search
×

Income Tax: TDS గురించి కొత్త కబురు, ఉద్యోగస్తులు కంపెనీకి ముందుగానే చెప్పాలట

దీని ఆధారంగా యజమాని తన ఉద్యోగి ఆదాయంపై TDS తీసివేయడం జరుగుతుంది.

FOLLOW US: 
Share:

Income Tax Regime: 2023-24 ఆర్థిక సంవత్సరం (FY24) ప్రారంభమైంది. ఉద్యోగులు కొత్త ఆదాయపు పన్ను విధానంలోకి మారతారా లేదా పాత పన్ను విధానంలోనే కొనసాగుతారా అన్న సమాచారాన్ని ఆయా కంపెనీల యాజమాన్యాలు సేకరిస్తున్నాయి. 2023-24లో TDS తగ్గింపు విధానాలకు సంబంధించి 'కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు' (CBDT) ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త ఆదాయపు పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా ఉంటుందని ఆ ప్రకటనలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకుంటారా లేదా పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటారా అని తమ ఉద్యోగులను తప్పనిసరిగా అడగాలని అన్ని కంపెనీల యాజమాన్యాలకు CBDT స్పష్టం చేసింది.

కంపెనీకి ముందుగానే సమాచారం ఇవ్వాలి
ఉద్యోగులు, తాము ఏ పన్ను విధానాన్ని అవలంబిస్తారన్న విషయాన్ని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో తమ యజమానికి తప్పనిసరిగా తెలియజేయాలని కూడా ప్రత్యక్ష పన్నుల బోర్డు సూచించింది. ఎందుకంటే, దీని ఆధారంగా యజమాని తన ఉద్యోగి ఆదాయంపై TDS  తీసివేయడం జరుగుతుంది. తాను ఏ పన్ను విధానాన్ని ఫాలో అవుతాడు అన్న విషయాన్ని ఒక ఉద్యోగి తన యజమానికి తెలియజేయకపోతే, ఆ ఉద్యోగిపై డిఫాల్ట్ పన్ను విధానం అమలవుతుందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ స్పష్టం చేసింది. అంటే, ఏ విషయం చెప్పని ఉద్యోగి ఆటోమేటిక్‌గా కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్నట్లు భావిస్తారు. దాని ఆధారంగా అతని ఆదాయం నుంచి TDS తీసివేస్తారు. ఇలాంటి సందర్భంలో, కొత్త ఆదాయ విధానంలోని పన్ను రేటు ప్రకారం, ఉద్యోగి ఆదాయం నుంచి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 192 కింద TDSని తీసివేయవలసి ఉంటుంది.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న 2023-24 ఆర్థిక సంవత్సరం సాధారణ బడ్జెట్‌ను సమర్పిస్తూ, కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి కొత్త పన్ను విధానాన్ని డిఫాల్ట్ పన్ను విధానంగా పరిగణిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను రేటు పాత పన్ను విధానం కంటే తక్కువగా ఉంటుంది. కానీ, గృహ రుణ వడ్డీ, పెట్టుబడులపై మినహాయింపులు వంటివి కొత్త పన్ను విధానంలో అందుబాటులో ఉండవు. పన్ను ఆదా పెట్టుబడులు, గృహ రుణం, గృహ రుణం వడ్డీపై మినహాయింపు, మెడిక్లెయిమ్‌ వంటి ఖర్చులకు పాత ఆదాయపు పన్ను విధానంలో మినహాయింపులు పొందవచ్చు.

వేతన జీవులకు వెసులుబాటు
జీతం/వేతన పన్ను చెల్లింపుదార్లు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేసేటప్పుడు కొత్త లేదా పాత పన్ను విధానంలో ఒకదానిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఒక సంవత్సరం ఒక పన్ను విధానం గురించి కంపెనీ యజమాన్యానికి తెలియజేసినప్పటికీ, ఆ తర్వాతి సంవత్సరం మరొక పన్ను విధానాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉంది. అంటే, జీతం పొందే పన్ను చెల్లింపుదార్లు ప్రతి సంవత్సరం కొత్త లేదా పాత ఆదాయపు పన్ను విధానంలో ఏదైనా ఎంచుకోవచ్చు. అయితే వ్యాపారం లేదా వృత్తి నుంచి ఆదాయాన్ని పొందేవారు ఒకసారి మాత్రమే పన్ను విధానం ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది, దాని నుంచి మారడం కుదరదు.

Published at : 08 Apr 2023 09:39 AM (IST) Tags: CBDT ITR Tds Old Tax Regime New Income Tax Regime

ఇవి కూడా చూడండి

Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్‌ లేని స్కీమ్స్‌ ఇవి

Investment Idea: తక్కువ పెట్టుబడి, ఎక్కువ రాబడి - రిస్క్‌ లేని స్కీమ్స్‌ ఇవి

Best Picnic Insurance Policy: పిక్నిక్‌ ప్లాన్‌ చేసే ముందు ఇన్సూరెన్స్‌ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

Best Picnic Insurance Policy: పిక్నిక్‌ ప్లాన్‌ చేసే ముందు ఇన్సూరెన్స్‌ చేయించుకోండి- లేకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

SIP Strategies: మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఎక్కువ డబ్బు సంపాదించేందుకు ఆరు సూత్రాలు

Gold-Silver Prices Today 05 Nov: నగలు కొనేవాళ్లకు కలిసొస్తున్న కాలం, తగ్గిన పసిడి రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 05 Nov: నగలు కొనేవాళ్లకు కలిసొస్తున్న కాలం, తగ్గిన పసిడి రేట్లు - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 04 Nov: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల ధరలు - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి రేట్లు ఇవీ

Gold-Silver Prices Today 04 Nov: తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా నగల ధరలు - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి రేట్లు ఇవీ

టాప్ స్టోరీస్

Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Indiramma Houses Scheme In Telangana: ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్

Kuppam TDP: కుప్పంలో వైసీపీకి భారీ షాక్ - టీడీపీలో చేరిపోయిన మున్సిపల్ చైర్మన్

Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే

Samantha Ruth Prabhu : సమంత స్టైలిష్ లుక్ చూశారా? ఆమె పెట్టుకున్న వాచ్ 19 లక్షల పైమాటే

Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ 

Pawan Kalyan Comments Row: పవన్ వ్యాఖ్యలపై స్పందించిన హోంమంత్రి, డీజీపీ - విమర్శల వాడి పెంచిన వైసీపీ