search
×

ITR 2024: ITR-1 ఎవరు ఫైల్ చేయాలి, ఎవరు ఫైల్‌ చేయకూడదు?

జీతం తీసుకునే వ్యక్తులందరికీ ITR-1 వర్తించదు. వాళ్ల ఆదాయ మూలాల ఆధారంగా ఇతర ఫారాలను కూడా ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు.

FOLLOW US: 
Share:

Income Tax Return Filing 2024: ఆదాయ పన్ను విభాగం ITR-1 నుంచి ITR-4 వరకు ఉన్న ఫామ్స్‌ను వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్ల (Individual Taxpayers) కోసం నిర్దేశించింది. సంపాదన, ఆదాయ మూలాల ఆధారంగా, ఇన్‌కం టాక్స్‌ రిటర్న్‌ ఫారాన్ని (ITR Form) టాక్స్‌ పేయర్‌ ఎంచుకోవాలి. 

ITR-1 కింద రిటర్న్‌ ఫైల్ చేయడానికి.. జీతం తీసుకునే వ్యక్తులను (Salaried) & ఇండివిడ్యువల్‌ పర్సన్స్‌ను ఐటీ డిపార్ట్‌మెంట్‌ అనుమతిస్తుంది. మిగిలిన ఫారాల కంటే ITR-1 చాలా సరళంగా ఉంటుంది. మిగిలిన ఫారాలతో పోలిస్తే, దీనిలో ఎక్కువ సమాచారం నింపాల్సిన అవసరం ఉండదు. 

అయితే, జీతం తీసుకునే వ్యక్తులందరికీ ITR-1 వర్తించదు. వాళ్ల ఆదాయ మూలాల ఆధారంగా ఇతర ఫారాలను కూడా ఎంపిక చేసుకోవాల్సి రావచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి జరిపిన లావాదేవీల ఆధారంగా అతను ITR-1కి అర్హుడా/అనర్హుడా అన్నది నిర్ణయమవుతుంది.

ITR-1 ఎవరు ఫైల్‌ చేయాలి?

- భారతదేశ పౌరుడు
- ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 50 లక్షల లోపు వ్యక్తిగత ఆదాయం సంపాదించే వ్యక్తి
- జీతం, పెన్షన్, కుటుంబ పెన్షన్, ఇంటి ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం
- రూ. 5000కు మించని వ్యవసాయ ఆదాయం 
- పోస్టాఫీస్‌/కోఆపరేటివ్ సొసైటీ/బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ నుంచి వడ్డీ ఆదాయం
- సేవింగ్స్‌ ఖాతాల నుంచి వడ్డీ ఆదాయం 
- డివిడెండ్స్‌
- ఆదాయ పన్ను వాపసుపై వచ్చిన వడ్డీ, ఇతర రూపాల్లో వడ్డీ ఆదాయం తీసుకున్న వ్యక్తులు ITR-1 ఫారాన్ని పూరించవచ్చు.

ITR-1 ఎవరు ఫైల్ చేయలేరు?

- ప్రవాస భారతీయులు 
- ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ.50 లక్షలకు మించినప్పుడు
- వ్యవసాయ ఆదాయం రూ.5000 కంటే ఎక్కువ ఉన్నప్పుడు
- లాటరీ, గుర్రపు పందేలు, చట్టబద్ధమైన జూదం నుంచి ఆదాయం వచ్చినప్పుడు
- బంగారం, ఈక్విటీ షేర్లు వంటివాటిపై మూలధన లాభాలు (స్వల్పకాలిక  & దీర్ఘకాలిక లాభాలు) వచ్చినప్పుడు
- స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్ చేయని ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెట్టినప్పుడు
- వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం ఉన్నప్పుడు
- ఒక కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటే
- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 194N కింద TDS ఉంటే
- ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తుల నుంచి ఆదాయం ఉంటే
- ITR-1 ఫైల్‌ చేయడానికి అర్హతలు లేనివాళ్లు
- హిందు అవిభక్త కుటుంబాలు (HUF)

పొరపాటున ITR-1 ఫైల్ చేస్తే ఏమవుతుంది?

సరైన ఫామ్‌ను ఎంచుకోకపోతే, ఆ తర్వాత సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. అనర్హుడైన వ్యక్తి పొరపాటున ఐటీఆర్-1 ఫైల్ చేస్తే, ఆదాయపు పన్ను విభాగం దానిని స్వీకరించదు, నోటీసు కూడా రావచ్చు. అప్పుడు, సరైన ఫారాన్ని ఎంచుకుని, రివైజ్డ్ ITRను ఫైల్‌ చేయాల్సి వస్తుంది. నోటీసు తేదీ నుంచి 15 రోజుల లోపు దీనిని దాఖలు చేయాలి. ఆ గడువు కూడా దాటితే ఆ వ్యక్తి నింపిన ITR చెల్లదు, రిటర్న్‌ దాఖలు చేయనట్లుగానే ఆదాయ పన్ను విభాగం భావిస్తుంది.

2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 మదింపు సంవత్సరానికి ITR సమర్పించడానికి చివరి తేదీ 31 జులై 2024. ఆ తర్వాత, పెనాల్టీ కట్టి ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఐటీ డిపార్ట్‌మెంట్‌ అనుమతి ఇస్తుంది.

మరో ఆసక్తికర కథనం: ఈ దేశాల్లో ఆదాయ పన్ను 'సున్నా', మీరు సంపాదించిందంతా మీదే

Published at : 24 Feb 2024 04:24 PM (IST) Tags: Income Tax it return ITR-1 ITR 2024 ITR-1 Eligibility

ఇవి కూడా చూడండి

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్‌ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్‌!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!

టాప్ స్టోరీస్

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు

CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు

Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?

Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?

Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!

Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!

Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు

Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు