By: ABP Desam | Updated at : 04 Jun 2023 10:34 AM (IST)
ఏటీఎం కార్డ్‌తో ₹5 లక్షల 'ఫ్రీ' ఇన్సూరెన్స్
ATM Card Insurance: ఇప్పుడు, దేశంలో మెజారిటీ జనాభాకు బ్యాంక్ అకౌంట్లు, ATM కార్డులు (డెబిట్ కార్డ్) ఉన్నాయి. దేశంలోని ప్రతి వ్యక్తిని ఆర్థిక వ్యవస్థలో భాగం చేయడానికి, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, రూపే కార్డ్ వంటి పథకాలను భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకాల కింద కోట్ల సంఖ్యలో బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయ్యాయి. దీంతో, ATM కార్డులు ప్రతి ఒక్కరి జీవితంలో భాగంగా మారాయి. డెబిట్ కార్డ్‌తో ATMల నుంచి డబ్బులు తీసుకోవడం, ఆన్‌లైన్ ట్రాన్జాక్షన్లు, స్వైపింగ్‌కు ఉపయోగించడం మాత్రమే కాదు, చాలామందికి తెలీని ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి ప్రతి ఒక్కరు కచ్చితంగా తెలుసుకోవాలి.
'ఫ్రీ' ఇన్సూరెన్స్
ATM కార్డ్ విషయంలో ఎక్కువ మందికి తెలీని, అతి ముఖ్యమైన ఉపయోగాల్లో "ఉచిత బీమా కవరేజ్" ఒకటి. ఒక బ్యాంకు తన కస్టమర్‌కి ఏటీఎం కార్డు జారీ చేసిన క్షణం నుంచి, ఆ ఖాతాదారు ప్రమాద బీమా, జీవిత బీమా పరిధిలోకి వస్తాడు. దీని కోసం కస్టమర్ ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదు, ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. బ్యాంకులే ఆ పని చూసుకుంటాయి. ఏటా, ATM కార్డ్‌హోల్డర్‌తో సంబంధం లేకుండా బ్యాంకులే దానిని కొనసాగిస్తుంటాయి. ఒకవేళ, ATM కార్డ్‌హోల్డర్‌కు ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే, బ్యాంక్‌కు వెళ్లి డబ్బులు తీసుకోవడమే గానీ, అదనంగా చేయాల్సిన పనేమీ ఉండదు.
అయితే... ATM కార్డ్‌తో ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుందన్న విషయం మన దేశంలో ఎక్కువ మందికి తెలియదు. తెలిసిన కొద్దిమంది మాత్రమే ఈ ప్రయోజనాన్ని ఉపయోగించుకోగలుగుతున్నారు. ఈ విషయంపై విస్తృతంగా అవగాహన కల్పించకపోవడం బ్యాంకుల తప్పయితే, ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం ప్రజల తప్పు.
ATM కార్డ్ హోల్డర్ దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైతే, ఆ కార్డ్ అతని కుటుంబానికి/ వైద్య ఖర్చులకు అక్కరకొస్తుంది. ప్రమాదంలో ఒక చేయి లేదా ఒక కాలు కోల్పోతే... బాధితుడికి రూ. 50,000 ప్రమాద బీమా కవరేజీ లభిస్తుంది. రెండు చేతులు లేదా రెండు కాళ్లు కోల్పోయినట్లయితే, ఒక లక్ష రూపాయల బీమా మొత్తం లభిస్తుంది. కార్డ్‌దారు మరణిస్తే, ఒక లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు బీమా మొత్తం అతని కుటుంబానికి అందుతుంది.
కార్డ్ రకాన్ని బట్టి రూ.5 లక్షల వరకు కవరేజీ
ATM కార్డ్ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే చిన్న నిబంధన ఉంది. ప్రమాదానికి గురైన కార్డుదారు, ఆ ప్రమాదానికి కనీసం 45 రోజుల ముందు ఆ ATM కార్డ్‌ను ఒక్కసారైనా ఉపయోగించి ఉండాలి. అప్పుడే క్లెయిమ్ చేసుకోవడానికి వీలవుతుంది.
బ్యాంకులు తమ కస్టమర్లకు చాలా రకాల ATM కార్డులు జారీ చేస్తాయి. ATM కార్డ్ కేటగిరీని బట్టి దాని వల్ల లభించే ఇన్సూరెన్స్ కవరేజ్ మారుతుంది. కస్టమర్లకు, ATM క్లాసిక్ కార్డ్ మీద రూ. 1 లక్ష, ప్లాటినం కార్డ్ మీద రూ. 2 లక్షలు, సాధారణ మాస్టర్ కార్డ్ మీద రూ. 50 వేలు, ప్లాటినమ్ మాస్టర్ కార్డ్ మీద రూ. 5 లక్షలు, వీసా కార్డ్ మీద రూ. 1.5-2 లక్షల వరకు బీమా కవరేజీ లభిస్తుంది. ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన కింద ఖాతాదార్లకు అందిన రూపే కార్డు మీద రూ. 1 నుంచి 2 లక్షల వరకు బీమా ఉంటుంది.
ఇన్సూరెన్స్ ఎలా క్లెయిమ్ చేయాలి?
ATM కార్డ్ మీద ప్రమాద బీమాను క్లెయిమ్ చేసుకోవడానికి, సంబంధిత బ్యాంకుకు కార్డుదారు దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్‌లో FIR కాపీ, హాస్పిటల్ ట్రీట్‌మెంట్ సర్టిఫికేట్ వంటి పత్రాలు సమర్పించాలి. ఒకవేళ కార్డుదారు మరణిస్తే, అతని నామినీ సంబంధిత బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. కార్డుదారు మరణ ధృవీకరణ పత్రం, FIR కాపీ, డిపెండెంట్ సర్టిఫికేట్ వంటి పత్రాలు ఇందుకు అవసరం అవుతాయి. సంబంధిత బ్యాంకు శాఖను సంప్రదిస్తే, దీని గురించిన మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఇప్పుడు మీకు తెలిసిన ఈ బెనిఫిట్ గురించి మీ పరిధిలో ఉన్న బంధుమిత్రులందరికీ చెప్పండి. ఆపద సమయంలో వాళ్లకూ ఇది ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: మీ కుటుంబాన్ని రోడ్డుపాలు చేయకండి, 45 పైసలకే ₹10 లక్షల ప్రయాణ బీమా
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Best Investment Options: తల్లి పేరు మీద ఇన్వెస్ట్ చేస్తే అధిక వడ్డీ ప్రయోజనాలు.. ఆ స్కీమ్స్ చూశారా
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం