By: Arun Kumar Veera | Updated at : 08 Mar 2024 10:33 AM (IST)
మహిళలకు మాత్రమే ధన లాభం తెచ్చే 2 బెస్ట్ స్కీమ్స్
International Womens Day 2024 Special: మహిళల స్వయంసమృద్ధి, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పథకాలు, కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిలో.. మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన (Mahila Samman Bachat Patra Yojana), సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana)కు మంచి ఆదరణ లభిస్తోంది. మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజనను 'ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్' (Women Savings Certificate Scheme) అని కూడా పిలుస్తారు.
పైన చెప్పిన రెండు స్కీమ్స్ మహిళల కోసం మాత్రమే ఉద్దేశించినవి, చిన్న మొత్తాల పొదుపు/పెట్టుబడి పథకాలు. మీ దగ్గరలోని పోస్టాఫీసు/ బ్యాంక్ బ్రాంచిలో ఈ పథకాల కింద ఖాతాలు ప్రారంభించొచ్చు.
2023 ఏప్రిల్ 01 నుంచి మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన ప్రారంభమైంది. సుకన్య సమృద్ధి యోజనను 2014 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.
మహిళ సమ్మాన్ బచత్ పత్ర యోజన - సుకన్య సమృద్ధి యోజన మధ్య తేడా ఏంటి? (Differences between MSSC - SSY)
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన
మహిళా సమ్మాన్ బచత్ పత్ర యోజన అనేది ఒక స్వల్పకాలిక పథకం, దీనిలో రెండేళ్ల పాటు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంలో పెట్టుబడులకు ఏడాదికి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ పథకం ఒక స్వల్పకాలిక ఫిక్స్‌డ్ డిపాజిట్ లాంటిది. దీనిలో, తక్కువ కాల వ్యవధిలో మంచి వడ్డీ ఆదాయం పొందొచ్చు. ఈ స్కీమ్‌లో చేరడానికి వయోపరిమితి లేదు. ఏ వయస్సులో ఉన్న బాలికలు లేదా మహిళలైనా ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు. మీకు డబ్బు అవసరమైనతే, కొంత మొత్తం విత్‌డ్రా చేసుకోవడానికి కూడా అనుమతి ఉంటుంది.
సుకన్య సమృద్ధి యోజన
సుకన్య సమృద్ధి యోజన ఒక దీర్ఘకాలిక పెట్టుబడి పథకం. దీనిలో ఆడపిల్లల కోసం మాత్రమే పెట్టుబడి పెట్టాలి. సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో జమ చేసిన మొత్తంపై 8.20 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇందులో, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ఈ డబ్బును ఒకేసారి డిపాజిట్ చేయవచ్చు లేదా దఫదఫాలుగానూ జమ చేయవచ్చు. ఆడపిల్లకు 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆ ఖాతా నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఉంటుంది. ఆమెకు 21 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత మొత్తం డబ్బును వెనక్కు తీసుకోవచ్చు.
మహిళా సమ్మాన్ బచత్ పత్ర & సుకన్య సమృద్ధి యోజన - ఈ రెండు పథకాలు మహిళల కోసమే ప్రత్యేకంగా రూపొందించినా, ఈ రెండింటి మధ్య కొంత వ్యత్యాసం ఉంది. మహిళా సమ్మాన్ బచత్ పత్రలో ఏ మహిళ అయినా పెట్టుబడి పెట్టవచ్చు, అయితే, SSYలో బాలికల పేరిట మాత్రమే డబ్బు జమ చేయాలి. మహిళా సమ్మాన్ బచత్ పత్ర అనేది స్వల్పకాలిక పథకం, దీనిలో మీరు ఏకమొత్తంలో మాత్రమే డిపాజిట్ చేయాలి. SSY అనేది దీర్ఘకాలిక పథకం, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాల వరకు దఫదఫాలుగా పెట్టుబడి పెడుతూ వెళ్లవచ్చు. మహిళా సమ్మాన్ బచత్ పత్రలో రూ.2 లక్షల వరకు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. SSYలో, ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలకు మించకుండా కొన్నేళ్ల వరకు పెట్టుబడి పెడుతూనే ఉండవచ్చు.
మీ పాప లేదా మీ ఇంట్లో మహిళల కోసం కోసం స్వల్పకాలానికి ఒకేసారి పెట్టుబడి పెట్టాలి అనుకుంటే ఉమెన్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీమ్ ఒక మంచి పథకం. మీ కుమార్తె లేదా చిన్న పాప కోసం దీర్ఘకాలం పాటు చిన్న/పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే సుకన్య సమృద్ధి యోజన ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Car Roof Rack Rules In India In Telugu : కారుపైన లగేజ్ ర్యాక్ ఏర్పాటుకూ కొన్ని రూల్స్ - కారు వయస్సును బట్టి పర్మిషన్!
Bank Holidays: కస్టమర్లకు అలెర్ట్ - డిసెంబర్‌లో బ్యాంక్‌లు 17 రోజులు పని చేయవు
Gold-Silver Prices Today 02 Dec: భారీగా తగ్గిన నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Income Tax Deadline: ITR ఫైల్ చేయడానికి లాస్ట్ డేట్ మారింది - కొత్త తేదీ ఇదే
Gold-Silver Prices Today 30 Nov: ప్యూర్ గోల్డ్, ఆర్నమెంట్ గోల్డ్ రేట్లు తగ్గాయ్ - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Amaravati: రూ.11,467 కోట్లతో అమరావతి అభివృద్ధి పనులు - సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు
PV Sindhu Wedding: పెళ్లి పీటలెక్కనున్న పీవీ సింధు.. వరుడు ఎవరంటే..?
Pushpa 2 Ticket Rates: ఏపీలో పుష్ప 2 బెనిఫిట్ షోలు, టికెట్ ధర పెంపునకు అనుమతి - తెలంగాణ కంటే ఎక్కువే
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం