By: ABP Desam | Updated at : 06 May 2023 12:39 PM (IST)
మీ ఫోన్‌లో వాట్సాప్ ఉంటే ₹10 లక్షల లోన్ మీ చేతిలో ఉన్నట్లే!
IIFL Finance Loan through Whatsapp: అప్పు కావాలా?, నానా రకాల పేపర్లు పట్టుకుని బ్యాంక్‌లు, ఆర్థిక సేవల సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇకపై ఉండదు. మీ దగ్గర ఒక స్మార్ట్‌ఫోన్, దాన్లో వాట్సాప్ ఉంటే చాలు.. ఇంట్లో కూర్చునే మీరు రుణం పొందవచ్చు. కస్టమర్లకు వాట్సాప్ ద్వారా రూ. 10 లక్షల వరకు రుణం ఇస్తామని ఓ ఆర్థిక సేవల సంస్థ ప్రకటించింది. అయితే, అది పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ కాదు, బిజినెస్ లోన్. అంటే, మీరు వ్యాపారం చేస్తుంటే, దానికి ఆర్థిక సాయం కావాలంటే ఈ కంపెనీ రుణం మంజూరు చేస్తుంది. మీరు అన్ని షరతులు సంతృప్తి పరచగలిగితే వెంటనే లోన్ ఆమోదం లభిస్తుంది, మీకు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.
ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ (IIFL Finance), వాట్సాప్ ద్వారా తన కస్టమర్‌లకు రూ. 10 లక్షల వరకు వ్యాపార రుణాలకు తక్షణ ఆమోదం అందించాలని నిర్ణయించింది. MSME (Micro, Small & Medium Enterprises) లోన్ల విభాగంలో, వాట్సాప్ ద్వారా రుణం ఇవ్వడాన్ని మొట్టమొదటిసారిగా IIFL ఫైనాన్స్ ప్రారంభించింది. ఇక్కడ, రుణం కోసం దరఖాస్తు చేయడం దగ్గర నుంచి డబ్బు బదిలీ వరకు 100% ప్రక్రియ డిజిటల్‌గానే ఉంటుంది. భారతదేశంలోని 450 మిలియన్లకు పైగా WhatsApp వినియోగదార్లు ఉన్నారు. వాళ్లలో అర్హత ఉన్నవాళ్లు IIFL ఫైనాన్స్ నుంచి 24x7 ఎండ్-టు-ఎండ్ డిజిటల్ లోన్ సౌకర్యాన్ని పొందవచ్చు.
AI-bot మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతుంది
వాట్సాప్ ద్వారా లోన్ పొందడానికి మీరు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. బ్యాంక్ అడిగిన అన్ని వివరాలతో మీ దరఖాస్తు సరిపోలితే, మీ లోన్‌కు ఆమోదం లభిస్తుంది. మీరు లోన్ పొందడానికి 9019702184 నంబర్‌కు వాట్సాప్‌లో “Hi” అని సందేశం పంపాలి. దీంతో లోన్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇది పూర్తిగా కాగిత రహిత ప్రక్రియ. IIFL ఫైనాన్స్, ప్రస్తుతం దాని WhatsApp లోన్ ఛానెల్ ద్వారా 1 లక్ష MSME రుణ విచారణలు నిర్వహించగలదు.
IIFL ఫైనాన్స్ బిజినెస్ హెడ్ భరత్ అగర్వాల్ చెప్పిన ప్రకారం... IIFL ఫైనాన్స్ వాట్సాప్‌లో సులభమైన పేపర్‌లెస్ రుణ ఆఫర్ అందిస్తోంది. రుణ దరఖాస్తు నుంచి రుణం పంపిణీ వరకు ఉన్న సంక్లిష్ట ప్రయాణాన్ని ఇది సులభతరం చేసింది. చిన్న వ్యాపారులపై ఎక్కువ దృష్టి పెడుతుంది.
IIFL ఫైనాన్స్ గురించి..
IIFL ఫైనాన్స్, భారతదేశంలో 10 మిలియన్లకు పైగా కస్టమర్లు ఉన్న అతి పెద్ద రిటైల్ NBFCల్లో (Non-Banking Financial Companies) ఒకటి. ఇవన్నీ పూర్తి స్థాయి బ్యాంకులు కావు. డిపాజిట్లు స్వీకరించకూడదు, ఒక పరిమితికి లోబడి మాత్రమే రుణాలు ఇవ్వాలి. NBFC నిబంధనల ప్రకారం... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా తరహా పరిశ్రమలకు మాత్రమే IIFL ఫైనాన్స్ రుణాలు ఇస్తుంది. దీనికి దేశవ్యాప్తంగా చాలా శాఖలు ఉన్నాయి, డిజిటల్ మార్గంలోనూ అందుబాటులో ఉంది.
Gold-Silver Prices Today 20 Dec: మీ నగరంలో చవకగా మారిన గోల్డ్, సిల్వర్ నగలు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
Instant Loan Apps: అర్జంట్‌గా డబ్బులు కావాలా?, నిమిషాల్లో రుణం ఇచ్చే ఇన్‌స్టాంట్ లోన్ యాప్స్ ఇవి, కానీ జాగ్రత్త!
Instant Loan: తక్షణం రూ.10,000 లోన్ తీసుకోవచ్చు - ఎవరికి ఇస్తారు, ఎలా అప్లై చేయాలి?
Trending Gold Jewellery: ధర తక్కువ, మన్నిక ఎక్కువ - ఇప్పుడు ఎవరి ఒంటిపై చూసినా ఇవే నగలు!
Building Wealth: ఈ 5 అలవాట్లు మీకు ఉంటే ధనలక్ష్మి మీ ఇంటి నుంచి వెళ్లదు గాక వెళ్లదు!
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం