search
×

ITR 2024: రిఫండ్‌ ఫెయిల్ అయిందా? - బ్యాంక్‌ ఖాతా వివరాలను వ్యాలిడేట్‌ చేయలేదేమో?

IT Return Filing 2024: రిఫండ్‌ ప్రాసెసింగ్ విఫలమైందని ఆదాయ పన్ను విభాగం లేదా బ్యాంకర్‌ నుంచి మీకు సమాచారం అందితే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి వెళ్లి "రిఫండ్‌ రీఇష్యూ రిక్వెస్ట్‌" సమర్పించాలి.

FOLLOW US: 
Share:

Income Tax Return Filing 2024: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆదాయ పన్ను రిటర్న్‌లు (ITR Filing For FY 2023-24) దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువుంది. ఐటీఆర్‌ ఫైల్‌ చేసినవారిలో అర్హులైన వ్యక్తులకు రిఫండ్స్‌ వాళ్ల బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతున్నాయి. 

"బ్యాంక్ ఖాతా నాన్-వాలిడేషన్/రీ-వాలిడేషన్ కారణంగా రిఫండ్‌ రాకపోతే, ఆ ఖాతాను వ్యాలిడేట్‌ లేదా రీ-వ్యాలిడేట్‌ చేయాలని" పన్ను చెల్లింపుదార్లకు ఆదాయ పన్ను విభాగం సూచించింది. అంతేకాదు.. బ్యాంక్ ఖాతా వ్యాలిడేట్‌ లేదా రీ-వ్యాలిడేట్‌ చేసిన తర్వాత "రిఫండ్‌ రీఇష్యూ రిక్వెస్ట్‌"ను (Refund Re-Issue Request) కచ్చితంగా పంపాలని కూడా స్పష్టం చేసింది. ఇలా చేస్తేనే బ్యాంక్‌ ఖాతాలోకి రిఫండ్‌ డబ్బు జమ అవుతుందని వెల్లడించింది.

ఇన్‌కమ్‌ టాక్స్‌ రిఫండ్‌ మీ బ్యాంక్‌ ఖాతాలో క్రెడిట్ కాకపోవడానికి కారణాలు:

-- బ్యాంక్ ఖాతా నంబర్‌, మీ పేరు, MICR, IFSC వంటి వివరాల్లో తప్పులు ఉండడం
-- ఖాతాదారు KYC పెండింగ్‌లో ఉండడం
-- ఖాతా వివరణ తప్పుగా ఉండడం
-- కరెంట్ ఖాతా లేదా సేవింగ్ బ్యాంక్ ఖాతా కాకుండా ఇతర వివరాలు అందించడం

బ్యాంక్ ఖాతాను రీ-వ్యాలిడేట్‌ చేయడం ఎలా? ‍‌(How to re-validate your bank account)

-- మీ యూజర్ ఐడీ (PAN), పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఇన్‌కమ్‌ టాక్స్‌ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
-- మెయిన్‌ మెనూలో కనిపించే My Profile పేజీలోకి వెళ్లండి.
-- My Bank Account బటన్‌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ... యాడ్‌ చేసిన, విఫలమైన, తీసివేసిన బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన ట్యాబ్స్‌ కనిపిస్తాయి. వాటితోపాటు వివిధ రకాల సర్వీస్‌ ఆప్షన్లు కూడా కనిపిస్తాయి.
-- ఒకవేళ బ్యాంక్ ఖాతా ధృవీకరణ (వ్యాలిడేషన్‌) విఫలమైతే, ఆ బ్యాంక్ ఖాతా ట్యాబ్ కింద ఆ వివరాలు ఉంటాయి. రీ-వాలిడేట్ చేయాల్సిన బ్యాంక్ ఖాతా కోసం.. Action కాలమ్‌లోకి వెళ్లి Re-Validate మీద క్లిక్ చేయండి.
-- Add Bank Account పేజీలో ముందే పూరించిన వివరాలు కనిపిస్తాయి. అవసరమైతే ఆ వివరాలను అప్‌డేట్‌ చేయండి.
-- చివరగా, Validate మీద క్లిక్ చేయండి. ఇప్పుడు, మీ బ్యాంక్‌ ఖాతా Added Bank Accounts ట్యాబ్ కింద యాడ్‌ అవుతుంది. ఆ తర్వాత Validation ట్యాబ్‌ కిందకు మారుతుంది.

ఈ వివరాలను బ్యాంక్ ధృవీకరించగానే మీ బ్యాంక్ ఖాతా చెల్లుబాటు అవుతుంది. Added Bank Accounts ట్యాబ్‌లోని Status కాలమ్‌లో ఈ ప్రొగ్రెస్‌ను తనిఖీ చేయొచ్చు. బ్యాంక్ ఖాతా రీ-వ్యాలిడేషన్‌ పూర్తయిన తర్వాత "రిఫండ్‌ రీఇష్యూ రిక్వెస్ట్‌"ను సమర్పించాలి.

"రిఫండ్‌ రీఇష్యూ రిక్వెస్ట్‌"ను ఎలా సమర్పించాలి? (How to submit 'refund reissue request'?)

-- మీ యూజర్ ఐడీ (PAN), పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఇన్‌కమ్‌ టాక్స్‌ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
-- మెయిన్‌ మెనూలో కనిపించే Servicesలోకి వెళ్లి Refund Reissue మీద క్లిక్ చేయండి.
-- ఇక్కడ, రిఫండ్‌ రీఇష్యూ అభ్యర్థనల వివరాలు, స్టేటస్‌ కనిపిస్తాయి. కొత్త అభ్యర్థన కోసం Create Refund Reissue Request మీద క్లిక్ చేయండి.
-- రీఇష్యూ కోసం సమర్పించాలనుకుంటున్న రికార్డ్‌ ఎంచుకుని, Continue మీద క్లిక్ చేయండి.
-- Select a Bank Account page కాలమ్‌లో, రిఫండ్‌ క్రెడిట్‌ కావలసిన బ్యాంక్ ఖాతాను ఎంచుకుని, Proceed to Verification మీద క్లిక్ చేయండి.
-- బ్యాంక్ వివరాలను విజయవంతంగా ధృవీకరించిన తర్వాత, e-Verify పేజీలో మీకు నచ్చిన ఆప్షన్‌ ఎంచుకోండి.

ఈ-ధృవీకరణ విజయవంతంగా పూర్తయితే, లావాదేవీ IDతో SMS, ఈ-మెయిల్‌ వస్తాయి. భవిష్యత్ అవసరాల కోసం ఆ IDని సేవ్‌ చేయండి. View Refund Reissue Request మీద క్లిక్‌ చేస్తే, రిఫండ్‌ రీఇష్యూ అభ్యర్థన ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. 

మరో ఆసక్తిర కథనం: అంచనాలొద్దు, రియాలిటీ చూడండి - చాలా ప్రశ్నలకు ఇక్కడ సమాధానాలు లభిస్తాయ్‌

Published at : 20 Jun 2024 12:52 PM (IST) Tags: Income Tax it return Refund ITR 2024 Tax Slab Rates

ఇవి కూడా చూడండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Tax-Free Incomes: ఈ ఆదాయాలపై 'జీరో' టాక్స్‌ - ITR ఫైల్ చేసే ముందు అప్‌డేట్స్‌ చూసుకోండి

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Schemes For Women: మహిళల్లాగే శక్తిమంతమైన పథకాలివి - ఇన్వెస్ట్‌ చేస్తే లాభాల పంట!

Government Scheme: వృద్ధాప్యంలో రూ.5 వేలు పెన్షన్ - రోజుకు కేవలం 7 రూపాయలతో సాధ్యం

Government Scheme: వృద్ధాప్యంలో రూ.5 వేలు పెన్షన్ - రోజుకు కేవలం 7 రూపాయలతో సాధ్యం

Special Scheme: మహిళల కోసం పోస్టాఫీస్‌లో ప్రత్యేక పథకం - కేవలం రెండేళ్లలో ఎక్కువ రాబడి

Special Scheme: మహిళల కోసం పోస్టాఫీస్‌లో ప్రత్యేక పథకం - కేవలం రెండేళ్లలో ఎక్కువ రాబడి

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?

HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డ్‌ వాడితే మోత మోగిపోద్ది, ఇంకెందుకంటా ఆ కార్డు?

టాప్ స్టోరీస్

AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?

Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌

Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌

Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు

Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు

Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ

Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ