search
×

Monthly Income: నెలనెలా వేలల్లో రాబడి - ఈ గ్యారెంటీ స్కీమ్‌ను అస్సలు మిస్‌ కావద్దు

Investment Tips: ఈ స్కీమ్‌లో ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే, ప్రతి నెలా హామీతో కూడిన డబ్బును తిరిగి తీసుకోవచ్చు. సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఈ ఖాతా ప్రారంభించొచ్చు.

FOLLOW US: 
Share:

Post Office Monthly Income Scheme Details In Telugu: మన దేశ ప్రజల్లో ఉన్న గొప్ప గుణం పొదుపు. ఈ మంచి అలవాటు తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది. పెద్దయినా, పేదయినా.. సంపాదనను సేవ్‌ చేయడంలో భారతీయులు బహు నేర్పరులు. పిల్లాడి చదువుకోసమనో, పిల్ల పెళ్లి కోసమనో, ముదిమిలో ఆదుకుంటుందనో డబ్బు దాచి పెడుతుంటారు. అలా దాచిన డబ్బుతో బంగారమో, స్థలాలో కొంటుంటారు. బ్యాంక్‌లు బాగా అందుబాటులోకి వచ్చాక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు పెరిగాయి. డబ్బును సేవ్‌ చేసే సంప్రదాయ మార్గాల్లో పోస్టాఫీస్‌ ఖాతా కూడా ఒకటి. పోస్టాఫీస్‌ పథకాలు ప్రజల మనసుల్లో పాతుకుపోయాయి. 

పోస్టాఫీసు పథకాల్లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో క్రమశిక్షణతో దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెడితే పెద్ద సంపద సృష్టించొచ్చు. ఎప్పుడో భవిష్యత్‌లో డబ్బు రావడం కాదు, ఇప్పుడే నెలానెలా డబ్బు చేతికి రావాలని మీరు కోరుకుంటే.. అందుకు కూడా ఒక సూపర్‌ స్కీమ్‌ ఉంది. దాని పేరు 'పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌' (Post Office Monthly Income Scheme - POMIS). 

పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం వివరాలు:

-- పోస్టాఫీస్‌ నెలవారీ ఆదాయ పథకానికి మంచి ప్రజాదరణ ఉంది. ఈ స్కీమ్‌లో ఒకేసారి కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెడితే, ప్రతి నెలా హామీతో కూడిన డబ్బును తిరిగి తీసుకోవచ్చు.
-- సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఈ ఖాతా ప్రారంభించొచ్చు.
-- సింగిల్‌ అకౌంట్‌లో ఒకేసారి 9 లక్షల రూపాయల వరకు డిపాజిట్‌ చేయొచ్చు. జాయింట్‌ అకౌంట్‌లో గరిష్ట పరిమితి 15 లక్షల రూపాయలు.
-- ఈ పథకంలో ఐదేళ్ల టెన్యూర్‌ కోసం డిపాజిట్ చేయవచ్చు.
-- పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసిన మొత్తంపై 7.40% వడ్డీ లభిస్తుంది.
-- వడ్డీ డబ్బు ప్రతి నెలా ఖాతాలో జమవుతుంది. ఆ డబ్బును నెలనెలా విత్‌డ్రా చేసుకోవచ్చు.
-- సింగిల్‌ అకౌంట్‌లో గరిష్ట పెట్టుబడి రూ.9 లక్షలపై నెలకు రూ.5,500 రాబడి చేతికి వస్తుంది. 
-- జాయింట్ అకౌంట్‌లో గరిష్ట పెట్టుబడి రూ.15 లక్షలపై నెలకు రూ.9,250 గ్యారెంటీ ఆదాయం లభిస్తుంది. 

పోస్టాఫీస్‌ పొదుపు పథకాలపై ప్రస్తుత వడ్డీ రేట్లు (Post Office Small Saving Scheme Interest Rates 2024)

-- పోస్టాఫీస్‌ పొదుపు ఖాతా (Post Office Saving Scheme) ---- వడ్డీ రేటు 4%
-- 1 సంవత్సరం టైమ్ డిపాజిట్  ---- వడ్డీ రేటు 6.90%
-- 2 సంవత్సరాల కాల డిపాజిట్  ---- వడ్డీ రేటు 7.00%
-- సంవత్సరాల కాల డిపాజిట్  ---- వడ్డీ రేటు 7.10%
-- సంవత్సరాల కాల డిపాజిట్  ---- వడ్డీ రేటు 7.50%
-- 5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్  ---- వడ్డీ రేటు 6.70%
-- సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana Interest Rate) ---- వడ్డీ రేటు 8.20%
-- సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS Interest rate) ---- వడ్డీ రేటు 8.20%
-- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC Interest rate) ---- వడ్డీ రేటు 7.70%
-- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్  (PPF Interest rate) ---- వడ్డీ రేటు 7.10%
-- కిసాన్ వికాస్ పత్ర (KVP Interest rate) ---- వడ్డీ రేటు 7.50% (115 నెలల మెచ్యూరిటీ కాలం)

ఈ వడ్డీ రేట్లు ఈ నెలాఖరు (జూన్‌ 2024) వరకు వర్తిస్తాయి. కేంద్ర ఆర్థిక శాఖ సమీక్ష తర్వాత, జులై నుంచి వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంది.

మరో ఆసక్తికర కథనం: ఆపిల్‌ కంటే పెద్ద సంస్థగా ఎన్‌విడియా రికార్డ్‌ - బిగెస్ట్‌ కంపెనీల లెక్కలు మారాయ్‌

Published at : 06 Jun 2024 03:40 PM (IST) Tags: Interest Rate Post Office Scheme Small savings scheme Monthly Income Scheme POMIS

ఇవి కూడా చూడండి

Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌

Year Ender 2024: హ్యుందాయ్‌ నుంచి స్విగ్గీ వరకు - 2024లో మార్కెట్‌ను షేక్‌ చేసిన IPOల లిస్ట్‌

Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?

Life Insurance Policy: మెచ్యూరిటీకి ముందే జీవిత బీమా పాలసీని సరెండర్ చేస్తే ఎంత నష్టపోతారో తెలుసా?

Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్‌ బ్యాంక్‌లు - హోమ్‌ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?

Lowest Home Loan Rates: ప్రభుత్వ బ్యాంక్‌లు లేదా ప్రైవేట్‌ బ్యాంక్‌లు - హోమ్‌ లోన్‌పై ఎక్కడ వడ్డీ తక్కువ?

PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి

PMAY 2.0 Scheme: మీకు కొత్త ఇల్లు కావాలా? పీఎం ఆవాస్ యోజన 2.0 కింద ఇలా అప్లై చేయండి

ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?

ITR: ఐటీఆర్‌ ఫైలింగ్‌లో డిసెంబర్ 31 డెడ్‌లైన్‌ను కూడా మిస్‌ చేస్తే ఎన్ని రకాల నష్టాలో తెలుసా?

టాప్ స్టోరీస్

Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు

Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు

Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : రికమెండేషన్లకు గుడ్ బై - టాలెంట్ ఉంటే చాలు ఉద్యోగం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ

Daaku Maharaaj Press Meet: 'వాల్తేరు వీరయ్య' కంటే 'డాకు మహారాజ్' బాగుంది... ఆ తమిళ సినిమాలే టార్గెట్ - 'డాకు మహారాజ్' ప్రెస్ మీట్ లో నాగ వంశీ

Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ

Adilabad News: ఏబీపీ దేశం కథనానికి స్పందించిన దాతలు- విద్యార్థులకు, వృద్ధులకు స్వెటర్లు, దుప్పట్లు పంపిణీ