search
×

Interest Rates Impact on EMI: వడ్డీ రేట్లలో కొద్దిపాటి పెరుగుదల మీ ఈఎంఐని గణనీయంగా ఎలా పెంచుతుంది?

Increase your EMI | వడ్డీ రేట్లు పెరిగే మీ ఈఎంఐలపై ప్రభావం చూపుతాయి. పర్సనల్ లోన్లపై వడ్డీ రేట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ విషయాలు తెలుసుకుంటే మీకు ఓ అవగాహన వస్తుంది.

FOLLOW US: 
Share:

పర్సనల్ లోన్స్ పై వడ్డీ రేట్ల గురించి మరియు తిరిగిచెల్లింపు పై వాటి ప్రభావము గురించి మీరు తెలుసుకోవలసినది.

మీరు ఒక పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు, ప్రిన్సిపల్ మొత్తముతో కలిపి మీరు ఎంత తిరిగి చెల్లించాలి అనేది వడ్డీ రేటు నిర్ణయిస్తుంది. వడ్డీరేటులో నామమాత్రపు పెంపు కూడా మీ ఆర్ధిక పరిస్థితిపై ఒత్తిడి పెడుతూ మీ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ (ఈఎంఐలు) ను గణనీయంగా పెంచవచ్చు. ఋణము తీసుకొనుటకు నిర్ణయాన్ని తీసుకోవడములో ఈ ప్రభావాన్ని అర్థంచేసుకోవడం కీలకమైనది.

ఈఎంఐ ల వెనుక ఉన్న గణితం

పర్సనల్ లోన్ పై ఈఎంఐలు ఋణ మొత్తము, వడ్డీ రేటు మరియు కాలపరిమితి ఉపయోగించి లెక్కించబడతాయి. ఈ సూత్రములో కాంపౌండింగ్ ఉంటుంది, ఇది వడ్డీ రేట్లలో చిన్న మార్పు ప్రభావాన్ని పెంచుతుంది. ఉదాహరణకు, ఒకవేళ పర్సనల్ లోన్ పై వడ్డీ 10% నుండి 11% వరకు పెరిగితే, ముందుగా ఈఎంఐలో పెంపు నామమాత్రముగా కనిపించవచ్చు. అయితే, సుదీర్ఘ కాలపరిమితిలో ఈ వ్యత్యాసము ఒక పెద్ద మొత్తముగా పోగౌతుంది.

5 సంవత్సరాల కాలపరిమితికి రూ. 5 లక్షల పర్సనల్ లోన్ ను పరిగణించండి:

  • 10% వడ్డీతో: ఈఎంఐ = రూ. 10,624
  • 11% వడ్డీతో: ఈఎంఐ = రూ. 10,871

వడ్డీ రేట్లలో ఈ కొద్దిపాటి పెంపు నెలవారి చెల్లింపును రూ. 247 వరకు పెంచుతుంది, తద్వారా అయిదు సంవత్సరాలకు రూ. 14,820 అదనంగా పెరుగుతుంది.

రేట్ మార్పులు ఎలా సంభవిస్తాయి?

  1. మార్కెట్ పరిస్థితులు: ద్రవ్యోల్బణం వంటి ఆర్ధిక కారకాలు లేదా సెంట్రల్ బ్యాంక్ పాలసి మార్పులు వడ్డీ రేట్లను ప్రత్యక్షంగా ప్రభావితంచేస్తాయి.
  2. ఋణము రకము: ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో పర్సనల్ లోన్స్ హెచ్చుతగ్గులకు ఎక్కువగా ఆకర్షితం అవుతాయి.
  3. క్రెడిట్ ప్రొఫైల్: తక్కువ క్రెడిట్ స్కోర్స్ ఉన్న ఋణగ్రహీతలు తరచూ ఆర్ధిక సవరణల సమయములో అధిక రేట్లను ఎదుర్కొంటారు.

వడ్డీ రేట్ల గురించి మీరు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?

పర్సనల్ లోన్ పై వడ్డీ లో చిన్న మార్పులు మీ ఆర్థిక బాధ్యతలను మార్చగలవు. ఈఎంఐ లు ఎక్కువగా ఉంటే వినియోగ ఆదాయాన్ని తగ్గించగలవు మరియు మీ నెలవారి బడ్జెట్ పై ఒత్తిడి తీసుకొని రాగలవు. మార్కెట్ ను పర్యవేక్షించడం లేదా వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు ఫిక్స్డ్ రేట్ లో లాక్ చేయడం అవసరం.

వడ్డీ రేట్ల పెరుగుదలలను నిర్వహించడం

  1. సరైన ఋణ కాలపరిమితిని ఎంచుకోవడం

ఈఎంఐలు అధికంగా ఉన్నప్పటికీ, స్వల్పకాలిక కాలపరిమితి అధిక వడ్డీ రేట్ల ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు, ఋణాన్ని 5 సంవత్సరాలలో చెల్లించడం కంటే 3 సంవత్సరాలలో తిరిగిచెల్లించడం వడ్డీని ఆదా చేస్తుంది. 

2. మీ ఋణాన్ని రీఫైనాన్స్ చేయడము

తక్కువ రేట్లతో లోన్ ఇచ్చే ఒక ఋణదాతకు మారడం పెరిగే ఖర్చులను సరిచేయవచ్చు. ఒక ఋణాన్ని రీఫైనాన్స్ చేయడానికి మీరు ప్రాసెసింగ్ ఫీజును మరియు మొత్తం ఖర్చును అంచనా వేయాలి.

3. మీ క్రెడిట్ స్కోర్ ను పెంచుకోవడము

అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగి ఉండడం వలన పోటీ వడ్డీ రేట్ల వద్ద ఋణాలను సురక్షితం చేసుకోవడాన్ని నిర్ధారిస్తుంది, తద్వారా భారీ ఈఎంఐ బరువుల అవకాశాన్ని తగ్గిస్తుంది.

పర్సనల్ లోన్స్ ఏ విధంగా సహాయపడగలవు

ఒక బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ తన ఫ్లెక్సిబిలిటి మరియు సౌకర్యము వలన ఒక మంచి ఎంపిక అవుతుంది. ఇది మీకు కనీస డాక్యుమెంటేషన్ తో క్రమమైన ప్రక్రియను అందిస్తుంది. ఋణగ్రహీతలు తమ దరఖాస్తు పై తక్షణ ఆమోదాన్ని పొందగలరు మరియు వారు 24 గంటలలోపు* నిధులు అందుకోగలరు. అధిక ఋణ మొత్తాలు, కనీస పేపర్ వర్క్, మరియు త్వరిత పంపిణీలతో, మీ చిన్నాపెద్ద ఖర్చులను నిర్వహించుకోవడం సులభం అవుతుంది. ఆన్లైన్ సాధనాలను ఉపయోగించి మీకు కావలసిన నిధులను అందుకోండి మరియు తిరిగిచెల్లింపులను తెలివిగా ప్లాన్ చేయండి.

బడ్జెట్ ప్లానింగ్ ప్రాముఖ్యత

ఒక పర్సనల్ లోన్ అందుకునే ముందు, మారుతున్న వడ్డీ రేట్లలో నెలవారి చెల్లింపులను అంచనావేయుటకు ఒక ఈఎంఐ కాలిక్యులేటర్ ను ఉపయోగించండి. ఆర్ధిక ఒత్తిడి లేకుండా భవిష్యత్తులో రేట్ల పెంపులకు అనుగుణంగా బడ్జెట్ ప్లానింగ్ చేయడం కీలకమైనది.

ముగింపు

వడ్డీ రేట్లలో కొద్దిపాటి పెరుగుదల మీ ఈఎంఐలను గణనీయంగా పెంచవచ్చు, ఇది మీ ఆర్ధిక ప్రణాళికను ప్రభావితం చేయవచ్చు. రేట్ నిర్మాణాలను మూల్యీకరిస్తూ మరియు తిరిగిచెల్లింపులను తెలివిగా నిర్వహిస్తూ ఒక పర్సనల్ లోన్ ను జాగ్రత్తగా ఎంచుకోవడం ద్వారా, మీరు రేట్ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని తగ్గించుకోగలరు. మెరుగైన ప్లానింగ్ కొరకు ఋణ ఎంపికల గురించి ఎప్పుడు తెలుసుకుంటూ ఉండండి మరియు ఈఎంఐ కాలిక్యులేటర్ వంటి సాధనాలను ఉపయోగించండి.

This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

Published at : 30 Dec 2024 01:36 PM (IST) Tags: Business News #telugu news Personal Finance EMI News

ఇవి కూడా చూడండి

State Bank Vs Post Office FD: ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై ఎక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది?

State Bank Vs Post Office FD: ఐదేళ్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై ఎక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది?

EPFO: మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్‌ చేయండి

EPFO: మీ UAN వేరొకరి IDతో లింక్ అయిందా?, దానిని ఇలా డిలీట్‌ చేయండి

Bank Loan: ఆస్తి తనఖా పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా? - ఈ విషయాలు తెలీకపోతే నష్టపోతారు!

Bank Loan: ఆస్తి తనఖా పెట్టి లోన్‌ తీసుకుంటున్నారా? - ఈ విషయాలు తెలీకపోతే నష్టపోతారు!

Bitcoin Crash: బిట్‌కాయిన్‌లో బ్లడ్‌ బాత్‌ - 1,02,000 స్థాయికి పతనం, ఏంటి కారణం?

Bitcoin Crash: బిట్‌కాయిన్‌లో బ్లడ్‌ బాత్‌ - 1,02,000 స్థాయికి పతనం, ఏంటి కారణం?

Gold-Silver Prices Today 23 Jan: రూ.82,000 పైనే పసిడి నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

Gold-Silver Prices Today 23 Jan: రూ.82,000 పైనే పసిడి నగల రేట్లు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే

టాప్ స్టోరీస్

Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!

Harish Kumar Gupta: ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా!

Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు - ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ? అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్

Anantapur News: ఎవరో పిలిచినట్లుగా వెళ్లి దూకేశాడు  -  ఇలా కూడా ప్రాణం తీసుకుంటారా ?   అనంతపురం విద్యార్థి ఆత్మహత్య వీడియో వైరల్

Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!

Maoists Death: మావోయిస్టు ప్రస్థానం పూర్తయినట్టేనా? - టాప్ లీడర్లు అవుట్, సాయుధ ఉద్యమం క్లైమాక్స్‌కు చేరిందా!

Akhanda 2 Thaandavam First Review: ఫస్టాఫ్‌ పైసా వసూల్... సెకండాఫ్‌ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్‌ ఫస్ట్‌ రివ్యూ

Akhanda 2 Thaandavam First Review: ఫస్టాఫ్‌ పైసా వసూల్... సెకండాఫ్‌ అంతకు మించి, బాక్సులు బద్దలే - 'అఖండ 2'పై తమన్‌ ఫస్ట్‌ రివ్యూ