By: Arun Kumar Veera | Updated at : 25 May 2024 12:10 PM (IST)
నగదు లావాదేవీలపై ఇన్‌కమ్ టాక్స్ రూల్స్
Income Tax Rules On Cash Deposits And Cash Transactions: మనీలాండరింగ్, పన్ను ఎగవేతల వంటి అడ్డగోలు వ్యవహారాలను అడ్డుకోవడానికి ఆదాయ పన్ను చట్టంలో కొన్ని నియమాలు ఉన్నాయి. దేశంలోని ప్రతి వ్యక్తికి ఈ రూల్స్ వర్తిస్తాయి.
సేవింగ్స్ ఖాతా & కరెంట్ ఖాతాల్లో నగదు డిపాజిట్లపై పరిమితులు
ఆదాయ పన్ను చట్టం ప్రకారం, బ్యాంకు ఖాతాల్లో నగదు డిపాజిట్లపై ఎలాంటి పరిమితి లేదు. కానీ, షరతులు వర్తిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒక వ్యక్తికి చెందిన ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పొదుపు ఖాతాల్లో కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే, ఆ విషయాన్ని తప్పనిసరిగా ఆదాయ పన్ను అధికార్లకు చెప్పాలి. మనీలాండరింగ్‌ను ఆపడానికి ఈ రూల్ తీసుకొచ్చారు. కరెంట్ ఖాతాల విషయంలో ఈ థ్రెషోల్డ్ ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలు.
ఒక ఆర్థిక సంవత్సరంలో, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పొదుపు ఖాతాల్లో కలిపి రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ డబ్బు డిపాజిట్ చేస్తే, ఆ వివరాలను ఆర్థిక సంస్థలు ఐటీ డిపార్ట్‌మెంట్‌కు పంపుతాయి. కాబట్టి, ఈ విషయాన్ని టాక్స్‌పేయర్ దాచి పెట్టాలని చూసినా దాగదు. ఈ డిపాజిట్లపై వెంటనే పన్ను విధించరుగానీ, ఆదాయ మూలాల గురించి వివరించాల్సి వస్తుంది.
నగదు ఉపసంహరణలపై టీడీఎస్ - సెక్షన్ 194N
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 194N ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక కోటి రూపాయల కంటే ఎక్కువ క్యాష్ విత్‌డ్రా చేస్తే 2% TDS కట్ చేస్తారు. గత మూడేళ్లుగా ఐటీ రిటర్న్ దాఖలు చేయని వ్యక్తుల విషయంలో, రూ.20 లక్షల కంటే ఎక్కువ నగదు ఉపసంహరణపై 2% TDS శాతం కట్ అవుతుంది. ఇదే కేస్‌లో, రూ.1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే 5% TDS వర్తిస్తుంది.
నగదు లావాదేవీ పరిమితి - సెక్షన్ 269ST
సెక్షన్ 269ST ప్రకారం, ఒకే లావాదేవీ లేదా ఒకే ఈవెంట్‌కు సంబంధించిన వివిధ లావాదేవీల్లో నగదు రూపంలో రూ.2 లక్షలకు మించి చెల్లింపులు చేసిన వ్యక్తులు జరిమానా చెల్లించాలి.
నగదు రూపంలో రుణాలు - సెక్షన్ 269SS, సెక్షన్ 269T
సెక్షన్ 269SS ప్రకారం, రూ.20 వేల కంటే ఎక్కువ రుణాన్ని నగదు రూపంలో తీసుకోవడం నిషేధం. సెక్షన్ 269T ప్రకారం, రూ.20 వేల కంటే ఎక్కువ రుణాన్ని నగదు రూపంలో చెల్లించకూడదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, ఎంత లోన్ తీసుకుంటే అంత ఫైన్ కట్టాల్సి వస్తుంది.
వ్యాపారాలు - సెక్షన్ 44AD, సెక్షన్ 44ADA
IT చట్టంలోని సెక్షన్ 44AD, సెక్షన్ 44ADA ప్రకారం, రూ.2 కోట్ల వరకు టర్నోవర్ ఉన్న వ్యాపార సంస్థలు & రూ.50 లక్షల వరకు గ్రాస్ రిసిప్ట్స్ కలిగిన వృత్తిపరమైన సంస్థలు (Professional Firms) ప్రిజంప్టివ్ టాక్సేషన్‌ను ఎంచుకోవచ్చు. దీనివల్ల, ప్రకటించిన టర్నోవర్‌కు సరిపోయే నగదు డిపాజిట్లపై జరిమానాలు ఉండవు. అయితే... ఆదాయ మూలాన్ని చెప్పలేకపోతే మాత్రం సెక్షన్ 68 ప్రకారం ఐటీ విభాగం నోటీసులు జారీ చేస్తుంది. 25 శాతం సర్‌చార్జ్, 4 శాతం సెస్, 60 శాతం పన్ను విధిస్తుంది.
రియల్ ఎస్టేట్ లావాదేవీలు
ఏదైనా ఆస్తి కొనుగోలు చేసినప్పుడు పూర్తి మొత్తాన్ని నగదు రూపంలో చెల్లించకూడదు. ఒకవేళ కొంత మొత్తాన్ని క్యాష్ రూపంలో ఇచ్చి ఉంటే, ఆ వివరాలను సేల్ డీడ్‌లో తప్పనిసరిగా సూచించాలి.
క్రెడిట్ కార్డ్ బిల్లులు
క్యాష్ రూపంలో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులపైనా పరిమితులు ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ బిల్లు రూపంలో ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ డబ్బు చెల్లిస్తే ఐటీ డిపార్ట్‌మెంట్ ఆరా తీస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో పే చేస్తే, ఆ డబ్బుకు సంబంధించిన మూలాల గురించి ఆదాయ పన్ను అధికార్లు అడుగుతారు.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు
పన్ను ఎగవేతలను అడ్డుకోవడానికి ఆదాయ పన్ను విభాగం ఫిక్స్‌డ్ డిపాజిట్లపైనా కొన్ని నిబంధనలు సెట్ చేసింది.
మరో ఆసక్తికర కథనం: వచ్చే నెలలో బ్యాంక్‌లు 13 రోజులు పని చేయవు, ఈ లిస్ట్ సేవ్ చేసుకుంటే బెటర్
Saving Ideas: రూల్ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్ ఛేంజర్' ఇది
Blue Aadhaar Card: బ్లూ కలర్ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్ చేసుకోండి
Gold Vs Diamond: బంగారం లేదా వజ్రం - ఎందులో పెట్టుబడితో ఎక్కువ లాభం?
Gold-Silver Prices Today 02 Nov: పండుగ తర్వాత పసిడి రేట్ల పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Bank Holidays: ఈ నెలలో బ్యాంక్‌లు 12 రోజులు సెలవుల్లోనే ఉంటాయి, మీకేదైనా ముఖ్యమైన పని ఉందా?
Janasena: వైసీపీ నుంచి వచ్చి చేరిన నేతలతోనే ఇబ్బంది - టీడీపీతో జనసేన మైత్రిని వారే చెడగొడుతున్నారా ?
Sabarimala News: శబరిమల యాత్రికులకు శుభవార్త, రూ.5 లక్షల ఉచిత బీమా కల్పిస్తూ నిర్ణయం
Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు గ్రీన్ సిగ్నల్, కొత్తగా 5 మార్గాల్లో పనులకు జీవో జారీ
Telangana Congress Bombs : తుస్సుమన్న తెలంగాణ కాంగ్రెస్ బాంబులు - ఆ కారణంతోనే వెనుకడుగు!
Rains in AP, Telangana: ఉపరితల ఆవర్తనంతో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు, IMD ఎల్లో అలర్ట్