By: ABP Desam | Updated at : 07 Dec 2023 07:29 PM (IST)
ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ Vs సుకన్య సమృద్ధి యోజన
Women Savings Certificate Scheme: 2023-24 బడ్జెట్‌ను సమర్పించే సమయంలో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మహిళల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు. మహిళలకు ప్రయోజనం చేకూర్చే ఆ పథకం పేరు మహిళా సమ్మాన్ బచత్ పత్ర (Mahila Samman Saving Certificate లేదా MSSC). దీనిని ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ అని కూడా పిలుస్తారు. ఇది చిన్న మొత్తాల పొదుపు పథకం. ఈ స్కీమ్ కింద పోస్టాఫీసులో ఖాతా తెరవవచ్చు.
మహిళల కోసం సుకన్య సమృద్ధి యోజనను (Sukanya Samriddhi Yojana లేదా SSY) కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి అమలు చేస్తోంది. ఈ పథకానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది.
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన (Mahila Samman Bachat Patra Yojana)
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన అనేది ఒక స్వల్పకాలిక పథకం, దీనిలో రెండేళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం 1 ఏప్రిల్ 2023 నుంచి ప్రారంభమైంది. ఈ పథకంలో పెట్టుబడులకు ఏడాదికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిది. దీనిలో, తక్కువ కాల వ్యవధిలో మంచి వడ్డీ ఆదాయం పొందొచ్చు. ఈ స్కీమ్‌లో చేరడానికి వయోపరిమితి లేదు. ఏ వయస్సులో ఉన్న బాలికలు లేదా మహిళలైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. మీకు డబ్బు అవసరమైనతే, కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన ఒక దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనిలో ఆడపిల్లల కోసం మాత్రమే పెట్టుబడి పెట్టాలి. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసిన మొత్తంపై 8 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ డబ్బును ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు, దఫదఫాలుగానూ డిపాజిట్ చేయవచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత, ఆ ఖాతా నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆమెకు 21 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కు తీసుకోవచ్చు.
MSSC - SSY మధ్య తేడాలు (Differences between MSSC - SSY)
మహిళా సమ్మాన్ బచత్ పత్ర & సుకన్య సమృద్ధి యోజన - ఈ రెండు పథకాలు మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించినా, ఈ రెండింటి మధ్య కొంత వ్యత్యాసం ఉంది. మహిళా సమ్మాన్ బచత్ పత్రలో ఏ మహిళ అయినా పెట్టుబడి పెట్టవచ్చు, అయితే, SSYలో బాలికల పేరిట మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మహిళా సమ్మాన్ బచత్ పత్ర అనేది స్వల్పకాలిక పథకం, దీనిలో మీరు ఏకమొత్తంలో మాత్రమే డిపాజిట్ చేయాలి. SSY అనేది దీర్ఘకాలిక పథకం, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు దఫదఫాలుగా పెట్టుబడి పెడుతూ వెళ్లవచ్చు. మహిళా సమ్మాన్ బచత్ పత్రలో రూ.2 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. SSYలో, ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలకు మించకుండా కొన్నేళ్ల వరకు పెట్టుబడి పెడుతూనే ఉండవచ్చు.
మీ పాప లేదా మీ ఇంట్లో మహిళల కోసం కోసం స్వల్పకాలానికి ఒకేసారి పెట్టుబడి పెట్టాలి అనుకుంటే MSSC మంచి పథకం. మీ కుమార్తె లేదా చిన్న పాప కోసం దీర్ఘకాలం పాటు చిన్న/పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే సుకన్య సమృద్ధి యోజన ఒక బెటర్ ఆప్షన్.
మరో ఆసక్తికర కథనం: కొత్త సిమ్ తీసుకోవాలంటే కొత్త రూల్స్, ఇకపై ట్రిక్స్ పని చేయవు
Bank Account Nominee: ప్రతి బ్యాంక్ ఖాతాలో 4 నామినీ పేర్లు - అతి త్వరలో మార్పులు!
NTPC Green Energy IPO: ఎన్‌టీపీసీ గ్రీన్ ఐపీవో అలాట్‌మెంట్ స్టేటస్‌ను ఇంట్లో కూర్చునే ఇలా చెక్ చేయండి
Money Saving: జీతం నుంచి నెలవారీ సేవింగ్ - ఈ 7 పద్ధతులు పాటిస్తే మీరే 'కింగ్'
Share Market Today: స్టాక్ మార్కెట్‌లో బుల్ పరేడ్ - సెన్సెక్స్ 1300 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు హైజంప్
Gold-Silver Prices Today 25 Nov: ఏకంగా రూ.1000 తగ్గిన పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Ram Gopal Varma: ఆర్జీవీ మార్ఫింగ్‌ల కేసు కాదు అంతకు మించి - అందుకే పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాకుండా పరార్ ?
Hydra Commissioner Ranganath House:హైడ్రా కమిషనర్ రంగనాథ్ చుట్టూ మరో వివాదం- ఇంతకీ ఆయన ఇచ్చిన వివరణ ఏంటీ?
Indian Railways: జస్ట్ రూ.5 కోసం కక్కుర్తి పడితే రూ.లక్ష పోయింది - రైల్వే శాఖ సంచలన నిర్ణయం
Tata Punch CNG EMI: టాటా పంచ్ సీఎన్‌జీ ఈఎంఐలో కొనడం ఎలా? - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?