search
×

Investment Tips: ఈ పొదుపు పథకాలకు దేశవ్యాప్తంగా ఫుల్‌ పాపులారిటీ - పెట్టుబడిపై 8 శాతం పైగా రాబడి

Small Savings Schemes: పెట్టుబడి పరంగా రిస్క్ తీసుకోని వ్యక్తులకు చిన్న మొత్తాల పొదుపు పథకాలు బెస్ట్‌ ఛాయిస్‌. వీటిలో, హామీతో కూడిన రాబడితో పాటు ఆదాయ పన్ను మినహాయింపు ప్రయోజనాన్ని కూడా పొందొచ్చు.

FOLLOW US: 
Share:

Post Office Savings Schemes: మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడని & పెట్టుబడి విషయంలో అసలు రిస్క్ తీసుకోని పెట్టుబడిదారులే మన దేశంలో మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. నిర్ణీత సమయానికి కచ్చితమైన రాబడిని ఇచ్చే పెట్టుబడులు వాళ్లకు కావాలి. అలాంటి వ్యక్తులకు, పోస్టాఫీసు పథకాలు లేదా చిన్న మొత్తాల పొదుపు పథకాలు చాలా అనువుగా ఉంటాయి. ఈ స్కీమ్స్‌లో పెట్టుబడి పెడితే అత్యవసర పరిస్థితుల్లో డబ్బును వెంటనే వెనక్కు తీసుకోవడమే కాకుండా, పొదుపు లక్ష్యాన్ని కూడా చేరుకోవచ్చు. అంతేకాదు, ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80C కింద ఈ పథకాల్లో పెట్టుబడులకు రూ. 1.50 లక్షల వరకు పన్ను ప్రయోజనం కూడా లభిస్తుంది. 

పోస్టాఫీస్ పొదుపు ఖాతా (Post Office Savings Account)
పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ కింద 4 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. ఈ ఖాతా తెరవడానికి కనీస మొత్తం రూ. 500.

నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్‌ (National Savings Time Deposit)
ఈ స్కీమ్‌లో పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు. ఏడాది డిపాజిట్లపై 6.90 శాతం, రెండేళ్ల డిపాజిట్లపై 7 శాతం, మూడేళ్ల డిపాజిట్లపై 7.10 శాతం, ఐదేళ్ల డిపాజిట్లపై 7.50 శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది. 

నేషనల్‌ సేవింగ్స్‌ రికరింగ్ డిపాజిట్ అకౌంట్‌ (National Savings Recurring Deposit Account)
ఈ స్కీమ్‌ కింద ఆదాయ పన్ను కూడా ఆదా చేయొచ్చు. రూ. 100తో ప్రారంభించవచ్చు, పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. దీనిపై 6.70 శాతం వడ్డీ లభిస్తుంది.

నేషనల్‌ సేవింగ్స్‌ మంత్లీ ఇన్‌కమ్‌ అకౌంట్‌ (National Savings Monthly Income Account) 
ఇందులో జమ చేసే డబ్బుపై వార్షికంగా 7.40 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో, సింగిల్‌ అకౌంట్‌లో గరిష్ట పెట్టుబడి మొత్తం రూ.9 లక్షలు కాగా, జాయింట్‌ అకౌంట్‌లో గరిష్ట పెట్టుబడి పరిమితి రూ.15 లక్షలు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (Public Provident Fund - PPF)
ఈ ఖాతా తెరిచే పెట్టుబడిదారులకు ఏటా 7.10 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు కనీసం రూ. 500తో ఖాతా ప్రారంభించొచ్చు, ఒక ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడి గరిష్ట మొత్తం రూ. 1.50 లక్షలు.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (Senior Citizen Savings Scheme - SCSS) 
వృద్ధాప్యంలో దీర్ఘకాలిక పెట్టుబడి కోసం రూపొందించిన ఈ స్కీమ్‌లో, డిపాజిట్ చేసిన తేదీ నుంచి 31 మార్చి/30 సెప్టెంబర్/31 డిసెంబర్‌, ఏప్రిల్ 01, జులై 01, అక్టోబర్ 01, జనవరి 01న వడ్డీ చెల్లిస్తారు. ఇందులో రూ. 1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు, రూ. 30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. 

సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana - SSY)
ఈ పథకం కింద, మీ దగ్గర రూ. 250 ఉన్నా పొదుపు ప్రారంభించవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తంపై 8.20 శాతం వడ్డీ లభిస్తుంది. ఇందులో, మీరు ఒక సంవత్సరంలో గరిష్టంగా రూ. 1.50 లక్షలు డిపాజిట్ చేయవచ్చు.

కిసాన్ వికాస్ పత్ర (Kisan Vikas Patra - KVP)
ఈ పథకం కింద రూ. 1000తో ఖాతా స్టార్ట్‌ చేయొచ్చు, పెట్టుబడిపై గరిష్ట పరిమితి లేదు. ఇది ఏటా 7.50 శాతం వడ్డీ ఆదాయాన్ని ఇస్తుంది.

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (National Savings Certificate - NSC)
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ నుంచి వార్షికంగా 7.70 శాతం వడ్డీ రాబడి లభిస్తుంది. ఇందులో పెట్టుబడికి కనీస పరిమితి రూ. 1000, గరిష్ట పరిమితి లేదు. 

మరో ఆసక్తికర కథనం: 'నేను ఇప్పటివరకు బ్యాంక్‌ లోన్‌ తీసుకోలేదు' - నా సిబిల్‌ స్కోర్‌ పెరుగుతుందా, తగ్గుతుందా? 

Published at : 28 Dec 2024 08:59 AM (IST) Tags: Interest Business news Telugu Post Office Savings Account Savings Scheme Small savings scheme

ఇవి కూడా చూడండి

Government Scheme: 'నమో డ్రోన్ దీదీ యోజన వల్ల' ఏంటి ప్రయోజనం, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?

Government Scheme: 'నమో డ్రోన్ దీదీ యోజన వల్ల' ఏంటి ప్రయోజనం, ఎవరు దరఖాస్తు చేసుకోవాలి?

Govt Pension Scheme: రోజుకూలీలకు కూడా పెన్షన్‌ - ముదిమి వయస్సులో ఉండదు టెన్షన్‌

Govt Pension Scheme: రోజుకూలీలకు కూడా పెన్షన్‌ - ముదిమి వయస్సులో ఉండదు టెన్షన్‌

Passport Application: పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇస్తే ఆ తర్వాత జరిగేది ఇదే

Passport Application: పాస్‌పోర్ట్‌ అప్లికేషన్‌లో తప్పుడు సమాచారం ఇస్తే ఆ తర్వాత జరిగేది ఇదే

Gold-Silver Prices Today 16 Mar: రూ.90,000కు తగ్గని గోల్డ్‌, రూ.లక్ష పైన సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Gold-Silver Prices Today 16 Mar: రూ.90,000కు తగ్గని గోల్డ్‌, రూ.లక్ష పైన సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ

Investment Scheme For Girls: ఈ స్కీమ్‌లో చేరండి, మీ కుమార్తెకు రూ.70 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వండి!

Investment Scheme For Girls: ఈ స్కీమ్‌లో చేరండి, మీ కుమార్తెకు రూ.70 లక్షలు గిఫ్ట్‌గా ఇవ్వండి!

టాప్ స్టోరీస్

Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ

Andhra Pradesh News: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం బిగ్ షాక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌కు అనుమతుల నిరాకరణ

Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి

Secunderabad Kavach Center: సికింద్రాబాద్‌లో కవచ్ రీసెర్చ్ సెంటర్ - శంషాబాద్ ఎయిర్ పోర్టులాగ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్: కిషన్ రెడ్డి

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు

AR Rahman: ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత - ఆస్పత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు

Dhoni Viral Video: సిక్స‌ర్లు ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ధోనీ బ్యాటింగ్ వీడియో.. ఈనెల 23న చెన్నై తొలి మ్యాచ్

Dhoni Viral Video: సిక్స‌ర్లు ప్రాక్టీస్ చేస్తున్న ధోనీ.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ధోనీ బ్యాటింగ్ వీడియో.. ఈనెల 23న చెన్నై తొలి మ్యాచ్

This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy