By: ABP Desam | Updated at : 30 Jul 2022 05:25 PM (IST)
Edited By: Ramakrishna Paladi
ఐటీఆర్ ఫైలింగ్ ( Image Source : Pixabay )
ITR Filing Belated: ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేసేందుకు ఇంకొక్క రోజే మిగిలుంది. 2021-22 ఆర్థిక ఏడాదికి సంబంధించి ఐటీఆర్ (ITR Filing) ఫైల్ చేసేందుకు జులై 31 ఆఖరి తేదీ. ఇప్పటి వరకు గడువు పొడగింపుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫైల్ చేయాల్సిన వారు ఇంకా చాలామంది మిగిలే ఉన్నారు. ఒకవేళ ఆదివారం లోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే వీరు ఆలస్య రుసుము చెల్లించడంతో పాటు కొన్ని ప్రయోజనాలు కోల్పోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఆదాయపన్ను చట్టం ప్రకారం ఐటీఆర్ ఆలస్యంగా సమర్పిస్తే రూ.5000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. పన్ను ఆదాయం రూ.5 లక్షలు దాటని వారు రూ.1000 చెల్లిస్తే సరిపోతుంది. గతంలోనైతే ఈ రుసుము రూ.10వేలు ఉండేది. సెక్షన్ 234F ప్రకారం ఆలస్యంగా ఐటీఆర్ ఫైల్ చేసేందుకూ నిర్దేశిత గడువు ఉంటుంది. ఏదేమైనా ఐటీఆర్ ఆలస్యం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు నష్టపోక తప్పదు.
1) ఐటీఆర్‌ను నిర్దేశిత గడవులోపు సమర్పించకపోతే కొన్ని విభాగాల కింద నష్టాలను క్యారీ ఫార్వర్డ్ చేయలేరు. ఇతర ఆదాయం, మూలధన రాబడి, స్పెక్యులేషన్ సహా వ్యాపారం, ప్రొఫెషనల్ ఆదాయం కింద నష్టాలను చూపించలేరు.
2) మీకు ఆదాయపన్ను రీఫండ్ రావాలంటే ఐటీఆర్ కచ్చితంగా ఫైల్ చేయాలి. పైగా అది తనిఖీ అవ్వాలి. లేదంటే రీఫండ్ పొందలేరు.
3) సాధారణంగా ఐటీ రీఫండ్‌పై ప్రభుత్వం నెలకు 0.5 శాతం వరకు వడ్డీ చెల్లిస్తుంది. ఒకవేళ మీరు గడువు దాటాక రిటర్ను ఫైల్ చేస్తే వడ్డీ ఇవ్వరు.
4) ఐటీఆర్ ఆలస్యంగా సమర్పిస్తే మీరు చెల్లించాల్సిన పన్నులపై వడ్డీ కట్టాల్సి ఉంటుంది. మీరు చెల్లించాల్సిన పన్నును బట్టి సెక్షన్ 234A, 234B, 234C ప్రకారం వడ్డీ వేస్తారు.
5) జులై 31 కన్నా ముందు పన్ను చెల్లించకుంటే 234A అమలవుతుంది. ఒక ఆర్థిక ఏడాదిలో చెల్లించాల్సిన అడ్వాన్స్ టాక్స్ 90 శాతం మేర జమ చేయకపోతే 243B వర్తిస్తుంది. గత ఆర్థిక సంవత్సరం అడ్వాన్స్ టాక్స్ చెల్లించకపోతే 234C కింద పెనాల్టీ వేస్తారు.
4) ఆలస్యంగా సమర్పించాల్సిన ఐటీఆర్‌కూ నిర్దేశిత గడువు ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు జులై 31లోపు ఫైల్ చేయని పక్షంలో 2022, డిసెంబర్ 31లోపు బిలేటెడ్ ఐటీఆర్ సమర్పించాలి. ఆ గడువూ దాటితే ఆదాయ పన్ను శాఖ నోటీసులు ఇచ్చేంత వరకు ఫైల్ చేసేందుకు వీలుపడదు.
Provident Fund: ఈపీఎఫ్ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!
Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి
Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold Rate: బంగారం ధర ఆకాశాన్ని తాకబోతోంది - గ్లోబల్ కంపెనీ జోస్యం!
Investment Tips: ఆర్థిక సంక్షోభంలో ఆపద్బాంధవి 'గోల్డ్ లోన్' - ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా?
Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం
AR Rahman Saira Divorce: రెహమాన్ విడాకులపై స్పందించిన పిల్లలు... పేరెంట్స్ సపరేషన్ గురించి ఏమన్నారో తెలుసా?
Dating Reward In China: ప్రేమిస్తే జీతంతో పాటు బోనస్ - ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన కంపెనీ
Kollywood: యూట్యూబ్ ఛానెళ్లతో తలనొప్పి, ఆ రివ్యూలు అనుమతులు వద్దు - సంచలన నిర్ణయం తీసుకున్న తమిళ నిర్మాతల సంఘం