By: Rama Krishna Paladi | Updated at : 11 Jun 2023 04:23 PM (IST)
హెల్త్ ఇన్సూరెన్స్ జాగ్రత్తలు ( Image Source : Pixabay )
Health Insurance:
ఆరోగ్య బీమా... ఎవరైనా ఎందుకు కొనుగోలు చేస్తారు? మెరుగైన ఆర్థిక భరోసా, అవసరమైన ప్రశాంతత కోసం! కానీ చాలాసార్లు బీమా తీసుకున్న కస్టమర్లు క్లెయిమ్ చేసుకొనేటప్పుడు ఇబ్బంది పడతారు. కొందరి క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా రిజెక్ట్ అవుతాయి. వయోవృద్ధుల బాధ చెప్పతరం కాదు! అప్పటికే ఆదాయం ఉండదు. పైగా ఎక్కువగా రోగాల బారిన పడే వయసు. అందుకే బీమా తీసుకొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
ఐదు రెట్లు ప్రీమియం
సాధారణంగా 30 ఏళ్ల వారితో పోలిస్తే సీనియర్ సిటిజెన్లు ఐదు రెట్లు ఎక్కువగా బీమా ప్రీమియం చెల్లించాల్సి వస్తుంది. ఏదైనా అనారోగ్యానికి గురైతే హాస్పిటల్స్‌లోనూ ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. ఎక్కువ మెడికేషన్ అవసరం అవుతుంది. డాక్టర్లను సంప్రదించేందుకు ఎక్కువ ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం బీమా కంపెనీలు కొన్ని కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. సులభంగా క్లెయిమ్ చేసుకొనేందుకు సాయం అందిస్తున్నాయి. అయితే క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సరైన సమాచారం ఇవ్వాలి
ఆరోగ్య బీమా తీసుకొనేటప్పుడు పూర్తి సమాచారం ఇవ్వాలి. మెడికల్ హిస్టరీ, కుటుంబ చరిత్ర, ఆస్తులు, బిల్లులు, బీమా కార్డులు ఇవ్వాలి. చాలా సందర్భాల్లో సీనియర్ సిటిజన్లు ఎలాంటి పత్రాలు ఇవ్వాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడే ఇన్సూరెన్స్ సలహాదారులు వారికి చేయూతనివ్వాలి. అన్ని పత్రాలను సమర్పించేలా చూసుకోవాలి.
టర్మ్స్ అండ్ కండీషన్స్‌తో జాగ్రత్త
సాధారణంగా బీమా పత్రాల్లో సమాచారం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన కండీషన్లు చిన్న చిన్న అక్షరాల్లో ఉంటాయి. యువకులే వీటిని చదవడానికి ఇష్టపడరు. ఏదో మొక్కుబడిగా పని కానిచ్చేస్తారు. అలాంటిది సీనియర్ సిటిజెన్లు వీటిని పరిశీలించడం కష్టమే. దురదృష్టవశాత్తు క్లెయిమ్స్ చేసుకొనేటప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండీషన్సే కొంప ముంచుతాయి. ఇలాంటప్పుడు బీమా సలహాదారులు చిన్న చిన్న వివరాలనూ అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది.
వెయిటింగ్ టైమ్ తెలుసుకోండి
కొన్ని మెడికల్ కండీషన్స్, ట్రీట్‌మెంట్‌కు బీమా కంపెనీలు వెయిటింగ్ టైమ్ పెడతాయి. సీనియర్ సిటిజన్లు దీనిపై అవగాహన కలిగి ఉండాలి. అలాగే రెనివల్ చేయడంపై దృష్టి సారించాలి. సరైన సమయంలో రెనివల్ చేస్తేనే ప్రయోజనాలు లభిస్తాయి. క్లెయిమ్స్ చేసేటప్పుడు ఇబ్బందులు ఎదురుకావు. చాలా సందర్భాల్లో మూడేళ్లు పాలసీ తీసుకున్నాకే సర్జరీలకు అనుమతి వస్తుంది.
డిజిటల్ సపోర్ట్
ఒకప్పుడు క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. టెక్నాలజీ రాకతో ఇప్పుడు చాలా వరకు ఇబ్బందులు తొలగిపోయాయి. డిజిటల్ పద్ధతిలోనే క్లెయిమ్స్ చేసుకోవడం సాధ్యమవుతోంది. కంపెనీలు కస్టమర్ సపోర్ట్ అందిస్తున్నాయి. వీటిని సమర్థంగా ఉపయోగించుకోవాలి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Tax On Salaries In India: ఐఏఎస్, ఐపీఎస్‌లు రూపాయి కూడా పన్ను కట్టక్కర్లేదా, రూల్స్ అలా ఉన్నాయా?
Common Mistakes: ఈ పొరపాట్ల వల్ల స్టాక్ మార్కెట్‌లో 70 శాతం మంది డబ్బు గల్లంతు - ఆ తప్పులు మీరు చేయొద్దు!
Tax Rate Hike: సిగరెట్లు, కూల్‌డ్రింక్స్, బట్టల రేట్లు పెంపు! - కొత్త ఏడాదిలో పన్ను పోటు
Health Insurance Rejection Reasons: గుండె జబ్బు చికిత్సల బీమా క్లెయిమ్ రిజెక్ట్ కావడానికి కారణాలివే!, ముందే అలెర్ట్ కావడం మంచిది
Gold-Silver Prices Today 03 Dec: పెరిగిన 24K, 22K పసిడి రేట్లు - ఈ రోజు బంగారం, వెండి తాజా ధరలు ఇవీ
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Harish Rao Phone Tapping Case: నా భార్యతో ఫోన్ సంభాషణలు విన్నారు, హరీష్ రావుపై కేసులో కీలక ఆధారాలు బయటపెట్టిన చక్రధర్