By: ABP Desam | Updated at : 25 May 2022 06:41 PM (IST)
Edited By: Ramakrishna Paladi
నగదు
Income Tax Rule PAN, Aadhaar Must for Cash Withdrawals, Deposits in These Cases from Tomorrow : ప్రజలకు అలర్ట్! మే 26 నుంచి దేశంలో నగదు డిపాజిట్ వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి. ఇకపై బ్యాంకుల నుంచి ఒక ఏడాదిలో రూ.20 లక్షలకు మించి విత్‌డ్రా లేదా డిపాజిట్ చేస్తే ప్రజలు కచ్చితంగా పాన్ లేదా ఆధార్ నంబర్ ఇవ్వాలి. కో ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లోనూ ఈ నిబంధనల అమల్లోకి వస్తుంది. కరెంట్ ఖాతా ఓపెన్ చేస్తున్నప్పుడూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రత్యక్ష్య పన్నుల శాఖ (CBDT) కొన్ని రోజుల ముందు నోటిఫికేషన్ జారీ చేసింది.
'ఒక లావాదేవీ ఒప్పందంలోకి ప్రవేశిస్తున్నప్పుడు టేబుల్‌లోని రెండో కాలమ్‌లో తమ ఆధార్ లేదా పాన్ నంబర్‌ను నమోదు చేయాలి. అవతలి వ్యక్తి ఇచ్చిన ఆధార్ లేదా పాన్ సరైందేనని టేబుల్‌లోని మూడో కాలమ్‌లో స్వీకర్త ధ్రువీకరించాలి' అని సీబీడీటీ తెలిపింది.
Also Read: సూచీల నేల చూపులు! సెన్సెక్స్ 303, నిఫ్టీ 99 డౌన్ - ఫెడ్ మినిట్స్ కోసం వెయిటింగ్!
Also Read: ధర తగ్గిందని బంగారం కొంటున్నారా? మొదట ఇన్‌కం టాక్స్ రూల్స్ తెలుసుకోండి
గతంలో ఒక రోజులో రూ.50వేలకు మించి డిపాజిట్ చేస్తే పాన్ కార్డు అవసరం అయ్యేది. 114బి నిబంధన పరిధిలో ఉంటారు కాబట్టి ఏడాది కాలంలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రావల్స్‌పై పరిమితి ఉండేది కాదు. అంతేకాకుండా బ్యాంకులో డిపాజిట్ చేసినప్పుడు మాత్రమే ఈ నిబంధన వర్తించేది.
ఒకవేళ బ్యాంకులో ఏడాదిలో రూ.20 లక్షలకు మించి డిపాజిట్ లేదా విత్‌డ్రావల్ చేసినప్పుడు పాన్ లేకుంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. వారం రోజుల్లోగా దరఖాస్తు చేస్తామని ధ్రువీకరించాలి. ఒకవేళ అప్పటికే పాన్ నంబర్ ఉంటే నిర్దేశించిన కాలమ్‌లో ఆ సంఖ్య వేస్తే సరిపోతుంది. ఆర్థిక నేరాలు, మోసాలు అరికట్టేందుకు, అత్యధిక విలువగల లావాదేవీలను పన్నుల శాఖ పర్యవేక్షించేందుకు ఈ నిబంధనలు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా నగదు మూమెంట్‌ను గమనించేందుకూ ఇది ఉపయోగపడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Also Read: ఈ పూలు పూయించండి! లక్షల్లో ఆదాయం పొందండి!
Gold-Silver Prices Today 05 Nov: నగలు కొనేవాళ్లకు కలిసొస్తున్న కాలం, తగ్గిన పసిడి రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Gold-Silver Prices Today 04 Nov: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల ధరలు - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి రేట్లు ఇవీ
Jeevan Pramaan Patra: లైఫ్ సర్టిఫికెట్ల ప్రాసెస్ ప్రారంభం - ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఎలా సబ్మిట్ చేయాలి?
Bank Loan: ఫ్లెక్సీ లోన్ Vs ఓవర్‌డ్రాఫ్ట్ Vs పర్సనల్ లోన్ - ఏ అవసరానికి ఏది ఉత్తమం?
Investment Idea: తక్కువ పెట్టుబడితో అద్దె ఆదాయం పొందే కొత్త పద్ధతి - మూలధనం లాభాలూ వస్తాయి!
Telangana Politics: కులగణనతో బీసీల్లో చాంపియన్ అయ్యే వ్యూహం - రేవంత్ రెడ్డి ప్లాన్ అదేనా ?
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
Devara OTT Release Date: అఫీషియల్: ఓటీటీలోకి ఈ వారమే దేవర - ఎన్టీఆర్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
Game Changer Teaser Release: హైదరాబాద్, చెన్నై, ముంబైలో కాదు... 'గేమ్ చేంజర్' టీజర్ రిలీజ్‌కు రామ్ చరణ్ నయా ప్లాన్!