search
×

ITR 2024: పన్ను కట్టాల్సిన అవసరం లేని 13 ఆదాయాలు - ఈ లిస్ట్‌లోకి మీరూ వస్తారేమో చెక్‌ చేయండి

Tax-Free Incomes: ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, కొన్ని ఆదాయాల మీద కొంతమేర లేదా పూర్తిగా పన్ను మినహాయింపు లభిస్తుందిత. వ్యవసాయం, NRE అకౌంట్‌, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ వంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

FOLLOW US: 
Share:

Income Tax Return Filing 2024: ఈ నెలాఖరులోగా (31 జులై 2024‌) మీ ITR ఫైల్ చేయాలి. ఈ గడువు దాటితే లేట్‌ ఫైన్‌ కట్టాలి. అయితే, అన్ని రకాల ఆదాయాల మీదా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయ పన్ను చట్టమే ఈ విషయాన్ని చెబుతోంది. ఐటీ యాక్ట్‌ ప్రకారం, కొన్ని ఆదాయ వనరులు పాక్షికంగా/పూర్తిగా పన్ను రహితం.

ఎలాంటి ఆదాయాలపై పన్ను కట్టాల్సిన అవసరం లేదు?

వ్యవసాయ ఆదాయం: 
వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయానికి (Agriculture income) పన్ను మినహాయింపు ఉంది. పంటల విక్రయం ద్వారా సంపాదించిన ఆదాయంపై మాత్రమే కాకుండా, వ్యవసాయ భూమి లేదా భవనాల నుంచి అద్దె & వ్యవసాయ భూమిని కొనడం/అమ్మడం ద్వారా సంపాదించిన లాభాలను కూడా ఇది కవర్ చేస్తుంది.

NRE అకౌంట్‌పై వడ్డీ ఆదాయం: 
ప్రవాస భారతీయుల కోసం NRE (Non Resident External) అకౌంట్‌ ఉంటుంది. విదేశాల్లో నివసిస్తున్న వ్యక్తులు భారతదేశంలో డబ్బు డిపాజిట్‌ చేసే అకౌంట్‌ ఇది. NRE డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పన్ను రహితం. NRIలు ఈ ఖాతాల ద్వారా డబ్బును వారి స్వస్థలాలకు పంపొచ్చు.

గ్రాట్యుటీ: 
ప్రైవేట్ రంగ ఉద్యోగులు, రిటైర్మెంట్‌ తర్వాత రూ. 20 లక్షల వరకు గ్రాట్యుటీ (Gratuity) మొత్తానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో, గత DA పెంపు తర్వాత గ్రాట్యుటీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు పెంచారు.

మూలధన లాభాలు: 
కొన్ని మూలధన లాభాలు ‍‌(Capital gains) కూడా టాక్స్‌-ఫ్రీ. పట్టణ వ్యవసాయ భూమిని కోల్పోయినందుకు పరిహారం పొందిన వ్యక్తులు ఆ డబ్బుపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

భాగస్వామ్య సంస్థ నుంచి లాభం: 
మీకు ఏదైనా కంపెనీలో వాటా ఉంటే, ఆ సంస్థ నుంచి స్వీకరించిన లాభంపై (Profit from partnership firm) ఆదాయ పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం, పన్ను చెల్లించిన తర్వాతే లాభాల్లో వాటాను భాగస్వాములు పొందుతారు.

స్కాలర్‌షిప్: 
ఉన్నత చదువుల కోసం ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థల నుంచి ఉపకార వేతనాలు (Scholarship) పొందుతున్న విద్యార్థులను పన్ను భారం నుంచి మినహాయించారు.

ప్రావిడెంట్ ఫండ్: 
ప్రావిడెంట్‌ ఫండ్‌ (Provident fund) డబ్బు పదవీ విరమణ తర్వాత పన్ను రహితంగా మారుతుంది. ఒక ఉద్యోగి (ఒక ఉద్యోగం ద్వారా లేదా వివిధ ఉద్యోగాలు మారినప్పటికీ) 5 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పాటు ప్రావిడెంట్‌ ఫండ్‌కు కాంట్రిబ్యూట్‌ చేస్తే, రిటైర్మెంట్‌ తర్వాత ఆ ఉద్యోగి అందుకునే పీఎఫ్‌ డబ్బు పూర్తిగా పన్ను రహితం.

లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్: 
రిటైర్మెంట్ తర్వాత లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ (Leave encashment) డబ్బు వస్తే, అది పాక్షికంగా పన్ను రహితం. ప్రభుత్వ ఉద్యోగులు 10 నెలల లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈ పరిమితి రూ.25 లక్షలు.

పెన్షన్లు: 
UNO వంటి కొన్ని సంస్థల నుంచి తీసుకునే పెన్షన్‌పై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. కుటుంబ పెన్షన్‌లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. గ్యాలంట్రీ అవార్డు విజేతలు & వారి కుటుంబాలు, సాయుధ దళాల సిబ్బంది & వారి కుటుంబాలకు అందించే పెన్షన్‌లను పన్ను పరిధి నుంచి తప్పించారు.

స్వచ్ఛంద పదవీ విరమణ: 
స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత అందుకునే డబ్బులో రూ. 5 లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. 

వివాహ బహుమతులు:
దగ్గరి బంధువుల నుంచి లేదా వివాహ సమయంలో స్వీకరించిన బహుమతులపై (Wedding Gifts) టాక్స్‌ కట్టక్కర్లేదు. ఆదాయ పన్ను చట్టం ప్రకారం, దగ్గరి “బంధువు” అంటే భార్య, భర్త, సోదరి, సోదరుడు సహా మరికొందరు ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఈ లిస్ట్‌లో లేని బంధువులు లేదా ఇతర వ్యక్తుల నుంచి వచ్చే బహుమతుల విలువ రూ.50,000 లోపు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

అలవెన్సులు: 
కొన్ని అలవెన్సులు (Allowances) కూడా పన్ను రహితం. ఉదాహరణకు.. విదేశాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు భారత ప్రభుత్వం అందించే విదేశీ భత్యంపై టాక్స్ ఉండదు. 

బీమా కంపెనీ నుంచి పొందిన డబ్బు: 
బీమా కంపెనీ ‍‌(Insurance companies) నుంచి బోనస్‌లు సహా ఎలాంటి డబ్బు మీకు వచ్చినా (కేమాన్ ఇన్సూరెన్స్ పాలసీలు మినహా), ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 10(10D) ప్రకారం ఆ డబ్బుపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

మరో ఆసక్తికర కథనం: NPSలో భారీ మార్పులకు సర్వం సిద్ధం!, మీకు ఎంత పెన్షన్‌ వస్తుందంటే?

Published at : 14 Jul 2024 06:00 AM (IST) Tags: Income Tax it return ITR 2024 Tax-Free Incomes No Tax Earnings No Tax Earning

ఇవి కూడా చూడండి

Cashback Credit Cards: ఆన్‌లైన్ షాపింగ్‌పై బంపర్‌ డిస్కౌంట్‌ - ఈ క్రెడిట్ కార్డ్స్‌తో అద్భుతమైన క్యాష్‌బ్యాక్స్‌

Cashback Credit Cards: ఆన్‌లైన్ షాపింగ్‌పై బంపర్‌ డిస్కౌంట్‌ - ఈ క్రెడిట్ కార్డ్స్‌తో అద్భుతమైన క్యాష్‌బ్యాక్స్‌

Gold-Silver Prices Today 28 Dec: భలే ఛాన్స్‌, రూ.1600 తగ్గిన బంగారం ధర - మీ ప్రాంతంలో ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 28 Dec: భలే ఛాన్స్‌, రూ.1600 తగ్గిన బంగారం ధర - మీ ప్రాంతంలో ఈ రోజు పసిడి, వెండి ధరలు ఇవీ

Investment Tips: ఈ పొదుపు పథకాలకు దేశవ్యాప్తంగా ఫుల్‌ పాపులారిటీ - పెట్టుబడిపై 8 శాతం పైగా రాబడి

Investment Tips: ఈ పొదుపు పథకాలకు దేశవ్యాప్తంగా ఫుల్‌ పాపులారిటీ - పెట్టుబడిపై 8 శాతం పైగా రాబడి

CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్‌ లోన్‌ తీసుకోలేదు' - నా సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

CIBIL Score: 'నేను ఇప్పటివరకు బ్యాంక్‌ లోన్‌ తీసుకోలేదు' - నా సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా?

Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌

Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌

టాప్ స్టోరీస్

Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ

Pawan Kalyan: 'వైసీపీ నేతలకు అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి' - ఖబడ్దార్ అంటూ పవన్ వార్నింగ్, ఎంపీడీవోకు పరామర్శ

Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని

Manmohan Singh Last Rites: ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, మాజీ ప్రధానికి తుది వీడ్కోలు పలికిన భారతావని

Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Chiranjeevi Odela Movie: పాటలు, హీరోయిన్ లేకుండానే చిరు - ఓదెల సినిమా?... రూమర్లపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పర్యటనలో సెక్యూరిటీ లోపం - వెంటే తిరిగిన ఫేక్ ఐపీఎస్, సిబ్బందితో ఫొటోలకు ఫోజులు