By: ABP Desam | Updated at : 23 Aug 2023 11:56 AM (IST)
సీనియర్ సిటిజన్ల కోసం ప్రభుత్వ పెన్షన్ స్కీమ్స్
Pension Schemes For Senior Citizen: సీనియర్ సిటిజన్లు, తమ పదవీ విరమణ తర్వాత లేదా వృద్ధాప్యంలో డబ్బులకు ఇబ్బందులు పడకుండా ఆర్థికంగా రక్షణ కల్పించే చాలా పథకాలను భారత ప్రభుత్వం అమలు చేస్తోంది. నెలనెలా పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను ఆ గవర్నమెంట్ స్కీమ్స్ అందిస్తాయి. పని/ఉద్యోగం చేస్తున్నప్పుడు డబ్బుకు ఢోకా లేకుండా బతికిన వ్యక్తి, ఆ పని నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా అంతే దర్జాగా జీవించే ఫెసిలిటీస్‌ను ఆ స్కీమ్స్ సీనియర్ సిటిజన్లకు కల్పిస్తాయి. వీటిలో, పెన్షన్ పథకాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ పథకాల కింద ప్రతి నెలా లేదా నిర్ధిష్ట టైమ్ పిరియడ్‌లో చేతికి అందే ఆదాయం, వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పిస్తుంది.
సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పెన్షన్ పథకాలు ఇవి:
నేషనల్ పెన్షన్ సిస్టమ్
ఇది ఎక్కువగా పాపులర్ అయిన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. పదవీ విరమణను దృష్టిలో పెట్టుకుని, కొంత మొత్తాన్ని సేవింగ్స్ & ఇన్వెస్ట్‌మెంట్ చేసే ప్లాన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS). ఇది దీర్ఘకాలిక పొదుపు పథకం. మార్కెట్ ఆధారంగా రాబడిని ఇస్తుంది. ఈ పెన్షన్ ప్లాన్‌ను PFRDA (Pension Fund Regulatory and Development Authority) నిర్వహిస్తోంది. వృద్ధాప్యంలోనూ జీతం తరహాలో క్రమం తప్పని ఆదాయం & పదవీ విరమణ తర్వాత ఒకేసారి ఎక్కువ మొత్తం డబ్బు, ఈ రెండు ప్రయోజనాలను NPS అందిస్తుంది. ఈ పథకం కింద, 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయస్సు వరకు మెంబర్‌గా కొనసాగవచ్చు.
ఇందిరా గాంధీ జాతీయ పాత పెన్షన్ పథకం (వయోవందన స్కీమ్)
ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు నెలవారీ పెన్షన్ ఇస్తారు. సీనియర్ సిటిజన్లు, BPL కేటగిరీ పౌరులు నెలవారీ పెన్షన్ పొందవచ్చు. 60 నుంచి 79 సంవత్సరాల మధ్య ఉన్న వారికి నెలకు 350 రూపాయలు; 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారికి నెలకు 650 రూపాయలు అందిస్తారు. మున్సిపాలిటీలు, పంచాయితీల ద్వారా దీని కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
అటల్ పెన్షన్ యోజన (APY)
అటల్ పెన్షన్ యోజన కింద నిరుపేద కుటుంబాలకు పింఛను అందజేస్తారు. దీని కింద నెలవారీ పింఛను రూపంలో ఒక వెయ్యి రూపాయల నుంచి 5 వేల రూపాయల వరకు ఇస్తారు. చందాదారు భారతదేశ పౌరుడై ఉండాలి, వయస్సు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. 2022 అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆదాయ పన్ను చెల్లించేవాళ్లు ఈ పథకంలో చేరడానికి అర్హులు కాదు. బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ద్వారా అటల్ పెన్షన్ యోజన కింద అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.
సీనియర్ పెన్షన్ బీమా యోజన
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్స్ సర్వీసెస్ వెబ్‌సైట్ ప్రకారం, సీనియర్ పెన్షన్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ద్వారా నిర్వహిస్తున్నారు. దీని కింద, నెలవారీ పెన్షన్ ప్రయోజనం మీరు కట్టిన మొత్తం నుంచి చెల్లిస్తారు.
మరో ఆసక్తికర కథనం: పట్టు బిగిస్తున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Happy Womens Day: మహిళల పేరిట హోమ్ లోన్ తీసుకుంటే బోలెడు లాభాలు, ఒక్కటి కూడా మిస్ చేసుకోవద్దు
High Income: ఎక్కువ వడ్డీ ఇచ్చే స్పెషల్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు - ఈ నెలాఖరు వరకే గోల్డెన్ ఛాన్స్!
Gold-Silver Prices Today 07 Mar: గోల్డెన్ న్యూస్, రూ.3300 పతనమైన పసిడి - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Women Financial Independence : ఉద్యోగం చేసే మహిళలు ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి
Income Tax: ఐటీ అధికారుల చేతికి బ్రహ్మాస్త్రం - మీ అకౌంట్స్ అన్నీ చెక్ చేసే 'సూపర్ పవర్', బెండ్ తీస్తారిక!
Telangana Latest News: మహిళా సంఘాలకు హ్యాపీ న్యూస్- ఆసక్తికరమైన ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి
Ashika Ranganath: చిరంజీవి 'విశ్వంభర' హీరోయిన్ ఆషికా రంగనాథ్ లేటెస్ట్ శారీ ఫోటోలు
BRS MLC Kavitha : ఓటీటీ కంటెంట్, టీవీ సీరియల్స్‌పై కవిత ఆగ్రహం- కించపరిచే వాటిపై మహిళలు మాట్లాడాలని పిలుపు
Borugadda Anil: నాకేం జరిగినా చంద్రబాబు,లోకేష్‌దే బాధ్యత - జగనే నా తండ్రి - ఆజ్ఞాతం నుంచి బోరుగడ్డ అనిల్ వీడియో