By: ABP Desam | Updated at : 12 Jan 2023 12:20 PM (IST)
Edited By: Ramakrishna Paladi
తగ్గుతున్న సేవింగ్స్ ( Image Source : Pexels )
Household financial Savings:
భవిష్యత్తు అవసరాల కోసం కుటుంబాలు దాచుకొనే సొమ్ము రాను రాను తగ్గిపోతోంది. FY22లో జీడీపీలో 7.3 శాతంగా ఉన్న నికర ఆదా సొమ్ము ఈ ఏడాది ప్రథమార్థంలో 4 శాతానికి తగ్గిపోయిందని అంచనా. పెరిగిపోతున్న ఖర్చులు, ఇంటి అవసరాల కోసం వీటిని ఖర్చు చేస్తున్నారని సమాచారం.
ప్రస్తుత ఆర్థిక ఏడాది ప్రథమార్ధంలో కుటుంబాల సేవింగ్స్ రూ.5.2 లక్షల కోట్లు ఉండొచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. 2022లో ఇది రూ.17.2 లక్షల కోట్లని వివరించింది. రాబోయే త్రైమాసికాల్లో దాచుకొనే సొమ్ము పెరగకపోతే ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంటుంది. ఫలితంగా వినియోగం, పెట్టుబడులపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చివరి ఐదేళ్లలో కుటుంబాల ఆదా జీడీపీలో 20 శాతంగా ఉండేదని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. H1FY23లో ఇది 15.7 శాతానికి తగ్గిందని పేర్కొంది. నిత్యావసర, వినియోగ వస్తువుల ధరలు పెరగడంతో కొనుగోళ్లు చేసేందుకు ఆదా సొమ్మును వాడుతున్నారని కంపెనీ ప్రధాన ఆర్థిక సలహాదారు నిఖిల్ గుప్తా అంటున్నారు. అయితే ఈ ఆర్థిక ఏడాది ద్వితీయార్ధంలో వ్యక్తిగత ఆర్థిక వినియోగ ఖర్చులు తగ్గే అవకాశం ఉందన్నారు.
నూతన నియామకాలు తగ్గడం, డిమాండ్ తగ్గుదల, అధిక ద్రవ్యోల్బణం, ఇంటి ఈఎంఐల పెరుగుదల కుటుంబాల ఆదా సొమ్ము తగ్గేందుకు కారణాలని కొటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ విశ్లేషకులు అంటున్నారు. ఫలితంగా అన్ని రంగాల్లో డిమాండ్ తగ్గిందని పేర్కొంటున్నారు. అందుకే పండగల తర్వాత మార్కెట్ డల్‌గా ఉందంటున్నారు. రెండో త్రైమాసికంలో ఎఫ్ఎంసీజీ రంగం 8.9 శాతం వృద్ధి నమోదు చేస్తుందని నీల్సన్ కంపెనీ అంచనా వేస్తోంది. చివరి త్రైమాసికంతో పోలిస్తే 2 శాతం తక్కువేనని వెల్లడించింది. గ్రామీణ మార్కెట్లోనూ పతనం ఎక్కువగానే ఉందని తెలిపింది.
జీడీపీలో కుటుంబాల ఆదా సొమ్ము 2019, 20, 21లో వరుసగా 7.9 శాతం, 8.1 శాతం, 12 శాతంగా ఉండేది. 2022లో అది 7.3 శాతానికి తగ్గింది. ఈ ఏడాది ప్రథమార్ధంలోనే 4 శాతానికి దిగజారింది. ఇదే సమయంలో కుటుంబాల అప్పులు వరుసగా 33.5, 34.8, 39.3, ౩6.8, 36 శాతంగా ఉన్నాయని మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది.
సోషల్ మీడియాలో ఏబీపీ దేశం ఫాలో అవ్వండి:
PF Salary Limit: పీఎఫ్ జీతాల పరిమితి 25-30 వేలకు పెంచే యోచనలో ప్రభుత్వం! దీని వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం?
World Cheapest Silver Price: ప్రపంచంలో అత్యంత చౌకగా వెండి లభించే దేశం ఏదీ? భారత్ కంటే 40 వేల రూపాయల వరకు తక్కువ!
Gold and Silver Prices: నేటి బంగారం ధర: బంగారం, వెండి ధరలు తగ్గాయి, జనవరి 8న బంగారం ఎంత చౌకగా వచ్చిందో తెలుసుకోండి
YouTube Earnings : యూట్యూబ్‌లో 5,000 వ్యూస్ వస్తే ఎంత డబ్బు వస్తుంది? అసలు నిజం ఇదే
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Konaseema Youth New Business: గోదావరి సంక్రాంతి సంబరాలు చూపడానికి అమలాపురం కుర్రాళ్ల సరికొత్త ప్రయత్నం! కాన్సెప్ట్ తెలిస్తే వెంటనే ఫోన్ చేస్తారు!
Charter plane crashed: కుప్పకూలిన చార్టర్ విమానం - అయినా అందరూ సేఫ్ - ఒడిషాలో జరిగిన ఘటన వీడియో
Pawan Kalyan Pithapuram Tour: పిఠాపురం వాసుల ముంపు కష్టాలు తీర్చిన పవన్ కళ్యాణ్ - గొల్లప్రోలు నూతన వంతెన పరిశీలన
The Raja Saab Reaction : ప్రభాస్ ఓల్డ్ లుక్ మిస్సింగ్ - 'ది రాజా సాబ్'లో 8 నిమిషాల సీన్స్ యాడ్... రివ్యూస్‌పై మారుతి రియాక్షన్