్లి చేయాలంటే ఖర్చు తడిచి మోపెడవుతుంది. మన దేశంలోని పేద, మధ్య తరగతి తల్లిదండ్రులు.. తమ కుమార్తె వివాహం కోసం, ఆమె చిన్న వయస్సు నుంచే డబ్బులు పొదుపు చేయడం స్టార్ట్ చేస్తుంటారు. కొందరు భూమి, బంగారం వంటివి కూడా కొని పక్కన పెడుతుంటారు. తమ కుమార్తె పెళ్లి ఘనంగా జరగాలని, భవిష్యత్ బాగుండాలని కోరుకునే తల్లిదండ్రుల కోసం, ప్రత్యేక జీవిత బీమా పథకం ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీని ఎల్‌ఐసీ తీసుకొచ్చింది.
ఎల్‌ఐసీ కన్యాదాన్ సేవింగ్స్ ప్లాన్‌ను బాలిక తండ్రి మేనేజ్ చేస్తాడు. తండ్రి మరణానంతరం, బీమా బెనిఫిట్స్ కుమార్తెకు అందుతాయి. కుటుంబ పెద్ద చనిపోయిన కష్ట సమయంలో ఉన్నప్పుడు, ఈ పాలసీ ఆ కుటుంబానికి, ముఖ్యంగా అమ్మాయి భవిష్యత్‌కు సపోర్ట్‌గా నిలుస్తుంది. ఈ పాలసీ వ్యవధి 25 ఏళ్లు. కనిష్టంగా 13 సంవత్సరాలు, గరిష్టంగా 25 సంవత్సరాలు కట్టాలి. పాలసీ తీసుకునే పాప తండ్రి వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎల్‌ఐసీ కన్యాదాన్ పాలసీ పూర్తి వివరాలు:
పాలసీదారు (తండ్రి) చనిపోతే:
పాలసీ కడుతున్న సమయంలో దురదృష్టవశాత్తూ తండ్రి మరణిస్తే, తదుపరి ప్రీమియంలు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్:
తండ్రి ప్రమాదవశాత్తు మరణిస్తే, పాలసీ కింద 10 లక్షల రూపాయలను తక్షణ చెల్లిస్తారు.
నాన్-యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్:
ప్రమాదంలో కాకుండా సహజ మరణం సంభవించినప్పుడు కూడా, LIC కన్యాదాన్ పాలసీ తక్షణ ఆర్థిక సాయాన్ని అందిస్తుంది. ఆ సమయంలో పాలసీ 5 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. తక్షణ ఖర్చులు, బాధ్యతలను తీర్చుకోడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుంది.
వార్షిక చెల్లింపు:
తండ్రి మరణం తర్వాత, కుమార్తెకు ఈ పాలసీ అండగా నిలుస్తుంది. పాలసీ మెచ్యూరిటీ సమయం వరకు సంవత్సరానికి 50,000 రూపాయలు చెల్లిస్తుంది.
వివాహ పొదుపు:
LIC కన్యాదన్ పాలసీ ప్రత్యేక ఫీచర్‌లో వెడ్డింగ్ సేవింగ్స్ ఒకటి. రోజుకు 75 రూపాయల వరకు పొదుపు చేయడం ద్వారా, పాలసీదారులు తమ కుమార్తె వివాహం నాటికి 14.5 లక్షల రూపాయల మొత్తాన్ని జమ చేసుకోవచ్చు.
రోజుకు 151 రూపాయలు ఆదా చేస్తే, కుమార్తె వివాహ ఖర్చుల రూపంలో 31 లక్షల రూపాయలు చేతికి అందుతాయి.
అర్హతలు:
భారతదేశంలోని ప్రతి పౌరుడు, ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ స్కీమ్‌కు అర్హులు.
ఈ స్కీమ్‌ను అందించే బ్యాంక్ లేదా పోస్టాఫీసుల్లో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
ఒక్క కుమార్తె కోసం ఒక్క అకౌంట్ మాత్రమే స్టార్ చేయాలి, అంతకుమించి తెరవడానికి అనుమతి లేదు.
ఇతర వివరాలు :
18 సంవత్సరాల వయస్సు తర్వాత, ఆ బాలిక తన ఉన్నత విద్య కోసం గరిష్టంగా 50% విత్‌డ్రా చేసుకోవచ్చు.
పాపకు 10 సంవత్సరాల వయస్సు రాక ముందు, ఖాతా తెరవడానికి అమ్మాయి పేరును ఉపయోగించవచ్చు.
బాలిక బర్త్ సర్టిఫికెట్, బాలిక & సంరక్షకుల చిరునామాలు, వ్యక్తిగత గుర్తింపు పత్రాలను పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌లో అందించాలి.
ఖాతా తెరవాలంటే కనీసం రూ. 250 అవసరం.
నెలవారీ ప్రీమియం చెల్లించిన 25 సంవత్సరాల తర్వాత, రోజువారీ పెట్టుబడి రూ.75తో రూ.14 లక్షలు వస్తాయి.
ఈ అకౌంట్‌ను భారతదేశంలోని ఏ ప్రాంతానికై బదిలీ చేయవచ్చు.
ఒకవేళ అమ్మాయి మరణిస్తే, డెత్ సర్టిఫికేట్ కాపీ తీసుకొచ్చి అకౌంట్ క్లోజ్ చేయవచ్చు. అప్పుడు డిపాజిట్ చేసిన డబ్బును వడ్డీతో కలిపి సంరక్షకుడికి తిరిగి వస్తుంది. ఒకవేళ దీర్ఘకాలిక అనారోగ్యం వస్తే, ఖాతాను 5 సంవత్సరాల్లో క్లోజ్ చేయవచ్చు.
సరెండర్ వాల్యూ:
ఏ కారణం వల్లనైనా LIC కన్యాదాన్ పాలసీని కొనసాగించలేకపోతే, కనీసం రెండు సంవత్సరాలు పేమెంట్స్ చేసిన తర్వాత, ఎప్పుడైనా దానిని సరెండర్ చేయవచ్చు. పాలసీని సరెండర్ చేసిన తర్వాత, గ్యారెంటీడ్ సరెండర్ వాల్యూ లేదా స్పెషల్ సరెండర్ వాల్యూలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని LIC చెల్లిస్తుంది.
ఫ్రీ లుక్ పిరియడ్:
మీరు LIC కన్యాదాన్ పాలసీ మీకు నచ్చకపోతే, బీమా బాండ్‌ని స్వీకరించిన తేదీ నుంచి 15 రోజుల్లో దానిని వాపసు చేయవచ్చు. మీరు కట్టిన మొత్తంలో కొంత డబ్బును ఫైన్ రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీ కట్ చేసి, మిగిలిన డబ్బును తిరిగి ఇస్తుంది.
మరో ఆసక్తికర కథనం: కన్నీళ్లు పెట్టుకున్న బైజూస్ రవీంద్రన్, ఒకప్పుడు హీరో-ఇప్పుడు దాదాపు జీరో, ఎందుకిలా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
LPG Price : కొత్త సంవత్సరంలో దేశ ప్రజలకు పెద్ద షాక్! 111 రూపాయలు పెరిగిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర!
New Rules Change : ఎల్పీజీ, పీఎన్జీ నుంచి యూపీఐ వరకు ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ ఐదు ప్రధాన మార్పులు!
AP Crime News: పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తిని కొడవళ్లతో నరికి దారుణహత్య.. వివాహేతర సంబంధమే కారణమా?
Donald Trump: 120 దేశాల వలసదారులకు అమెరికా సాయం.. జాబితాలో కనిపించని భారత్, పలు దేశాల్లో గందరగోళం
Crazy Kalyanam : 'క్రేజీ కల్యాణం' చూసేందుకు రెడీయేనా! - క్రేజీ కాంబోతో వంద శాతం ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్
Jana Nayagan OTT : 'జన నాయగన్' రిలీజ్‌కు ముందే ట్విస్ట్? - ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయిందా!