By: Arun Kumar Veera | Updated at : 27 Feb 2024 02:40 PM (IST)
ఈ విషయాలను మీ ఐటీఆర్‌లో కచ్చితంగా చూపాలి
Income Tax Return Filing 2024: మన దేశంలోని చాలా మంది టాక్స్ పేయర్లు వివిధ మార్గాల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. కొంతమంది స్వదేశంలోనే ఉంటూ సంపాదిస్తే, మరికొందరు విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తూ సంపాదిస్తున్నారు. ఇండియాలో కొంత కాలం పని చేసి, ఆ తర్వాత మంచి ఆఫర్‌తో సముద్రాలు దాటి ఎగిరి వెళ్లే వాళ్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు, అలాంటి వ్యక్తులు ఆదాయ పన్ను చెల్లించాలా, అక్కర్లేదా?. ఒకవేళ పన్ను కట్టాల్సి వస్తే ITR ఎలా ఫైల్ చేయాలి, ఏయే అంశాలను రిపోర్ట్ చేయాలి?.
ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో 182 రోజులు భారతదేశంలో ఉన్నట్లయితే, అతన్ని రెసిడెంట్‌గా పరిగణిస్తారు. భారతీయ నివాసి సంపాదించే గ్లోబల్ ఇన్‌కమ్, భారతదేశ ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్ పరిధిలోకి వస్తుంది. భారతదేశంలో ఉద్యోగం చేస్తున్న తరహాలోనే ఆ వ్యక్తికి పన్ను రేట్లు వర్తిస్తాయి.
విదేశీ ఆదాయం ఉన్న వ్యక్తి ITRలో ఇలా రిపోర్ట్ చేయాలి
విదేశాల్లో అందుకున్న జీతాన్ని 'ఇన్‌కమ్ ఫ్రమ్ శాలరీ' హెడ్ కింద చూపించాలి. విదేశీ కరెన్సీలో వచ్చే జీతాన్ని రూపాయిల్లోకి మార్చి చూపాలి. పని చేస్తున్న కంపెనీ వివరాలు ఇవ్వాలి. జీతంపై ముందస్తు టాక్స్ కట్ అయితే, దానిని ఐటీ రిటర్న్‌లో చూపి, రిఫండ్ కోసం క్లెయిమ్ చేసుకోవచ్చు. 'డబుల్ టాక్సేషన్ ఎవాయిడెన్స్ ఎగ్రిమెంట్' (DTAA) బెనిఫిట్ ద్వారా రెండు దేశాల్లోనూ పన్ను కట్టాల్సిన ఇబ్బంది నుంచి తప్పించుకోవచ్చు. మీరు పని చేస్తున్న దేశంతో భారత్‌కు DTAA లేకపోతే, సెక్షన్ 91 ప్రకారం ఉపశమనం పొందవచ్చు.
ఐటీ నోటీస్ అందుకోవచ్చు
మన దేశంలో డిడక్షన్ లేదా ఎగ్జమ్షన్ వంటివి వర్తిస్తే, వాటిని నిరభ్యంతరంగా ఉపయోగించుకోవచ్చు. సెక్షన్ 80C లేదా 80D కింద పెట్టిన పెట్టుబడులకు పన్ను మినహాయింపు తీసుకోవచ్చు. విదేశాల్లో పొందే డిడక్షన్స్‌ను ఇక్కడ ఉపయోగించుకోలేరు. విదేశాల్లోని సంపాదిస్తే, ఆదాయ పన్ను పత్రాల్లో FA (ఫారిన్ అసెట్స్) గురించి సమాచారం ఇవ్వాలి. మీకు విదేశాల్లో ఏదైనా ఆస్తి లేదా బ్యాంకు అకౌంట్ ఉంటే, దాని గురించి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కు సరైన సమాచారం ఇవ్వండి. మీరు సమాచారం దాచారని బయటపడితే ఐటీ డిపార్ట్‌మెంట్ నుంచి నోటీస్ వస్తుంది.
₹10 లక్షల జరిమానా!
ఆదాయ పన్ను విభాగం, విదేశాల్లో సంపాదన గురించి టాక్స్ పేయర్లను ఎప్పటికప్పుడు అలెర్ట్ చేస్తూ ఉంటుంది. దేశం వెలుపల బ్యాంక్ ఖాతా, ఆస్తులు, ఆదాయం వంటివి ఉంటే... 2023-24 ఆర్థిక సంవత్సరం/ 2024-25 మదింపు సంవత్సరం కోసం టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు తప్పనిసరిగా 'ఫారిన్ అసెట్స్ షెడ్యూల్' పూరించాలంటూ ఐటీ డిపార్ట్‌మెంట్ సూచించింది.
ఒకవేళ, విదేశీ సంపాదనల గురించి టాక్స్ పేయర్ వెల్లడించకపోతే, ఆదాయ పన్ను విభాగం అతనిపై చట్ట ప్రకారం చర్య తీసుకోవచ్చు. బ్లాక్ మనీ (వెల్లడించని విదేశీ ఆదాయం & ఆస్తులు) & టాక్స్ యాక్ట్ 2015 కింద రూ. 10 లక్షల వరకు జరిమానా విధించవచ్చు.
మరో ఆసక్తికర కథనం: హిందూజా గ్రూప్ చేతికి రిలయన్స్ క్యాపిటల్ - ఎన్‌సీఎల్‌టీ నుంచి ఆమోదం
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
YS Jagan on Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు భూ సేకరణ చేసింది మేమే, కేసులు వాదించింది మేమే, అనుమతులు తెచ్చింది మేమే- మొదటి ఫ్లైట్ ఎప్పుడు ఎగురుతుందో చెప్పింది మేమే: జగన్
ED Raids at IPAC Office: IPAC కార్యాలయంలో ED సోదాలు! ఫైల్స్‌తో రైడ్ జరిగే ప్రాంతానికి మమతా బెనర్జీ!
Gurram Papireddy OTT : ఓటీటీలోకి డార్క్ కామెడీ 'గుర్రం పాపిరెడ్డి' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Telangana News: హిస్టరీ క్రియేట్ చేసిన తెలంగాణ లేడీ కానిస్టేబుల్! తొలిసారి తెలుగు భాషలో ఛార్జిషీట్