search
×

Stock Market News: సూచీల నేల చూపులు! సెన్సెక్స్‌ 303, నిఫ్టీ 99 డౌన్‌ - ఫెడ్‌ మినిట్స్‌ కోసం వెయిటింగ్‌!

Stock Market Closing Bell: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,025 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 303 పాయింట్లు నష్టపోయింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell on 25 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీగా నష్టపోయాయి. ఆరంభంలో లాభాల్లోనే కదలాడిన సూచీలు 11 గంటల నుంచి నేల చూపులు చూశాయి. యూఎస్‌ ఫెడ్‌ మినట్స్‌ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ద్రవ్యోల్బణం భయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఐటీ స్టాక్స్‌ నుంచి ఎఫ్‌ఐఐలు నిధులు వెనక్కి తీసుకుంటూనే ఉన్నారు. మొత్తంగా మదుపర్లలో మిశ్రమ సెంటిమెంట్‌ కనిపించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,025 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 303 పాయింట్లు నష్టపోయింది.

BSE Sensex

క్రితం సెషన్లో 54,052 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 54,254 వద్ద లాభాల్లో మొదలైంది. 53,683 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. ఆరంభంలో కొనుగోళ్ల మద్దతు వల్ల 54,379 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 303 పాయింట్ల నష్టంతో 53,749 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 16,125 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 16196 వద్ద ఓపెనైంది. ఆరంభంలో లాభపడ్డా ఆ తర్వాత ఒడుదొడుకులకు లోనైంది. 16,006 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,223 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 99 పాయింట్లు నష్టపోయి 16,025 వద్ద ముగిసింది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ముగిసింది. ఉదయం 34,491 వద్ద మొదలైంది. 34,285 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,722 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 49 పాయింట్ల లాభంతో 34,339 వద్ద స్థిరపడింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ముగిశాయి. ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఎస్‌బీఐ లైఫ్‌, భారతీయ ఎయిర్‌టెల్‌, ఓఎన్‌జీసీ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, దివిస్‌ ల్యాబ్‌, యూపీఎల్‌, టెక్‌ మహీంద్రా నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ బ్యాంక్‌ మినహా మిగతా రంగాల సూచీలన్నీ పతనం అయ్యాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, ఫార్మా, రియాల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఐటీ సూచీలు 1-3 శాతం నష్టపోయాయి.

Published at : 25 May 2022 04:03 PM (IST) Tags: sensex today bse sensex Stock Market Update share market Nse Nifty stock market today Stock Market Telugu Nifty Bank Stock Market news sensex updates sensex today live nifty 50 nifty fifty

ఇవి కూడా చూడండి

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

Year Ender 2024: 2024లో పెట్టుబడిదార్లను ధనవంతులుగా మార్చిన టాప్‌-10 మ్యూచువల్ ఫండ్స్‌

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

New Mutual Fund: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్‌ ఇన్వెస్టర్లకు బెస్ట్‌ ఆప్షన్‌!

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే"కింగ్‌" ఎంట్రీ - జియోకి గ్రీన్‌ సిగ్నల్‌

Reliance: మ్యూచువల్ ఫండ్స్‌లోకి షే

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

Mutual Funds: మీ డబ్బును వేగంగా రెట్టింపు చేసే 5 ఫండ్స్, 15-20 ఏళ్లు ఎదురు చూడాల్సిన అవసరం లేదు

టాప్ స్టోరీస్

Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత

Paravada Gas Leak: పరవాడ ఫార్మాసిటీలో విషవాయువులు లీక్, నలుగురు సిబ్బందికి తీవ్ర అస్వస్థత

Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?

Congress vs Tollywood: సినీ ఇండస్టీని కాంగ్రెస్  ప్రభుత్వం టార్గెట్ చేసిందా ? సినీ పెద్దలపై ఎందుకంత పగ?

AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

AP Belt Shops: గ్రామాల్లో బెల్ట్‌ బాజా, గోదావరి జిల్లాల్లో ఎటు చూసినా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

Hyderabad CP CV Anand: సంచలన ఆరోపణలు చేసి క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్