By: Arun Kumar Veera | Updated at : 17 Sep 2024 11:07 AM (IST)
ఈ రోజు బంగారం, వెండి ధరలు 17 సెప్టెంబర్ 2024 ( Image Source : Other )
Latest Gold-Silver Prices 17 September 2024: యూఎస్ ఫెడ్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు వెలువడనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేటు ఫ్లాట్‌గా కదులుతోంది, రికార్డ్ స్థాయికి (Gold all time high) దగ్గరలో ఉంది. ప్రస్తుతం, ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 2,603 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, ఈ రోజు 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) ధర 160 రూపాయలు, ఆర్నమెంట్ గోల్డ్ (22 కేరెట్లు) ధర 150 రూపాయలు, 18 కేరెట్ల బంగారం రేటు 120 రూపాయల చొప్పున తగ్గాయి. కిలో వెండి రేటు 1,000 రూపాయలు తగ్గింది. బంగారం, వెండి రేట్లు నిన్న ఎంత పెరిగాయో, ఈ రోజు అంత తగ్గాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)
తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 74,890 వద్దకు; 22 క్యారెట్ల బంగారం ధర ₹ 68,650 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 56,170 వద్దకు చేరింది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 97,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో (Gold Rate in Vijayawada) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹ 74,890 వద్దకు; 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర ₹ 68,650 వద్దకు; 18 క్యారెట్ల బంగారం ధర ₹ 56,170 వద్దకు చేరింది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 97,000 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ రేటే అమలవుతోంది.
ప్రాంతం పేరు | 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | 18 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) | వెండి ధర (కిలో) |
హైదరాబాద్ | ₹ 74,890 | ₹ 68,650 | ₹ 56,170 | ₹ 97,000 |
విజయవాడ | ₹ 74,890 | ₹ 68,650 | ₹ 56,170 | ₹ 97,000 |
విశాఖపట్నం | ₹ 74,890 | ₹ 68,650 | ₹ 56,170 | ₹ 97,000 |
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities)
ప్రాంతం పేరు | 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) | 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
చెన్నై | ₹ 6,865 | ₹ 7,489 |
ముంబయి | ₹ 6,865 | ₹ 7,489 |
పుణె | ₹ 6,865 | ₹ 7,489 |
దిల్లీ | ₹ 6,880 | ₹ 7,504 |
జైపుర్ | ₹ 6,880 | ₹ 7,504 |
లఖ్‌నవూ | ₹ 6,880 | ₹ 7,504 |
కోల్‌కతా | ₹ 6,865 | ₹ 7,489 |
నాగ్‌పుర్ | ₹ 6,865 | ₹ 7,489 |
బెంగళూరు | ₹ 6,865 | ₹ 7,489 |
మైసూరు | ₹ 6,865 | ₹ 7,489 |
కేరళ | ₹ 6,865 | ₹ 7,489 |
భువనేశ్వర్ | ₹ 6,865 | ₹ 7,489 |
ప్రపంచ దేశాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Countries)
దేశం పేరు |
22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) |
దుబాయ్ (UAE) | ₹ 6,628 | ₹ 7,159 |
షార్జా (UAE) | ₹ 6,628 | ₹ 7,159 |
అబు ధాబి (UAE) | ₹ 6,628 | ₹ 7,159 |
మస్కట్ (ఒమన్) | ₹ 6,708 | ₹ 7,144 |
కువైట్ | ₹ 6,431 | ₹ 7,042 |
మలేసియా | ₹ 6,844 | ₹ 7,156 |
సింగపూర్ | ₹ 6,765 | ₹ 7,452 |
అమెరికా | ₹ 6,584 | ₹ 7,003 |
ప్లాటినం ధర (Today's Platinum Rate)
మన దేశంలో 10 గ్రాముల 'ప్లాటినం' ధర ₹ 310 తగ్గి ₹ 26,580 వద్ద ఉంది. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇదే ధర అమల్లో ఉంది.
పసిడి ధరల్లో మార్పులు ఎందుకు?
పసిడి, వెండి, ప్లాటినం సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ రేట్లు పెరగడం/ తగ్గడం వల్ల మన దేశంలోనూ ధరలు మారుతుంటాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల రేట్లు పెరగడానికి/ తగ్గడానికి చాలా కారకాలు పని చేస్తాయి. ప్రాంతీయ-రాజకీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద పసిడి నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, వివిధ జ్యువెలరీ మార్కెట్లలోని డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
మరో ఆసక్తికర కథనం: రూ.10,000 కట్టండి, రూ.56 లక్షలు తీసుకెళ్లండి - ఈ జాక్‌పాట్ ఆడపిల్ల తండ్రులకు మాత్రమే
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు