By: ABP Desam | Updated at : 14 Aug 2023 10:49 AM (IST)
ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి 6 రకాల నోటీస్‌లు వచ్చే ఛాన్స్
Income Tax Notice: 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్లకు కొన్ని కారణాల వల్ల ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీస్ వచ్చే అవకాశం ఉంది. ఐటీఆర్‌లో అందించిన సమాచారంలో నిజం ఉంటే టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇన్ఫర్మేషన్‌ను అరకొరగా ఇవ్వడం, దాచడం, లేనివి ఉన్నట్లు చూపించడం, అస్పష్టమైన సమాచారం ఇవ్వడం వంటి తప్పులు ఐటీఆర్‌లో ఉంటే, అలాంటి టాక్స్ పేయర్లకు మాత్రమే నోటీస్ అందుతుంది. ఇప్పటికే చాలా మంది వివిధ సెక్షన్ల కింద ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్‌లు అందుకున్నారు. ఒకవేళ, రిటర్న్ ఫైలింగ్‌లో ఏదైనా సమస్య ఉంటే, ఆదాయ పన్ను విభాగం నుంచి సలహా తీసుకోవచ్చు.
ఐటీ డిపార్ట్‌మెంట్ జారీ చేసే 6 రకాల ఆదాయ పన్ను నోటీస్‌లు:
సెక్షన్ 143(2) కింద ఆధారాల కోసం నోటీస్
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139 లేదా 142(1) కింద రిటర్న్ దాఖలు చేసిన పన్ను చెల్లింపుదారుకు సెక్షన్ 143(2) కింద నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. పన్ను చెల్లింపుదారు తప్పుడు సమాచారం ఇచ్చారని, లేదా ఆదాయానికి సంబంధించిన ఏదైనా సమాచారం ఇవ్వలేదని అసెసింగ్ ఆఫీసర్ (AO) భావిస్తే, డిపార్ట్‌మెంట్ తరపున నోటీస్ పంపవచ్చు. ఈ సెక్షన్ కింద పంపే నోటీస్ ద్వారా, ఐటీఆర్‌లోని సమాచారానికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించమని టాక్స్ పేయర్‌ను AO కోరవచ్చు.
సెక్షన్ 156 కింద చెల్లింపుల కోసం నోటీస్
పన్ను, వడ్డీ, పెనాల్టీ లేదా ఇండివిడ్యువల్ తరపున కట్టాల్సిన అమౌంట్ ఏదైనా ఉంటే, ఆ మొత్తాన్ని చెల్లించమంటూ ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 156 కింద అసెసింగ్ అధికారి నోటీస్ జారీ చేయవచ్చు.
సెక్షన్ 245 కింద రిఫండ్ సెట్-ఆఫ్‌పై నోటీస్
గత ఆర్థిక సంవత్సరంలో పన్ను బకాయిలు ఉన్న పన్ను చెల్లింపుదార్లకు ఐటీ డిపార్ట్‌మెంట్ నోటీస్‌లు పంపవచ్చు. ఇలాంటి సందర్భంలో, టాక్స్ పేయర్లకు సెక్షన్ 245 కింద నోటీస్ పంపవచ్చు. ఇలాంటి పన్ను చెల్లింపుదార్లకు రిఫండ్ కూడా ఆలస్యం అవుతుంది.
తప్పుడు రిఫండ్ విషయంలో 139(9) సెక్షన్ కింద నోటీస్
రిటర్న్‌లో అసంపూర్ణ, స్పష్టత లేని సమాచారం ఇవ్వడం లేదా మరేదైనా కారణాల వల్ల ఆ రిటర్న్‌ను లోపభూయిష్టంగా AO పరిగణించవచ్చు. దాని గురించి సదరు టాక్స్ పేయర్‌కు తెలియజేయడానికి ఆదాయ పన్ను విభాగం సెక్షన్ 139(9) కింద నోటీస్ ఇవ్వవచ్చు. ఈ నోటీస్ అందుకున్న టాక్స్ పేయర్, సమాచారం అందిన తేదీ నుంచి 15 రోజుల లోపు రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయాలి.
సెక్షన్ 142(1) కింద నోటీస్
ఒక వ్యక్తి లేదా సంస్థ ఇప్పటికే ఆదాయ పన్ను రిటర్న్‌ను దాఖలు చేసినా, అదనపు సమాచారం సమర్పించాల్సిన అవసరం వచ్చినప్పుడు, ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్‌లోని సెక్షన్ 142(1) కింద నోటీస్ జారీ చేస్తారు.
సెక్షన్ 148 కింద నోటీస్
ఐటీఆర్‌లో, వాస్తవ ఆదాయాన్ని తక్కువ చేసి చూపారని డిపార్ట్‌మెంట్‌కు అనుమానం వస్తే, గతంలో ఫైల్ చేసిన రిటర్న్‌ను సరిచేసి మళ్లీ దాఖలు చేయమని సూచిస్తూ, ఆదాయ పన్ను విభాగం సెక్షన్ 148 కింద నోటీస్ కింద నోటీస్ ఇస్తుంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఇవాళ్టి రేట్లివి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Gold-Silver Prices Today 23 Nov: మళ్లీ రూ.80,000లకు చేరిన స్వర్ణం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే
Bank Locker Rules: బ్యాంక్ లాకర్లో పొరపాటున కూడా ఇవి దాచొద్దు - జైలుకు వెళ్లాల్సి వస్తుంది!
Gold-Silver Prices Today 22 Nov: భయపెట్టేలా పెరుగుతున్న పసిడి - ఈ రోజు 24K, 22K, 18K బంగారం, వెండి ధరలు ఇవీ
Safe Investment: రిస్క్ చేయలేని పెట్టుబడిదార్ల కోసం ఇంతకుమించి బెస్ట్ ఆప్షన్ దొరకవు!
House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?